Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

ilA chUDu arachEta - ఇలా చూడు అరచేత

చిత్రం : నీ స్నేహం - nee snEham (2002)

 రచన : సిరివెన్నెల
 సంగీతం : ఆర్.పి.పట్నాయుక్
 గానం : రాజేష్, ఉష, బృందం

ఈ పాటకు ట్యూన్ తెలుసా?
 పల్లవి :
 అతడు: ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
 ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
 ఈ అనుభవం వెన్నెల వర్షం
 ఎలా తెలపటం ఈ సంతోషం
 బృందం: ఓ... హనీ...
 అ: ఐ లవ్ యూ
 బృం: ఓ... హనీ...
 అ: ఐ నీడ్ యూ
 చరణం : 1
 అ: నమ్మనంటావో ఏమో నిజమే తెలుసా
 అమృతం నింపె నాలో నీ చిరుస్పర్శ
 ఆమె: ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా
 రెప్పనేదాటి రావే కలలో ఆశ
 అ: పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని
   నిన్నే చూసి కలకోసం
 ఆ: సర్లేకాని చీకట్లోనె చేరుకోని
   నువ్వుకోరె అవకాశం
 అ: తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం ॥చూడు॥
 చరణం : 2
 అ: వానలా తాకగానే ఉరిమే మేఘం
 వీణలా మోగుతుంది ఎదలో రాగం
 ఆ: స్వాగతం పాడగానే మదిలో మైకం
 వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం
 అ: ఉన్నట్టుండి నిన్నట్నుండి
   రాజయోగం దక్కినంత ఆనందం
 ఆ: అయ్యోపాపం ఎక్కడ్లేని ప్రేమరోగం
   తగ్గదేమో ఏమాత్రం
 అ: తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం ॥చూడు॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |