migilindi nEnA - మిగిలింది నేనా
చిత్రం : చిరంజీవులు (chiranjeevulu) (1956)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రిసంగీతం, గానం : ఘంటసాల
పల్లవి :
మిగిలింది నేనా బ్రతుకిందుకేనా...
ఇందుకేనా
మిగిలింది నేనా బ్రతుకిందుకేనా (2)
మరచేవా ఎడబాసి మాయమయేవా (2)॥
చరణం : 1
కన్నార చూసింది కలకలా నవ్వింది (2)
మనసార దరిజేరి మురిసిపోయింది
మనసైన పాట...
మనసైన పాట మన పూలబాట
మరచేవా ఎడబాసి మాయమయేవా॥
చరణం : 2
నీవు నేను కలసి కలగన్న మన ఇల్లు (2)
ఈ తీరై కన్నీరై కూలిపోయెనా
ఆకాశమేలే అలనాటి మన ఊహ (2)
ఈ తీరై కన్నీరై రాలిపోయెనా॥
చరణం : 3
కనుల వెలుగు లేదు నీ పలుకు వినరాదు
మనసు నిలువలేదు నిన్ను మరువలేదు
భారమై విషమై రగిలే ఈ బ్రతుకెందుకో...