Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

jIvitamE oka ATa - జీవితమే ఒక ఆట

 చిత్రం : కొండవీటి దొంగ - konDavITi donga (1990)

 రచన : వేటూరి, సంగీతం : ఇళయురాజా
 గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఈ పాటకు ట్యూన్ తెలుసా?

 పల్లవి :
 జీవితమే ఒక ఆట సాహసమే పూబాట (2)
 నాలో ఊపిరి ఉన్నన్నాళ్లూ ఉండవు మీకు కన్నీళ్లు
 అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్లు
 ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు (2) ॥
 చరణం : 1
 అనాధజీవుల... ఉగాది కోసం...
 అనాధజీవుల ఉగాది కోసం
   సూర్యుడిలా నే ఉదయిస్తా
 గుడిసె గుడిసెనూ గుడిగా మలచి
   దేవుడిలా నే దిగి వస్తా    ॥
 బూర్జువాలకూ... భూస్వాములకూ...
 బూర్జువాలకూ భూస్వాములకూ
   బూజు దులపక తప్పదురా
 తప్పదురా తప్పదురా తప్పదురా... ॥
 చరణం : 2
 న్యాయదేవతకు... కన్నులు తెరిచే...
 న్యాయదేవతకు కన్నులు తెరిచే
   ధర్మదేవతను నేనేరా
 పేద కడుపుల ఆకలిమంటకు
   అన్నదాతనై వస్తారా ॥
 దోపిడిరాజ్యం... దొంగ ప్రభుత్వం...
 దోపిడిరాజ్యం దొంగ ప్రభుత్వం
   నేలకూల్చక తప్పదురా
 తప్పదురా తప్పదురా తప్పదురా... ॥

paNTa chElO pAla - పంటచేలో పాలకంకి

చిత్రం : పదహారేళ్ళ వయసు - padahArELLa vayasu (1978)

 రచన : వేటూరి
 సంగీతం : చక్రవర్తి
 గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి :
 అతడు: పంటచేలో పాలకంకి నవ్విందీ
 పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
 పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
 లేతపచ్చ కోనసీమ ఎండల్లా
 అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
 గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే ॥॥
 చరణం : 1
 ఆమె: శివ గంగ తిరనాళ్లలో
   నెలవంక స్నానాలు చెయ్యాలా
 చిలకమ్మ పిడికిళ్లతో
   గొరవంక గుడిగంట కొట్టాలా
 అ: నువ్వు కంటి సైగ చెయ్యాలా
 నే కొండ పిండి కొట్టాలా
 మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా    (2)
 ఆ నవ్వుకే  ఈ నాపచేను పండాలా ॥॥
 చరణం : 2
 ఆ: గోదారి పరవళ్లలో
   మా పైరు బంగారు పండాలా
 ఈ కుప్ప నూర్పిళ్లతో మా ఇళ్లు వాకిళ్లు నిండాలా
 అ: నీ మాట బాట కావాలా
   నా పాట ఊరు దాటాలా
 మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా     (2)
 ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా ॥॥

tAtA vIDukOlu - టాటా వీడుకోలు

చిత్రం : బుద్ధిమంతుడు - buddimantuDu (1969)

 రచన : ఆరుద్ర
 సంగీతం : కె.వి.మహదేవన్
 గానం : ఘంటసాల

ఈ పాటకు ట్యూన్ తెలుసా?
 అక్కినేనికి నివాళి

 పల్లవి :
 టాటా వీడుకోలు... గుడ్ బై ఇంక సెలవు (2)
 తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా 
తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా ॥ 
 చరణం : 1
 ప్రియురాలి వలపులకన్నా
   నులివెచ్చనిదేదీ లేదని     (2)
 నిన్నను నాకు తెలిసింది
   ఒక చిన్నది నాకు తెలిపింది
 ఆ... ప్రేమనగరుకే పోతాను పోతాను
   పోతాను...
 ఈ కామనగరుకే రాను... ఇక రాను ॥
 చరణం : 2
 
 ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని 
ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని
 లేటుగ తెలుసుకున్నాను
   నా లోటును దిద్దుకున్నాను
 ఆ... స్నేహనగరుకే పోతాను పోతాను
   పోతాను...
 ఈ మోహనగరుకు రాను... ఇక రాను ॥ 
 చరణం : 3 
 మధుపాత్రకెదలో ఇంక ఏమాత్ర ం చోటులేదని 
మధుపాత్రకెదలో ఇంక ఏమాత్ర ం చోటులేదని
 మనసైన పిల్లే చెప్పింది...     (2)
 నా మనసంతా తానై నిండింది     (2)
 నే రాగనగరుకే పోతాను
 అనురాగనగరుకే పోతాను పోతాను...

mayyA mayyA - మయ్యా మయ్యా

చిత్రం : పైసా - paisA (2014)

రచన : సిరివెన్నెల
సంగీతం : సాయికార్తిక్
గానం : విజయ్‌ప్రకాష్

ఈ పాటకు ట్యూన్ తెలుసా?
 పల్లవి :
 మయ్యా మయ్యా మయ్యా మయ్యా మయ్యా
 అరేబియా ఒయాసిస్సులా ఎదురైందయ్యా
 అమ్మాయిలో అదేం మాయో
   మనసే లాక్కుందయ్యా
 రూపాయే పాపాయై నాకే దిల్ దే దియా
 మమ్మాయ మాయ మాయమా
   మాయా మాయా     (2) ॥
 హే బాల హే బాల... డూ...     (3)
 చరణం : 1
 రెయిన్‌బో రంగేళి రంభల్లే దిగి వస్తే
 నా రాంబో నువ్వంటూ రంగంలో దింపేస్తే
 గోలార్ గోల్డ్ ఎదురై క్యాట్‌వాకింగ్ చూపెడితే
 డాలర్ డార్లింగై ఒళ్లో వాలితే
 నిగనిగలాడే ఆ లేడి నన్నొల్లేసిందయ్యా
 ధగధగలాడే సొగసంతా నా సొమ్మేనందయ్యా ॥॥
 చరణం : 2
 భూటాన్ బంపర్ లాట్రీ బుగ్గే కొరికేస్తే
 లక్ష్మీబాంబ్ గుండెల్లో భమ్మని పేలిందంటే
 కాబోయే రాణి నా కౌగిట్లో పడితే
 కాని కుర్రగాణ్ని నన్నే లవ్వాడితే
 బేజా అంతా బేజారై నే బేహోష్ అయిపోయా
 ఇంకేం చేస్తాం రాజాలా నేన్ తయ్యారైపోయా ॥॥

AkkinEni - Greatest movies

అక్కినేని చిత్రాలు...మేలిమి ముద్రలు


తెలుగు చలనచిత్ర చరిత్రలో లెజెండ్ ఏఎన్నార్. 255 చిత్రాల కథానాయకుడు(‘మనం’ మినహాయించి). వాటిల్లో 25 మేటి భూమికల  అభినయ విశేషాలను తెలిపే చిరు ప్రయత్నమిది.

భరణీ సంస్థ నిర్మించిన తెలుగు, తమిళ భాషల్లో తొమ్మిది చిత్రాల్లో నటించారు అక్కినేని. చిత్రత్రయం లైలా-మజ్ను, విప్రనారాయణ, బాటసారి తన నట జీవితంలో చిరస్మరణీయమని పలుమార్లు ఆయనే చెప్పారు.

1. లైలా మజ్ను (1949): అక్కినేని హీరోగా నటించిన పదవ చిత్రం. సమ వయస్కురాలైన భానుమతి కాంబినేషన్‌లో విషాద ఛాయలున్న ఖయస్ నటనలో పరిణతి కోసం, హీరోలో ఉన్న బిడియం పోవటం కోసం వీరిద్దరినీ బీచ్‌లో షికార్లు చేయమని, చనువు ఏర్పడటంతో నటన బాగుంటుందని ప్రోత్సహించారు దర్శకులు రామకృష్ణ. ‘పలుకవే నా ప్రేమ సితార’ అంటూ లైలాతో తిరుగుతూ గీతం పాడినప్పుడు ఎంత హుషారుగా ఉంటాడో, ఆమె మరొకరిని వివాహమాడి ఇరాక్‌కు వెళ్లినప్పుడు ఆమెను జనానా వద్ద చూసి ఖిన్నుడై, ‘జీవన మధు భాండమే పగిలె తునాతునకలై’ అని విషాద భావాలు అంత గొప్పగా పలికించారు.

 2. విప్రనారాయణ (1954): ‘తార్కిక భావాలున్న నువ్వు భక్తుడైన విప్రనారాయణ పాత్ర ధరించడమేమి’టని విమర్శించిన దర్శకులు కె.వి.రెడ్డి అంచనాలను తారుమారు చేస్తూ ఆనాటి విప్రనారాయణుడు అక్కినేనే అన్నంత ఘనంగా ఆ పాత్రను పోషించారు. శుశ్రూషలు చేసిన దేవదేవి నయగారాలకు వివశుడై, ‘మధురమధురమీ చల్లని రేయి’ అని ఆనందాన్ని వ్యక్తం చేసిన విప్రనారాయణుడు... తనపై మహారాజు దొంగతనం నేరం మోపినప్పుడు, ఈ శిక్ష తనకు తగినదేనని పశ్చాత్తాపపడినప్పుడు పాత్రలో లీనమైపోయారు.

 3. బాటసారి (1961): శరత్‌చంద్ర బెంగాలీలో రాసిన ‘బడదీది’ ఆధారం. సురేంద్ర జమీందారు బిడ్డ. ఉన్నత చదువులున్నా లోకజ్ఞానం అంతంతే! చిత్రమంతా కలిపి కేవలం రెండు మూడు పేజీల డైలాగులే! అవి కూడా పొడి పొడి మాటలు. తనవల్ల తన ఆరాధ్య దేవత మాధవికి అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు ఆవేశం పతాక స్థాయిని చేరి, ఆమె ఒడిలో తలదాల్చి, తన మనసును ఆవిష్కరించి అంతిమ శ్వాస విడిచిన సన్నివేశం అమోఘం.

 4. పౌరాణికం - భూకైలాస్ (1958): అక్కినేని పౌరాణికాల్లో ‘భూకైలాస్’లోని  నారద పాత్ర యెన్నదగినది. శివభక్తి పరాయణుడైన రావణబ్రహ్మను నిలువరించి, హెచ్చరించి, లోకానికి మేలు చేసే విధంగా రచయిత మలచిన, నారద పాత్రలోని యుక్తి, ఛలోక్తి అన్నిటినీ రసవత్తరంగా తన నటనలో చూపారు.

 5. జానపదం- సువర్ణసుందరి (1957):  ‘సువర్ణ సుందరి’లోని జయంత్ పాత్ర సాదాసీదా అంటారు అక్కినేని. కానీ ఎన్నో షేడ్స్ ఉన్నాయి.  తొలి దశలో అందాల రాకుమారుడు. సువర్ణ సుందరిని  దివి నుంచి భువికి రప్పించిన శృంగార నాయకుడు. దుష్ట త్రయానికి (కైలాసం, చాదస్తం, ఉల్లాసం) బుద్ధి చెప్పిన ధీరోదాత్తుడు.  అంజలీ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించినప్పుడు అక్కినేనిని బలవంతంగా ఒప్పించారు నిర్మాత. సూపర్ హిట్టయిన ఆ చిత్రం అక్కినేని నట జీవితంలో ఏకైక హిందీ చిత్రంగా నిలిచిపోయింది.

 6. జయభేరి (1959): జానపదం అనగానే మంత్రాలు, మాయలు, కత్తియుద్ధాలు అనే నానుడిని పూర్వ పక్షం చేస్తూ సంగీత, సాహిత్యాలతో కూడా జానపదం తీసి రంజింపచేయొచ్చు అని నిరూపించిన చిత్రం ‘జయభేరి’. సంగీత విద్వాంసుడు కాశీనాథ్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు అక్కినేని. ‘రసికరాజ తగువారము కామా’ పాట చిత్రీకరణలో, చరణదాసి సంగీత ఆరోహణ అవరోహణ విన్యాసాలకు తగ్గట్టు పెదవుల కదలిక కోసం ఇంటివద్ద అద్దం ముందు నిలబడి రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు.

 7. చారిత్రకం- అనార్కలి (1955): మొగల్ యువరాజు సలీం సామాన్య నర్తకి అనార్కలిని ప్రేమించి, తండ్రితో యుద్ధానికి తలపడ్డ సన్నివేశాల్లో శృంగారం, ఆవేశం సమపాళ్లలో అభినయించారు. అక్బరు చక్రవర్తి స్వయంగా మరణశిక్ష అమలుపరచటానికి సిద్ధపడ్డ సన్నివేశంలో ‘బలహీనులు కాకండి జహాపనా’ అంటూ సెంటిమెంటుతో తండ్రిని కలవర పరచిన సన్నివేశంలో ఎస్.వి.రంగారావుకు దీటుగా నటించారు అక్కినేని.

 8. తెనాలి రామకృష్ణ (1956): చతుర చమత్కార కవి తెనాలి రామకృష్ణుని తన అభినయంతో ఆంధ్ర ప్రేక్షకులకు అందించారు అక్కినేని. తెలివిగా రాజసభలో ప్రవేశించి, క్లిష్టమైన ఏనుగుల పంపకాన్ని యుక్తితో పరిష్కరించటం, కృష్ణసాని ద్వారా రాయలకు కలగబోయే ముప్పును ఆడ వేషంలో పరిష్కరించటం, ‘మేక తోకకు మేక’ అంటూ ముప్పతిప్పలు పెట్టటం, పతాక సన్నివేశంలో తోటమాలి వేషంలో ‘చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా’ అంటూ పాడి చక్రవర్తి బాబరు మెప్పు పొంది రాజ్యాన్ని రక్షించటం - ఈ సన్నివేశాల్లో తెనాలి రామకృష్ణుని సాక్షాత్కరింపజేశారు.

 9. మహాకవి కాళిదాసు (1960): అజ్ఞానుడైన కాళునిగా ‘ఛాంగుభళా వెలుగు వెలగరా నాయనా’ అంటూ ఎంత అమాయకంగా నటించారో... దేవి కటాక్షంతో విజ్ఞాన దీపం వెలిగి, శ్యామలా దండకం చదివిన పండితునిగానూ ఓహో అనిపించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కాళిదాస కౌస్తుభ’ పురస్కారంతో అక్కినేనిని సత్కరించింది.

 10. అమరశిల్పి జక్కన (1964): ‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో’ అని కీర్తించి, నర్తకి మంజరిని ఆరాధించి, పెళ్లాడి, ఆ తర్వాత మహారాజు ఎదుట నర్తించినందుకు అనుమానించి, దూరంగా వెళ్లిపోయి, కాలం గడిచాక కుమారుడి చేతిలో శిల్పిగా ఓటమినంగీకరించి, చేతులు నరుక్కుని పరితపించిన జక్కనగా ఆ పాత్రకు ప్రాణం పోశారు.

 11. చాణక్య-చంద్రగుప్త (1977): ఎన్టీయార్ ఈ చిత్రాన్ని తలపెట్టి, తను చాణక్యుడిగా వెయ్యాలని, అక్కినేని చంద్రగుప్తునిగా నటించాలని తెలుపగా, అక్కినేని తనకు చాణక్యుడు కావాలని పట్టుబట్టారు. మెట్ల మీద నుంచి చాణక్యుని నవనందులు పడదోసినప్పుడు శిగ ముడి విడివడగా, వారి అంతం చూస్తానని శపథం చేసిన సన్నివేశంలో పింగళి రాసిన సంక్లిష్ట సమాసాలను భావస్ఫోరకంగా పలికి అందానికి తగ్గట్టు కళ్లల్లో చండ్ర నిప్పులు కురిపించిన తీరు అపూర్వం.

 12. నవలా చిత్ర నాయకుడు- దేవదాసు (1953): భారతీయ భాషల్లో ఓ డజను ‘దేవదాసు’లు రాగా, అగ్రగామిగా నిలిచింది అక్కినేని ‘దేవదాసు’.  దేవదాసు పాత్ర పోషణలో మద్యం మత్తుతో కళ్లు మూతపడుతుంటాయి. ఈ ఎఫెక్టు కోసం ఆ సన్నివేశాలను రాత్రి వేళల్లో చిత్రించారు. నాగేశ్వరరావు పెరుగు అన్నంతో సుష్టుగా భోంచేసి షూటింగ్‌కు వెళ్లేవారు. నిద్రమత్తుతో కళ్లు తూగిపోయేవి. మైండ్‌ను కంట్రోల్‌లో ఉంచుకుని నటించటంతో ఆ సన్నివేశాలు  రాణించాయని తెలిపారు అక్కినేని.

 13. అర్ధాంగి (1955): ‘స్వయంసిద్ధ’ బెంగాలీ నవలకు తెర రూపం. జమీందారు పెద్దకొడుకు రాఘవేంద్రరావు పెళ్లాం మెడలో తాళి కట్టేటంతటి అమాయకుడు. ఈ సన్నివేశాల్లో అమాయకత్వం... అర్ధాంగి రాధ స్వయంకృషి వల్ల మార్పు చెందాక పెద్దరికం... పాత్రలో వచ్చిన మార్పుల గ్రాఫ్‌కు తగ్గట్టుగా బాలెన్స్‌డ్‌గా నటించారు.

 14. పూజాఫలం (1964): మునిపల్లెరాజు ‘పూజారి’ నవల ఆధారం. బి.ఎన్.రెడ్డి- అక్కినేని కాంబినేషన్‌లో ఏకైక చిత్రం. లోకజ్ఞానం లేని కథానాయకుడు మధు. తన జీవితంలోకి ప్రవేశించిన ముగ్గురమ్మాయిలు వాసంతి (జమున), సీత (సావిత్రి), వేశ్య నీలనాగిని (ఎల్.విజయలక్ష్మి). వారివల్ల తన జీవన విధానంలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపారు. క్యారెక్టరైజేషన్ అనే దానిని అభినయం ద్వారా నిర్వచించారు.

 15. డాక్టర్ చక్రవర్తి (1964): కోడూరి కౌసల్యాదేవి ‘చక్ర భ్రమణం’ నవలకు తెర రూపం. పాఠకుల సూచన మేరకు అన్నపూర్ణ సంస్థ వారు పాత్రధారులను ఎంపిక చేశారు. చక్రవర్తికి పూర్వాశ్రమంలో ప్రేమించిన శ్రీదేవి దూరం కావటం, పెద్దలకిచ్చిన మాట ప్రకారం నిర్మలను పెళ్లాడి అశాంతికి లోనవడం, చనిపోయిన చెల్లెలు సుధను నవలా రచయిత్రి మాధవిలో చూసుకొని మురిసిపోవటం - ఫలితంగా అపార్థాలు; మానసిక సంఘర్షణను సంయమనంతో నటించి నట చక్రవర్తి అనిపించారు.

 16. ప్రేమనగర్ (1971): ఇదీ కోడూరి కౌసల్యాదేవి నవలే. ‘అనుభవించు, సుఖించు, తరించు’ అనే ఉమరఖయ్యూం ఫిలాసఫీని నమ్మిన కథానాయకుడు కల్యాణ్. లత రాకతో అతని జీవితం ప్రభావితమౌతుంది. ఒకానొక సందర్భంలో ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాడు. ప్రేమ మందిరాన్ని నిర్మించి, అందులో ప్రేయసిని ప్రతిష్టించి, ఆ ప్రేమ భగ్నమైనప్పుడు ‘ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం’ అని విలపిస్తాడు. ఆత్రేయ రచనతో దృశ్యకావ్యంగా నిలిచింది.

 17. విభిన్న భూమికలు- రోజులు మారాయి (1955): అభ్యుదయ భావాలు గల రైతు నాయకుడు వేణు పాత్రలో పల్లెటూరి నుంచి వచ్చిన అక్కినేని సహజంగా ఒదిగిపోయారు.

 18. ఇలవేలుపు (1956): దర్శకులు ఎల్.వి.ప్రసాద్, వైద్యం పొందిన ప్రకృతి ఆశ్రమం నేపథ్యంలో రూపొందిన కథ. శేఖర్ ఆశ్రమవాసి అయిన శారదను ప్రేమిస్తాడు. విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన తండ్రి శారదను పెళ్లాడటం, ప్రేయసిని తల్లిగా చూడాల్సి రావడం, తర్వాత లక్ష్మిని పెళ్లి చేసుకోవటం, భర్తను ఆమె అనుమానించడం, మానసికంగా సంఘర్షణకు లోనైన శేఖర్ పాత్ర అక్కినేనికి అగ్నిపరీక్ష. తట్టుకుని నిలబడ్డారాయన.

 19. భార్యాభర్తలు (1961): నెగెటివ్ టచ్ ఉన్న కథానాయకుడి పాత్ర ఆనంద్. అమ్మాయిలతో ఆడీపాడీ... ఆనంద్ కోరి, వెంటాడి, శారదను పెళ్లిచేసుకుంటాడు. తొలిరాత్రి ఆమె నుంచి ఎదురైన ప్రతిఘటనకు బదులుగా ఆమెలో మార్పువచ్చేదాకా వేచి ఉంటాడు. మబ్బులన్నీ తొలగిపోయాక, హత్యానేరంపై జైలుకు వెళ్లి భార్య సహకారంతో బయటపడతాడు.

 20. ఇద్దరు మిత్రులు (1961): కథానాయకుని పరంగా తొలి ద్విపాత్రాభినయం. ఆస్తీ అంతస్తూ ఉన్నా శాంతి లేని జమీందారు అజయ్‌బాబు. ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్నా పేదరికంతో అల్లాడే విజయబాబు. ఈ రెండు పాత్రల వైవిధ్యాన్ని సున్నితంగా ఆవిష్కరించారు. రాజేశ్వరావు అందించిన సుమధుర సంగీతం ఈ చిత్రానికి అండగా నిలిచింది.

 21. మూగమనసులు (1964): ఆదుర్తి అద్భుత సృష్టిగోదావరిపై పడవ నడిపే సరంగు గోపి. అమ్మాయిగారంటి సావిత్రికి గోపీపై ఉన్నది ఆరాధనా? ఆప్యాయతా? ఆకర్షణా? వీటన్నిటనీ కలగలిపిన విలక్షణ భావమా?  అక్కినేని, సావిత్రి పోటీపడి తెరపై పండించారు. అందుకే తెలుగువారి సజీవ స్రవంతిలో ‘గోదావరి’లా మిగిలిపోయిందీ చిత్రం.

 22. దసరాబుల్లోడు (1971): పులి వేషాలు, నెమలి వేషాలు, బావా మరదళ్ల సరదాలు, సరసాలు, ప్రేయసీ ప్రియుల చేలగట్ల ప్రణయరాగాలు, సెంటిమెంట్లు... ఇవన్నీ కలగలిసిన పల్లెలూరి కుటుంబ కథాచిత్రంలో కీలకమైన గోపీ పాత్ర ద్వారా సగటు ప్రేక్షకుడికి దసరా బుల్లోడు ఎలా ఉంటాడో చూపించారు దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్.

 23. ప్రేమాభిషేకం (1981): దేవి ప్రేమను దక్కించుకోవటం కోసం వేశ్య జయంతితో కలిసి నాటకమాడిన రాజేష్, దేవి ప్రేమ సఫలమయ్యాక, క్యాన్సర్ కారణంగా ఆ దేవిని దూరం చేసుకోవటానికి జయంతితో కలిసి మరో నాటకమాడటం - అద్భుతమైన దాసరి రూపకల్పన రాజేష్ పాత్ర.

 24. మేఘసందేశం (1982): దాసరి మరో అద్భుత సృష్టి. కవి రవీంద్ర తనలో చైతన్యాన్ని కలిగించిన నర్తకి పద్మకు చేరువై, భార్య పార్వతికి దూరమై, ఆ పద్మ దూరమైనప్పుడు ‘విన్నవించు నా చెలికీ విరహ వేదనా’ అంటూ మేఘాలతో తన బాధలను నివేదించి, తుదకు ఇంటికి వచ్చి తనువు చాలించి ఆత్మ పద్మ వద్దకు చేరడం... భార్యను అన్యాయం చేశానన్న భావన, పద్మ పట్ల అనురక్తి... వీటిని ఆవిష్కరించటం అక్కినేనికే చెల్లింది.


 25. సీతారామయ్యగారి మనవరాలు (1991): అరవై ఏడేళ్ల వయసులో అక్కినేనికి లభించిన సహజమైన పాత్ర. కోనసీమ యాస, పల్లెటూరి పెద్దమనిషి - మానవ జీవితంలోని భావోద్వేగాలను హృదయాలకు హత్తుకునేలా  ఆవిష్కరించారు. తెలుగుతెరపై అక్కినేని నిజంగా నటసమ్రాట్.

andAniki andam - అందానికి అందం

చిత్రం : సిరిసిరిమువ్వ - sirisirimuvva (1976)

 రచన : వేటూరి
 సంగీతం : కె.వి.మహదేవన్
 గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

ఈ పాటకు ట్యూన్ తెలుసా?
 పల్లవి :
 అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
 అందరికీ అందనిదీ పూచిన కొమ్మా ॥
 పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...
 చరణం : 1
 పలకమన్న పలకదీ పంచదార చిలక
 కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక
 పలకమన్న పలకదీ పంచదార చిలక
 కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక
 ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
 ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
 నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
 పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ... ॥
 చరణం : 2
 ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
 నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
 ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
 నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
 ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో
 ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో
 గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
 పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ... ॥
 వచనం: ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
 ముందు జన్మ వుంటే ఆకాలి మువ్వనై పుడతాను
 పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...

endukO nIvu nAtO - ఎందుకో నీవు నాతో

చిత్రం : కృష్ణవేణి - KrushnavENi (1974)

 రచన : దాశరథి
సంగీతం : విజయభాస్కర్
 గానం : వి.రామకృష్ణ, పి.సుశీల
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
 పల్లవి :
 అతడు: ఎందుకో నీవు నాతో ఉన్నవేళ
   ఇంత హాయి
 ఆమె: ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన
   నిలువలేనోయి
 అ: ఎందుకో నీవు నాతో ఉన్నవేళ
   ఇంత హాయి
 ఆ: ఎందుకో నిన్ను విడిచి నిమిషమైన
   నిలువలేనోయి
 చరణం : 1
 అ: మనసులోని మమతలన్నీ
   మల్లెపూలై విరిసె నీకై     (2)
 ఆ: వలపులన్నీ పూలమాలై
   కురులలోన కొలిచె నీకై
 అ: ఎన్ని జన్మలకైనా... నీవు నాదానివేనే
 ఇద్దరు: ఇందుకు సాక్ష్యము గిరులు తరులు
   గిరులు తరులు... ॥
 చరణం : 2
 ఆ: నీలికన్నుల ఆలయాన
   నిన్ను స్వామిగ నిలుపుకోనా     (2)
 అ: ఎల్లవేళలా జీవితాన
    నిన్ను దేవిగా కొలుచుకోనా
 ఆ: గౌరీశంకరుల చందం
   మనది విడిపోని బంధం
 ఇద్దరు: ఇందుకు సాక్ష్యము సూర్యుడు చంద్రుడు
   సూర్యుడు చంద్రుడు... ॥

rAve nA cheliyA - రావె నా చెలియా

చిత్రం : జీన్స్  - Jeans (1998)

 రచన : ఎ.ఎం.రత్నం - A. M. ratnam, శివగణేష్ - SivagaNEsh
 సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ - A. R. Rehman
 గానం : సోను నిగమ్ - sOnu nigam, హరిణి - hariNi
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : 
అతడు: రావె నా చెలియా రావె నా చెలియా
   రయ్యంటు రావె చెలి
 వారెవ్వా చెలియా వయసైన చెలియా
   ఊరంతా గోల చెయ్యి
 ఆమె: మమతకు నువ్వు ప్రతిబింబం
   తల్లికన్నా గారాబం
 చిననాటి అనురాగం వయసైతే అనుబంధం
 అ: ఏ అవ్వా నా గువ్వా
   నువ్వింకా అందం దోచెయ్యి ॥॥
 చరణం : 1
 అ: జీన్స్ పాంటు వేసుకో లిప్ స్టిక్కు పూసుకో
 నిజమైన తలనెరుపే
   డై వేసి మార్చుకో...ఓ... యే...
 ఆ: ఓలమ్మో ఏమి చోద్యం
   నా వయసే సగమాయే
 అ: క్లింటన్ నంబరు చేసిస్తాను గలగలమంటూ
   ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి
 ఆ: నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు
   మిస్ ఓల్డని చెప్పేయి ॥
 చరణం : 2
 ఆ: ఓ... కంప్యూటర్ పాటలకు
   పులివేషం నువ్వాడు
 అ: ఎంటీవీ ఛానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు
 టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్యి బామ్మా
 డిస్నీలాండులో కళ్లాపి జల్లి బియ్యపు పిండితో
   ముగ్గులు వేద్దాం రాబామ్మా
 రోడ్డు మధ్యలో కొట్టేపెట్టి
   గారెలు వేసి అమ్ముదామా ॥

chUddAm Akasam - చూద్దాం ఆకసం

చిత్రం : విక్రమ సింహ - vikrama simha (2014)

 రచన : చంద్రబోస్ - chandrabose
 సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ - A. R. rehman
 గానం : ఎస్.పి.బాలు, బృందం - SP bAlu and troope

గీత స్మరణం
 పల్లవి
 చూద్దాం ఆకసం అంతం...      (2)
 వేద్దాం అక్కడే పాదం ॥
 మళ్లీ పుట్టి మహినే గెలిచి
 ఎల్లలు దాటిన యోధా
 గాలుల గీతాలే ఎన్నడూ ఆగవులే
 గెలుపను దప్పిక ఎప్పుడూ తీరదులే తీరదులే
 హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు
 హే... మాతృదేశంలో సంతోషం పండించు
చరణం : 1
 ఆకాశం అడ్డొస్తే ఎగిరే పక్షైపోదాం
 మహాశిఖరమే అడ్డొస్తే దాటి మేఘాలౌదాం
 అరణ్యమొస్తే గాలైపోదాం
 సముద్రమొస్తే చేపైపోదాం
 వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం
 వెంటేపడుతుంది విజయం విజయం విజయం
 లక్ష్యం ఎన్నటికీ దీక్షకి బంధువురా
 విజయం ఎప్పటికీ చెమటకి చుట్టమురా ॥

చరణం : 2
 మనసు ధనస్సు మాట బాణం
 ఎప్పుడైనా తప్పబోదు
 కొదమసింహమా గెలిచి పోరాడు పోరాడు...
 వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం
 వెంటేపడుతుంది విజయం విజయం విజయం
 అందరి దీవెనతో ఆయువు పొందానే
 మీకే నా బ్రతుకే అంకితమిస్తానే
 హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు
 హే... మాతృదేశంలో సంతోషం పండించు ॥

ammAyi nachchEsindi - అమ్మాయి నచ్చేసింది

చిత్రం : నువ్వే నువ్వే - nuvvE nuvvE(2002)

రచన : సిరివెన్నెల - sirivennela
 సంగీతం : కోటి - kOTi
గానం : రాజేష్ - rAjesh, కౌసల్య - kousalya
గీత స్మరణం
 పల్లవి :
 అతడు: అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది
 ఓ ముద్దమందారంలా ముస్తాబయ్యింది
 ఆమె: వైశాఖమొచ్చేసింది ఇవ్వాళో రేపో అంది
 ఓ మంచి ముహూర్తం చూసి సిద్ధం కమ్మంది
 అ: ఓ ఓ ఓ... ఈ కబురు విన్న ఎదలో
   ఎన్నెన్ని పొడుపుకథలో
 ఆ: మనువే కుదిరి కునుకే చెదిరి
 మురిపెం ముదిరి నా మనసు నిలవనంది
 కొమ్మల్లో చిలక మోమాటం పడక వచ్చి వాలమ్మా ॥
 చరణం : 1
 అ: ఈ గాలి రోజూలా వీస్తున్నా ఈవేళ వేరేలే వింటున్నా
   సన్నాయి రాగాలుగా
 ఆ: నావైపు రోజూలా చూస్తున్నా
   ఈనాడే ఏదోలా ఔతున్నా
 నీ కన్ను ఏమన్నదో... నా ఈడు ఏం విన్నదో
 అ: ఆశపెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా
 ఆ: నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూవుంటే ఎట్టా
 అ: ఎన్నెన్నో అనిపించి ఉక్కిరిబిక్కిరి ఔతున్నా॥॥
 చరణం : 2
 ఆ: ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో
   తిప్పించి ఊరేగనీ హాయిగా
 అ: అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ల కౌగిళ్లే అందించి
   ఊరించు ఆ వేడుక... ఓ... ఊహించ నీ నన్నిలా
 ఆ: ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చగొట్టేలా నువ్వు
 అ: ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తోందే నువ్వు హోయ్
 ఆ: కవ్వించి కరిగించి కరిగే వయసును కాపాడు
 ఆ: కొమ్మల్లో చిలక మోమాటం పడకా వచ్చి వాలమ్మా॥

srusTikarta oka brahma - సృష్టికర్త ఒక బ్రహ్మ

చిత్రం : అమ్మరాజీనామా - amma rAjInAmA (1991)

 రచన : దాసరి నారాయణరావు - dAsari nArAyaNarAo
 సంగీతం : చక్రవర్తి - Chakravarti
 గానం : కె.జె.ఏసుదాస్ - K. J. yEsudAs

పల్లవి :
 సృష్టికర్త ఒక బ్రహ్మ
 అతనిని సృష్టించినదొక అమ్మ ॥
 ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
 ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో ॥
 చరణం : 1
 బొట్టుపెట్టి పూజచేసి
 గడ్డి మేపి పాలు తాగి
 వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోతకోత ॥
 విత్తునాటి చెట్టు పెంచితే...
 చెట్టు పెరిగి పళ్ళు పంచితే...
 తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మితే
 లోకమా ఇది న్యాయమా? (2) ॥
 చరణం : 2
 ఆకుచాటు పిందె ముద్దు
 తల్లిచాటు బిడ్డ ముద్దు
 బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు ॥
 ఉగ్గుపోసి ఊసు నేర్పితే...
 చేయిబట్టి నడక నేర్పితే...
 పరుగు తీసి పారిపోతే
 చేయిమార్చి చిందులేస్తే
 లోకమా ఇది న్యాయమా? (2) ॥

nuvvEmi chESAvu nEram - నువ్వేమి చేశావు నేరం

చిత్రం : పెళ్లి చేసుకుందాం - peLLi chEsukundAm  (1997)

రచన : సిరివెన్నెల
 సంగీతం : కోటి. గానం : కె.జె.ఏసుదాస్

గీత స్మరణం
నేడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు - K. J. yEsudAs Birthday

 పల్లవి :
 నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా     (2)
 చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా
 కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
 మార్గం చూపే దీపం కాదా ధైర్యం    ॥
 చరణం : 1
 జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
 దేహానికైనా గాయం ఈ మందుతోను మాయం
 విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం
 అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
 స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
 పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
 ఇల్లాళ్ల దేహాలలో శీలమే ఉండదనా
 భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా
 శీలం అంటే గుణం అనే అర్థం    ॥
 చరణం : 2
 గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం
 తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం
 తన కళ్ల ముందు ఘోరం కాదనదు పిరికి లోకం
 అన్యాయమన్న నీపై మోపింది పాప భారం
 పడతి పరువు కాచే చేవలేని సంఘం
 సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం
 ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
 అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్లది
 అంతేగాని నీలో లేదే దోషం  ॥

manasu kAsta - మనసు కాస్త

చిత్రం : శ్రీకారం - SreekAram (1996)

సంగీతం : ఇళయరాజా - ILayarAkA
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి - sirivennela sItArAma SAstri
గానం : కె.జె.ఏసుదాస్ - K. J. yEsudAs

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనులనీరు తుడుచువారు
ఎవరులేరని చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరడమన్నది !!

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు

కలసిరాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరుఉన్న తరువేదైనా
తనువే మోడైనా
మాను జన్మకన్నా - మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మా
బేలవై నువ్వు కులితే నేలపై ప్రాణం ఉండడమ్మా

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది

ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు !
పరిమార్చవే కీడు !
కాళివైతే కాలి కింద అణుగును చూడు !
నిను అణిచేవాడు
మృత్యువు మించే హాని ఎక్కడుంది
ఎంత గాయమైన మాని తీరుతుంది
అందుకే పద ముందుకే
లోకమే రాదా నీ వెనకే

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు

Yaaj and Upyaaj assure Drupad that he will be blessed with a boy

Mahabharat - 8th January 2014 : Ep 82




Rukmini questions Krishna whether the Pandavas are alive. Krishna hopes that they are alive. Drupad confronts Shikhandini for giving water to a rishi. He decides to kill the rishi. Yaaj and Upyaaj stop Drupad from killing him. They assure him that he will be blessed with a boy, if he accepts a girl. Yaaj and Upyaaj enlighten Drupad that the girl will change history. Meanwhile, Kunti distributes the food among her sons. The Pandavas feed each other.

External Link:
Link - 1
Link - 2

Bhishma finds the burnt weapons of the Pandavas

Mahabharat : 7th January 2014 : Ep 81




Bhishma finds the burnt weapons of the Pandavas in the ruined palace. He assumes that the Pandavas are no more. He returns to Hastinapur with the burnt weapons of the Pandavas and immerses them in the holy river, Ganga. The kingdom of Hastinapur grieves over the demise of the Pandavas. Bhishma decides to punish Duryodhan for his misdeeds. Vidura tells Bhishma that he had alerted Yudhisthir about Duryodhan and Shakuni's conspiracy, and the Pandavas might be alive. Arjun suggests his brothers to disguise as Brahmins.

External Link:
Link - 1
Link - 2

The Pandavas dig a tunnel to escape from the burning palace

Mahabharat : [Full Episode] - 6th January 2014 : Ep 80




Purochan sets up the palace on fire. Bheem suggests Arjun to use Varunastra to calm down the fire. However, Arjun suggests Yudhisthir that they can escape from the underground. While escaping, Arjun and Kunti get separated from the other Pandavas. Later, Arjun throws Kunti and asks Bheem to catch her. The Pandavas decide to wait for Arjun. However, Arjun manages to meet his brothers. The Pandavas dig a tunnel to escape. Bhishma uses Varunastra to calm down the fire, on seeing the burning palace.

External Link:
Link - 1
Link - 2

On Kunti`s insistence, Arjun decides not to return to Hastinapur

Mahabharat : [Full Episode] - 3rd January 2014 : Ep 79




Arjun learns about Duryodhan's conspiracy against them and informs about the same to Yudhishthir. Purochan's son eavesdrops on their conversation and informs Purochan. On seeing that the mouse died after eating the sweet, Yudhishthir, Arjun, Nakul and Sahdev stop Kunti from eating it. Kunti becomes sad on learning about Duryodhan's plan and informs Yudhishthir, Bheem, Arjun, Nakul and Sahdev that they will not return to Hastinapur. On Kunti's insistence, Arjun decides not to return to Hastinapur.

External Link:
Link - 1
Link - 2

Arjun learns about the conspiracy against them

Mahabharat - [Full Episode] - 2nd January 2014 : Ep 78




On reading Shakuni's message, Purochan decides to set the palace on fire. Purochan poisons the sweet dish. On Sahdev's suggestion, Bheem takes sweet for the mouse. Bheem asks Sahdev to call Yudhishthir, Arjun and Nakul for dinner. Arjun becomes shocked on learning that the palace is built of lacquer and informs about the same to Yudhishthir, Sahdev and Nakul. He learns about the conspiracy against them. Purochan's son eavesdrops on their conversation and informs the same to him.

External Link:
Link - 1
Link - 2