manasu needE - మనసు నీదే
చిత్రం : చిరంజీవులు (chiranjeevulu) (1956)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రిసంగీతం, గానం : ఘంటసాల
పల్లవి :
మనసు నీదే మమత నాదే
నా దానవే నే నీవాడనే (2)
చరణం : 1
చివురు మామిడి పందిళ్లనీడా
నిలిచింది చిలక నా కోసమే (2)
చివురింటి చిన్నదానా
నా దానవే నే నీవాడనే॥
చరణం : 2
కనుల కాటుక కళ్యాణ తిలకం
నగుమోము కలకల నా కోసమే (2)
చిరునవ్వు చిన్నదాన
నా దానవే నే నీవాడనే॥
చరణం : 3
పువ్వులు జల్లి పన్నీరు జల్లి దీవించి
మీ వారు పంపేరులే పువ్వులు జల్ల్లి పన్నీరు జల్లి
దీవించి మీ వారు పంపేరులే
మనసైన చిన్నదానా మీ ఇంటికి మా ఇంటికీ॥