andamaina bhAmalu - అందమైన భామలు
చిత్రం : మన్మథుడు (2002)రచన : భువనచంద్ర
సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్
Ooh baby just give me love
Ooh baby I want it now
‘‘Ooh baby‘‘
అందమైన భామలు లేత మెరుపు తీగలు (2)
ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు
అరె సిల్కు చుడీదారులు కాంజీవరం చీరలు
రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు
అయ్యోరామ ఈ భామ భలె ముద్దొస్తున్నాదే
అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే ॥
॥‘‘Ooh baby‘‘
చరణం : 1
నువ్వేనా నా కల్లోకొచ్చింది
నా మనసంతా తెగ అల్లరి చేసింది
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్‌నా
నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసేయ్‌నా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి
ఉక్కిరి బిక్కిరి చేసేయ్‌నా
హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా
॥‘‘Ooh baby‘‘
చరణం : 2
కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ నీ తోడే కోరిందే జవానీ
ఎర్రని బుగ్గలకి వేసెయ్‌నా గాలాన్ని
నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ
అన్నిట్లోకి నువ్వేమిన్న కద సుకుమారీ॥॥