brahma kaDigina - బ్రహ్మ కడిగిన
బ్రహ్మము తానెనీ పాదము ॥
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తలమోపిన పాదము
తలపక గగనము తన్నిన పాదము (2)
బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
వరమ యోగులకు పరిపరి విధముల
వరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము ॥
గానం : చిత్ర, సుజాత, అనురాధా శ్రీరాం
jagaDapu chanavula - జగడపు చనవుల
పల్లవి :గోవిందా నిశ్చలానంద మందార మకరంద
నీ నామం మధురం నీ రూపం మధురం
నీ సరస శృంగార కీర్తనలు
మధురాతి మధురం స్వామి ఆహా...
ఏమొకో... ఏమొకో చిగురుటధరమున
యెడనెడ కస్తూరి నిండెనో
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ॥
చరణం : 1
కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొనచూపులు (2)
నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా
చరణం : 2
జగడపు చనవుల జాజర సఖినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
మొల్లలు కురుముల ముడిచిన బరువున
మొల్లకు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై జల్లేరతివలు జాజర ॥
భారపు కుచముల పైపై కడు
సింగారము నె ఱపెడి గంధముడి
చేరువ పతిపై చిందగ పడతులు సారెకు జల్లేరు జాజర ॥
బింకపు కూటమి పెనగెటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు చించేరు
సంకుమ దమ్ముల జాజర ॥