Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

madi vuyyAlalUgE - మది ఉయ్యాలలూగే

చిత్రం : భలే అమ్మాయిలు - bhalE ammAyilu(1957)

 రచన : సదాశివబ్రహ్మం
 సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గీత స్మరణం
07 December : నేడు సావిత్రి జయంతి - Today SAvitri Birthday

 పల్లవి :
 ఆమె: మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే
 మాసనమానందమాయెనహో... ॥
 అతడు: ప్రేమతో గగన వీధులలో
   హాయిగా ఎగిరిపోవుదమా         (2) ॥

 చరణం : 1

 ఆ: తీయని కోరికలూరెను నాలో
 తెలియదు కారణమేమో ॥
 ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా... ప్రణయమిదేనా    (2)
 నూతన యవ్వన సమయమున ॥

 చరణం : 2

 అ: చిన్నతనమేలా సిగ్గు పడనేలా
 మన్ననలెందుకు మనలోనా ॥
 ఆ: ప్రేమలో కరగిపోవుదమా
 భేదమే మరచిపోవుదమా    ॥

 చరణం : 3

 అ: ఓ చెలియా మన జీవితమంతా
 పున్నమ వెన్నెల కాదా
 ఆ: రేయి పవలు నే నిను మురిపించి... నిను వలపించి
 ప్రేమ జగానికి కొనిపోనా ॥
 గానం : ఘంటసాల, పి.లీల

O O O ohO bangaru chilaka - ఓ ఓ ఓ... ఒహో బంగరు చిలక

 పల్లవి :

 ఓ ఓ ఓ... ఒహో బంగరు చిలక
 అహా ఎందుకె అలుక
 ఇలా చూడవు మాటాడవు మోమాటమా ॥

 చరణం : 1

 చెరువు మీద అలకైతే చెడేదెవ్వరో
 ఫలహారం మాని బాధపడేదెవ్వరో ॥
 చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా     (2)
 ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా
 వరాలొలికి పోవునా... ॥

 చరణం : 2

 ఓ ఓ ఓ ఓ...
 కనికారం లేదా కన్నెదుట నిలచినా
 అనురాగం రాదా నోరూర పిలచినా ॥
 చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా     (2)
 ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా
 వరాలొలికి పోవునా... ॥
 గానం : జిక్కి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |