Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : అద్దాలమేడ (1981)
రచన : దాసరి నారాయణరావు
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


పల్లవి :
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై కావ్యానికి నాయికవై
వరించి తరించి ఊరించక రావే కావ్యనాయిక ॥జీవిత॥

చరణం : 1
నేను కవిని కాను కవిత రాయలేను
శిల్పిని కాను నిను తీర్చిదిద్దలేను
చిత్రకారుని కానే కాను
గాయకుణ్ణి అసలే కాను
ఏమీకాని నేను నిను కొలిచే పూజారిని
నీ గుండెల గుడిలో ప్రమిదను పెట్టే పూజారిని
నీ ప్రేమ పూజారిని ॥జీవిత॥

చరణం : 2
నేను రాముణ్ని కాను విల్లు విరచలేను
కృష్ణుణ్ని కాను నిను ఎత్తుకు పోలేను
చందురుణ్ని కానే కాను
ఇందురుణ్ని అసలే కాను
ఎవరూ కాని నేను నిను కొలిచే నిరుపేదను
అనురాగపు దివ్వెలు
చమురును నింపే ఒక పేదను
నే నిరుపేదను... ॥జీవిత॥

24 June - నేడు మురళీమోహన్ బర్త్‌డే

Listen Song: nA jIvita gamanamulO

చిత్రం : వుంచి వునసుకు వుంచి రోజులు (1958)
రచన : కొసరాజు రాఘవయ్యచౌదరి
సంగీతం, గానం : ఘంటసాల

సాకీ :
వేళగాని వేళలో ఊరు విడిచి దూరంగా...
కారెక్కి ఒంటిగా...
గాలిమేయ వచ్చిన బూచి నంగనాచీ...
పల్లవి :
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట ॥
గుట్టు నిమిషంలో తెలిసిందిలే
గుండె దిగజారి నిలుచుందిలే ॥॥
చరణం : 1
చల్లని వెన్నెల కాస్తుంటే
చల్లగా ఇంట్లో నేనుంటే
తలుపుమూసి చెప్పకనే... ఏ...
దౌడేసిన రాకాసి... ఓ రాకాసి ॥
చరణం : 2

ఏ బస్తీ కిలాడీ...
నా పేరే పల్లెటూర్ వస్తాదు రౌడీ
నీ తెలివంతాజూసి నను గెలిచావా లేడీ
చిక్కావు చేతిలో కేడీ షోకైన లేడీ అహ్హహ్హహా... ॥

23 June - నేడు కొసరాజు జయంతి

చిత్రం : బంగారుబాబు (1973)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల


పల్లవి :
శ్రీరామచంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా ॥

చరణం : 1
పగలంతా ఇద్దరము ఆలుమగలము
పడుకునే వేళకు పక్కలే దూరము ॥
ఊరివారికందము ఉత్తుత్తి కాపురము (2)
నోరూరతున్న మనకేమో ఓపలేని తాపము ॥

చరణం : 2
అన్నివున్న అందగత్తె అందుబాటులో ఉన్నా
అన్నమాట కోసమే ఆశలన్ని అణచుకున్నా ॥
ఉన్నవన్ని ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా (2)
కన్నెకున్న హద్దులకు కట్టుబడి ఊరుకున్నా ॥

చరణం : 3
కళ్లలోకి చూడకు కాళ్లు కలిపి నడవకు
మూడుముళ్లు పడేవరకు మోమాట పెట్టకు ॥
ఆ మంచిరోజు వచ్చును హద్దులెగిరిపోవును
ఆ మంచిరోజు వచ్చును హద్దులెగిరిపోవును
కాచుకున్న వయసు కచ్చి అప్పుడే తీరును ॥

21 June - నేడు కె.వి.మహదేవన్ వర్ధంతి