Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : భలేతమ్ముడు (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు
గానం : మహ్మద్ రఫీ, పి.సుశీల


పల్లవి :
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే (2)

చరణం : 1
అహహా ఆ... అహహా ఆ...
కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని (2)
కనుల తెరచీ విలువ తెలిసి (2)
మనసే గుడిగా మలచితిని ॥

చరణం : 2
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను (2)
ఆరని వలపుల హారతి వెలుగుల (2)
కలకాలం నిను కొలిచెదను॥

చరణం : 3
చిలిపిగ కసిరే...
చిలిపిగ కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను అహ్హహ్హ
చేతులు సాచి చెంతకు చేరిన (2)
ఆ చెలినే అందుకున్నాను (2)
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే ॥

31 July - నేడు మహ్మద్ రఫీ వర్ధంతి

చిత్రం : అదృష్టవంతులు (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్, గానం : ఘంటసాల


పల్లవి :
అయ్యయ్యో బ్రహ్మయ్యా
అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే
ఎంత గుమ్ముగా ఉండేదయ్యా యా యా యా! ॥

చరణం : 1
చిక్కని మీగడ తరకల్లాగ చక్కనైన చెక్కిళ్లు
పసినిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్లు ॥
బెట్టుచూపి గుట్టుదాచే గడసరి సొగసరి కళ్లు
బెట్టుచూపి గుట్టుదాచే గడసరి సొగసరి కళ్లు
కొంత కోడెతనముంది
మరికొంత ఆడతనముంది ॥

చరణం : 2
మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టులేదూ
బెదురుచూస్తే ఎవ్వరితోనూ కుదిరినట్టులేదూ ॥చూస్తే॥
ఆ కసరులోనె అలకనవ్వుల విసురు లేకపోలేదు
కొంత చిలిపితనముంది
మరికొంత కలికితనముంది ॥

చరణం : 3
బులిపించే సొగసున్న
ఓ బుల్లోడా నిను చూస్తుంటే
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే ॥
కన్నెపిల్లలే చూశారా కన్నుగీటక మానేరా (2)
కవ్వించే కౌగిలిలో కరగించక ఒదిలేరా ఓయ్... ॥

చిత్రం : మన్మథుడు (2002),
రచన : సిరివెన్నెల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : షాన్


పల్లవి :
చెలియా చెలియా చెయిజారి వెళ్లకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
నడిరేయీ పగలూ చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీ దాకా
పడిలేచే కెరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకేదాకా ఆగదు నా కేక ॥

చరణం : 1
కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా
కలయికే కల అనీ మాయమైపోకుమా
గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా
చెరిపినా చెరగనీ గాయమైపోకుమా
మౌనమా అభిమానమా పలకవా అనురాగమా
ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా
అడుగడుగు తడబడుతూ
నిను వెతికి వెతికి కనులు అలసిపోవాలా ॥

చరణం : 2
నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనా
చెలిమితో సమరమా ఇంతగా పంతమా
నిలవకే హృదయమా
పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా అంత సందేహమా
వేరుచేసే కాలమా చేరువైతే నేరమా
దాడిచేసే దూరమా దారి చూపుమా

విరహాలే కరిగేలా జత కలిపి
నడుపు వలపు కథలు గెలిచేలా ॥
PICTURE: Shaan