tummedA O tummedA - తుమ్మెదా ఓ తుమ్మెదా
చిత్రం : శ్రీనివాస కళ్యాణం - SrInivasa kalyaNam (1987)
రచన : సిరివెన్నెలసంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి,సుశీల
పల్లవి :
ఆమె: తుమ్మెదా... ఓ తుమ్మెదా...
ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా ॥
అతడు: మగడులేని వేళ తుమ్మెదా
వచ్చి మొగమాట పెడతాడే తుమ్మెదా
ఆ: మాట వరసకంటూ తుమ్మెదా
పచ్చి మోటసరసమాడే తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా
రెచ్చి హత్తుకోబోయాడే తుమ్మెదా ॥
చరణం : 1
ఆ: ఎదురుపడితే కదలనీక దడికడతాడే
పొదచాటుకు పద పదమని సొదపెడతాడే ॥
అ: ఒప్పనంటే వదలడమ్మా
ముప్పు తప్పదంటే బెదరడమ్మా ॥
చుట్టుపక్కలే మాత్రం చూడని ఆత్రం
పట్టు విడుపులేనిదమ్మా కృష్ణుని పంతం ॥॥
చరణం : 2
ఆ: తానమాడువేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చూడ ఎగబడతాడే ॥
అ: చెప్పుకుంటే సిగ్గుచేటు
అబ్బ నిప్పులాంటి చూపు కాటు ॥
ఆ: ఆదమరచి ఉన్నావా కోకలు మాయం
ఆనక ఏమనుకున్నా రాదే సాయం ॥॥