Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

chemmachekka 2 - చెమ్మచెక్క చెమ్మచెక్క జున్నుముక్క

చిత్రం : బొబ్బిలిరాజా - bobbili rAjA(1990)

 రచన : సిరివెన్నెల, సంగీతం : ఇళయరాజా
 గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
గీత స్మరణం
పల్లవి : అతడు: చెమ్మచెక్క చెమ్మచెక్క జున్నుముక్క చెంపనొక్క
 ఆమె: నిమ్మచెక్క నిమ్మచెక్క నమ్మకంగ తిమ్మిరెక్క
 అ: కో... అంది కోక ఎందుకో
 ఆ: కోరింది కోసి అందుకో
 అ: రాణీ... ఐ లవ్ యూ...
 ఆ: రాజా... ఐ లవ్ యూ...
 చరణం : 1
 అ: మారుమూల సోకుచేర లేఖరాయనా
 ఆ: సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా
 అ: తేరిపార చూడనీ దోర ఈడునీ
 ఆ: చీర చూరు దాటనీ వేడి ఊహనీ
 అ: వెక్కిరించు వన్నెలన్ని కొల్లగొట్టుకోనీ
 ఆ: పళ్లగాటు కత్తిరించు కన్నె కంచెలన్నీ
 అ: రా... గారంగా
 ఆ: సైరా... సారంగా...
 చరణం : 2
 ఆ: ఈటెలాటి నాటుచూపు నాటుకున్నదీ
 అ: అలవాటులేని చాటుచోట మాటుకున్నదీ
 ఆ: ఈదలేను యవ్వనం ఆదరించవా
 అ: మీదవాలు మోజుతో స్వాగతించవా
 ఆ: రంగ రంగ వైభవాల మంచుమేలుకోవా
 అ: గంగ పొంగు సంబరాల రంగుతేరనీవా
 ఆ: ఈ... ఏకాంతం...
 అ: జాలీ... హహ్హా... కైలాసం...

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |