kATamarAyuDA - కాటమ రాయుడా
చిత్రం : అత్తారింటికి దారేది - attAriNTiki dArEdi (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్గానం : పవన్ కళ్యాణ్
హేయ్...
కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా (3)
మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా (2)
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా...
సేపకడుపు సీరి బుట్టితి
రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
హెయ్... హెయ్... హెయ్...
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా...
కోటిమన్ను నీళ్లలోన యెలసి యేగమై తిరిగి
కోటిమన్ను నీళ్లలోన...
హెయ్... హెయ్... హెయ్...
బాపనోళ్ల చదువులెల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ (2)
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా...
సేపకడుపు సీరి బుట్టితి
రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా... హో... య్యా...
Kaatama Rayuda Song With Lyrics By Powerstar Pawan Kalyan - Attarrintiki Daaredi
చిత్రం : సుమంగళి - sumangaLi (1940)
రచన : సముద్రాల సీనియర్సంగీతం : చిత్తూరు వి. నాగయ్య
గానం : గౌరీపతిశాస్త్రి
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ (2)
కాటమరాయడ కదిరీ
నరసింహుడనేటైనయేటకాడ నిన్నే నమ్మితిరా
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ (2)
సేప కడుపున సేరి పుట్టితీ రాకాసిగాని
కోపాన సీరికొట్టితీ
ఓపినన్ని నీళ్లలోన యెలసియేగ తిరిగినీవు
బాపనోళ్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ (2)
Katama Rayuda Kadiri Narasimhuda Original Song From the Movie "SUMANGALI - 1940"
Special Note:
వాహినీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం సుమంగళి (1940). ఈ చిత్రానికి సముద్రాల వారు మాటలు, పాటలు అందించారు. సంగీత దర్శకునిగా చిత్తూరు నాగయ్యకి ఇది రెండవ చిత్రం. ఈ చిత్రంలోని ‘కాటమ రాయుడా’ పాట సాహిత్యంలో కొన్ని మార్పులు చేసి ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ పాడటంతో ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని లక్షల క్లిక్స్ సంపాదించుకుంది.