Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
నేను నువ్వంటు వేరై ఉన్నా
నాకీవేళ నీలో నేనున్నట్టుగా
అనిపిస్తూ ఉందే వింతగా
నాకోసం నేనే వెతికేంతగా
నువ్వే లేకుంటే ఏమౌతానో
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా
కాదంటే నామీదొట్టుగా
ఏమైనా చేస్తా నమ్మేట్టుగా
ఒకసారి చూసి నే వలచానా
నను వీడి పోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గాఢంగా
నా ప్రేమ లోతులో మునిగాకా
నువు పైకి తేలవే సులభంగా
ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ...

చరణం : 1
నిజాయితీ ఉన్నోడిని
నిజాలనే అన్నోడిని
అబద్ధమే రుచించని అబ్బాయినీ
ఒకే ఒక మంచోడిని
రొమాన్స్‌లో పిచ్చోడిని
పర్లేదులే ఒప్పేసుకో సరేననీ
ముసుకేసుకోదు ఏనాడు
నా మనసే ఓ భామ
నను నన్నుగానే చూపిస్తూ
కాదన్నా పోరాడేదే నా ప్రేమా
చరణం : 2
తిలోత్తమా తిలోత్తమా
ప్రతిక్షణం విరోధమా
ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా
ఓ... గ్రహాలకే వలేసిన
దివే అలా దిగొచ్చినా
ఇలాంటి ఓ మగాడినే చూళ్లేవమ్మా
ఒకనాటి తాజ్‌మహలైనా
నా ముందు పూరిల్లే
ఇక పైన గొప్ప ప్రేమికుడై
లోకంలో నిలిచే పేరే నాదేలే... ఓ...

చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : నరేష్ అయ్యర్
అడిషినల్ వాయిస్ : నదీష, యూవి జాకీ

పల్లవి :
గాలికి కులమేదీ... (2)
ఏదీ... నేలకు కులమేదీ...

మింటికి మరుగేదీ ఏదీ... (2)
కాంతికి నెలవేదీ

చరణం : 1
పాలకు ఒకటే... ఆ...
పాలకు ఒకటే తెలి వర్ణం
ఏదీ ప్రతిభకు కలదా ఫలభేదం
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతభేదం

చరణం : 2
జగమున యశమే...
జగమున యశమే మిగులునులే
అదీ యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడుచునులే (2)

చిత్రం : కర్ణ (1964)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.సుశీల

పల్లవి : అవును నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరదా ఇక నిలవదుగా
తెలుసు కదా... ఆ... ఆ... ఆ...
తెలిసిందే అడగాలా
అడగందే అనవేలా
చెవిలో ఇలా చెబితే చాలా అవును

చరణం : 1
కసిరేస్తున్నా మనసుకి వినపడదో ఏమో
విసిరేస్తున్నా నిను విడి
వెనుకకు రాదేమో
నిదరోతున్నా ఎదురై కనబడతావేమో
కదలాలన్నా కుదరని
మెలి పెడతావేమో
అంతగా కంట చూడనని
మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని
ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదు కదా
తెలుసు కదా... ఆ... ఆ... ఆ...
తెలిసే ఇలా చెలరేగాలా అవును

చరణం : 2
సుడిగాలిలో తెలియని
పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి
సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని
వివరములడిగానా
ఎద ఏమందో వినమని
తరుముకు రాలేనా
తప్పుకో కళ్ళు మూసుకుని
తుళ్ళి రాకే నా వెంటా
ఒప్పుకో నిన్ను నమ్మమని
అల్లుకుంటా నీ జంటా
నడపదుగా నిను నది వరదా
తెలుసు కదా... ఆ... ఆ... ఆ...
తెలిసే ఇలా ముంచెయ్యాలా అవును

చిత్రం : అతడు (2005)
రచన : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ
గానం : కె.కె., సునీత