andela ravamidi - అందెల రవమిది
చిత్రం (Movie) : Swarnakamalam - స్వర్ణకమలం (1988)
Music Director : Ilayaraja / ఇళయరాజాLyrics Writer : Sirivennela / సిరి వెన్నెల
Singer : S p balu / యస్ పి బాలు , Vani Jayaram / వాణి జయరాం
ఓం నమో నమో నమఃశివాయ
మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ
గంగ యాతరంగితొత్తమాంగతే నమఃశివాయ
ఓం నమో నమో నమఃశివాయ
శూలినే నమో నమః కపాళినే నమఃశివాయ
పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ
పల్లవి:
అందెల రవమిది పదములదా "2"
అంబరమంటిన హృదయముదా "అందెల"
అమృతగానమిది పెదవులదా
అమితానందపు ఎదసడిదా
సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగ యాగఫలముగ "2"
బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా... "అందెల"
చరణం:
మువ్వలు ఉరుముల సవ్వడులై - మెలికలు మెరుపుల మెలకువలై "2"
మేను హర్షవర్ష మేఘమై - వేణి విసురు వాయువేగమై
అంగభంగిమలు గంగపొంగులై హావభావములు నింగిరంగులై
లాస్యం సాగే వేళ రసఝరులు జాలువారేలా
జంగమమై జడమాడదా
జలపాతగీతముల తోడుగా
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా "అందెల"
చరణం:
నయన తేజమే
'న'కారమై
మనో నిశ్చయం
'మ'కారమై
శ్వాసచలనమే
'శి'కారమై
వాంఛితర్థమే
'వ'కారమై
యోచన సకలము
'య'కారమై
నాదం 'న'కారం
మంత్రం 'మ' కారం
స్తోత్రం 'శి'కారం,
వేదం 'వ'కారం,
యజ్ఞం 'య' కారం ఓం నమశ్శివాయ
భావనె భవునకు భావ్యము కాగా
భరతమె నిరతము భాగ్యము కాగా
తుహిన గిరుల కరిగేలా తాండవమాడేవేళ
ప్రాణ పంచకమై పంచాక్షరిగా పరమపదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకిణులై పదిదిక్కుల దూర్జటి ఆర్భటివేగా "అందెల"
OM namO namO namaHSivAya
maMgaLa pradAya gOturaMgatE namaHSivAya
gaMga yAtaraMgitottamAMgatE namaHSivAya
OM namO namO namaHSivAya
SUlinE namO namaH kapALinE namaHSivAya
pAlinE viraMcituMDa mAlinE namaHSivAya
pallavi:
aMdela ravamidi padamuladA "2"
aMbaramaMTina hRudayamudA "aMdela"
amRutagAnamidi pedavuladA
amitAnaMdapu edasaDidA
sAgina sAdhana sArthakamaMdaga yOga balamuga yAgaPalamuga "2"
bratuku praNavamai mrOgu kadA... "aMdela"
caraNaM:
muvvalu urumula savvaDulai - melikalu merupula melakuvalai "2"
mEnu harShavarSha mEGamai - vENi visuru vAyuvEgamai
aMgaBaMgimalu gaMgapoMgulai hAvaBAvamulu niMgiraMgulai
lAsyaM sAgE vELa rasaJarulu jAluvArElA
jaMgamamai jaDamADadA
jalapAtagItamula tODugA
parvatAlu prasariMcina paccani prakRuti AkRuti pArvati kAgA "aMdela"
caraNaM:
nayana tEjamE
'na'kAramai
manO niScayaM
'ma'kAramai
SvAsacalanamE
'Si'kAramai
vAMCitarthamE
'va'kAramai
yOcana sakalamu
'ya'kAramai
nAdaM 'na'kAraM
maMtraM 'ma' kAraM
stOtraM 'Si'kAraM,
vEdaM 'va'kAraM,
yaj~jaM 'ya' kAraM OM namaSSivAya
BAvane Bavunaku BAvyamu kAgA
Baratame niratamu BAgyamu kAgA
tuhina girula karigElA tAMDavamADEvELa
prANa paMcakamai paMcAkSharigA paramapadamu prakaTiMcagA
KagOLAlu padakiMkiNulai padidikkula dUrjaTi ArBaTivEgA "aMdela"
External Link:
andela ravamidi - అందెల రవమిది