Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

idE nA palleTUru - ఇదే నా పల్లెటూరు

చిత్రం : భద్రాచలం - bhadrAchalam (2001)

రచన : సుద్దాల అశోక్‌తేజ
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్; 

గానం : వందేమాతరం శ్రీనివాస్, ఉష
గీత స్మరణం
పల్లవి :
 అతడు: ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు
 మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా
 తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా హాయ్ హాయ్ హాయ్...    ॥నా పల్లెటూరు॥
 చరణం : 1
 ఆమె: రామునికి బాణమొకటే భార్య సీతమ్మ ఒకటి
 ఆ రాముడంటి కొడకు ఇంటింటా ఉంటే ఒకడు
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా జాయ్ జాయ్ జాయ్...
 అ: ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది
 హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా హాయ్ హాయ్ హాయ్... ॥నా పల్లెటూరు॥
 చరణం : 2
 ఆ: తొలకరిలో వానచుక్క రుచిచూస్తే తేనెచుక్క
 భూమిపై మోముపైన చిన్ని గరిక నవ్వుతుంటే
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా జాయ్ జాయ్ జాయ్...
 అ: ఆలమంద పాలధార మీటుతున్నదో సితార
 కడుపునిండా పాలు తాగి లేగదూడలాడుతుంటే
 ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
 మనసంతా హాయ్ హాయ్ హాయ్...    ॥నా పల్లెటూరు॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |