Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : ఒకరికి ఒకరు (2003)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కీరవాణి, గంగ, బృందం

పల్లవి : అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో (2)
జనకుని కూతురు జానకి అల్లోనేరేళ్లో
జాజుల సోదరి జానకి అల్లోనేరేళ్లో
మిథిలా నగరిని జానకి అల్లోనేరేళ్లో
ముద్దుగా పెరిగిన జానకి అల్లోనేరేళ్లో
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో ॥
చరణం : 1
ఏటిపాయల పాపిటకి
కుంకుమబొట్టే ఆభరణం
ఎదురుచూపుల కన్నులకి కాటుకరేఖే ఆభరణం
పుడమినంటని పదములకి
పసుపు వన్నెలే ఆభరణం
పెదవి దాటని మాటలకి
మౌనరాగమే ఆభరణం
మగువ మనసుకి ఏనాడో
మనసైన వాడే ఆభరణం ॥
చరణం : 2
చేయిజారిన చందమామని అందుకోగలనా
రాయలేని నా ప్రేమలేఖని అందజేయగలనా
దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా
చేరువై నా మనోవేదన మనవిచేయగలనా
నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా ॥

చిత్రం : విప్రనారాయణ (1954)
రచన : సముద్రాల రాఘవాచార్యులు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఎ.ఎం.రాజా


పల్లవి :
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా (2)
పాలించర రంగా

చరణం : 1
మరువని తల్లివి తండ్రివి నీవని
మరువని తల్లివి తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా
మొరవిని పాలించే దొరవని
మొరవిని పాలించే దొరవని
శరణంటినిరా శ్రీరంగా
పాలించర రంగా

చరణం : 2
మనసున నీ స్మృతి మాయకమునుపే (2)
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా... ఆ... ఆ...
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా రంగా
కనియద మనసారా...
పాలించరా రంగా పరిపాలించరా రంగా

చరణం : 3
కరులును హరులును మణిమందిరములు (2)
సురభోగాలను కోరనురా (2)
దరి కనరానీ భవసాగరమును
దాటించుమురా గరుడ తురంగా ॥

19 July - నేడు సముద్రాల సీనియర్ జయంతి



External Link:
R A A G A

చిత్రం : శివ (1989), రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా, గానం : మనో, ఎస్.జానకి


పల్లవి :
సరసాలు చాలు శ్రీవారు వేళకాదు
విరహాల గోల ఇంకానా వీలుకాదు ॥
వంటి ంట్లో గారాలు ఒళ్లంతా కారాలే సారు
చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటింట్లో వాడరాదు

చరణం : 1
సూర్యుడే చురచుర చూసినా
చీరనే వదలరు చీకటే చెదిరినా
కాకులే కేకలు వేసినా
కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికీ సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోపుగా కావాలనే సర దా
పాపిడి తీసి పౌడరు పూసి
బయటికే పంపేయనా
పైటతో బాటే లోనికి రానా పాపలా పారాడనా
తీయగ తిడుతూనే లాలించనా...॥

చరణం : 2
కొత్తగా ముదిరిన వేడుక
మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందరా
బొత్తిగా కుదురుగ ఉండనే ఉండదా
ఆరారగా చేరకా తీరేదెలా గొడవ
ఆరాటమే ఆరనా సాయంత్రమే పడదా
మోహమే తీరే మూర్తమే రాదా
మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరి రాగానికా
ఆగదే అందాకా ఈడు గోల॥
ఊరించే దూరాలు ఊ అంటే తీయంగా తీరు ॥