Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

ADavALLa kOpamlO - ఆడవాళ్ల కోపంలో

చిత్రం : చదువుకున్న అమ్మాయిలు - chaduvukunna ammAyilu (1963)

 రచన : ఆరుద్ర
 సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
 గానం : ఘంటసాల, పి.సుశీల


గీత స్మరణం
 పల్లవి
 అతడు: ఆడవాళ్ల కోపంలో అందమున్నది
 అహ! అందులోనె అంతులేని అర్థమున్నది... అర్థమున్నది
 మొదటిరోజు కోపం అదో రకం శాపం
 పోను పోను కలుగుతుంది బలే విరహతాపం
 ఆమె: బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
 తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు...
   పొత్తు కుదరదు
 చరణం : 1
 ఆ: పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
 ఒక గడుసు పిల్ల కసరగానె లోన లొటారం ॥
 అ: వగలాడి తీపితిట్టు తొలివలపు తేనెపట్టు
 ఆ తేనె కోరి చెంత చేరి చెడామడా కుట్టు ॥
 చరణం : 2
 ఆ: పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు
 కళ్లతోనె మంతనాలు చేయుచుందురు
 పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు
 తమ కళ్లతోనె మంతనాలు చేయుచుందురు
 అ: వేడుకొన్న రోజు అది పైకి పగటి వేషం
 ఆ: వెంట పడిన వీపు విమానం ॥
 చరణం : 3
 అ: చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
 అది చిక్కు పెట్టు క్రాసు వర్‌డ్ పజిలు వంటిది ॥
 ఆ: ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి
 మరుపురాని మధురమైన ప్రైైజు దొరుకునోయి ॥॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |