bangAru bomma rAVEmE - బంగారుబొమ్మ రావేమే
చిత్రం : రక్త సంబంధం - rakta sambandham (1962)
రచన : అనిసెట్టిసంగీతం : ఘంటసాల
గానం : పి.సుశీల
13 November - Today P. Susheela Birthday
బంగారుబొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే (2)
కళ్యాణశోభ కనగానే కనులార తనివి తీరేనే ఓ...॥
చరణం : 1
ఎనలేని నోము నోచి నీవీరోజుకెదురు చూచి
మురిపించి మనసు దోచి మది ముత్యాల ముగ్గులేసి
కలగన్న ఘడియ రాగానే తలవంచి బిడియ పడరాదే (2) ॥
చరణం : 2
అందాల హంసనడక ఈ అమ్మాయి పెళ్లినడక
ఓయమ్మ సిగ్గుపడకే వేచివున్నాడు పెళ్లికొడుకే
సూరేళ్లపంట పండేనే గారాల సిరులు పెరిగేనే (2) ॥
చరణం : 3
మనసైనవాడు వరుడు నీమదినేలుకొనెడి ఘనుడు
వేసేను మూడుముళ్లు ఇక కురిసేను పూలజల్లు
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురవుతారే
ఈళళళ... హాయి.... ఆ...
ఈ ఏటికిరువురొకటైతే మీదటికి ముగ్గురవుతారే ॥