Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : నిన్నేప్రేమిస్తా (2000)
రచన : వెనిగళ్ల రాంబాబు
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
ఒక దేవత వెలసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
ఒక దేవత వెలసింది నా కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని...॥దేవత॥

చరణం : 1
విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోన
నీ నీడే చూశానమ్మా
ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన
నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
ఒదిగింది నీలోనే అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
మును ముందుకు వచ్చే నెచ్చెలినే చూసి
అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని
॥దేవత॥

చరణం : 2
రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగ పోసి
పూయించా నీ జడకోసం
రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా
పూజించా నీ జతకోసం
నీరెండకు నీ వెంటే నీడై వచ్చి
మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి
ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
ఇన్నాళ్లూ అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని
॥దేవత॥

Photo : వెనిగళ్ల రాంబాబు

చిత్రం : సై (2004),
రచన : చంద్రబోస్, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : కళ్యాణిమాలిక్, స్మిత, వసుంధరాదాస్


పల్లవి :
మనకు తగ మనిషొకడుండి వాడిలోన
వేడి ఉంటే యాయాయా
ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి
ఆడుకుంటే యాయాయా
చంటైనా బుజ్జైనా ముసుగేసికొచ్చింది మూర్తై
జానైనా శీనైనా బాయ్‌ఫ్రెండ్ కాబోయేదెవడైనా
సై స స ససై... నువు సైయన్న అనుకున్నా సై

చరణం : 1
ఫేస్‌కి మాస్కున్నా చల్తాహే
చల్ చల్ చల్ మనసుకు వేస్కోకురా
పరిచయమవకున్నా పర్వానై నైనైనై
ఫిగరుని మిస్‌కాకురా
ఉన్నది మాలో వేకె న్సీ టేక్ ఎ చాన్స్ బేబీ
కలిసెను మీతో ఫ్రీక్వెన్సీ మేక్ ఎ మూవ్ బేబీ
కిస్సిస్తూ కిలో లెక్కనా అప్ అప్ ఆపైనా
కొలిచేస్తూ గజాలెక్కనా వన్ మోర్ ఇంచ్
నచ్చినవన్నీ చేసినవాడికి
వెచ్చని కరెన్సీ ఇచ్చేసెందుకు సై
సై సై సై సై సై సై సై సై సై సై (2)
నీ కుడి నాకు ఎడమైంది సై
ఆర్ట్సైనా సైన్సయినా ఆ మాటకొస్తే ఏ గ్రూపైనా
హస్కైనా రిస్కైనా ఎదురొస్తే ఏకోన్‌కిస్కైనా
సై స స స సై
ఈ సమయాన్ని ఎవడైనా స స స సై

చరణం : 2
ఫిఫ్టీ పర్సెంట్ డ్రెస్సుల్లో పిలుపే తెలిసిందిలే
హండ్రెడ్ పర్సెంట్ అందంలో
ఆటకు తయారేలే
మొదలెట్టాలొక వన్‌డే మ్యాచ్
కమాన్ బేబీ కమాన్
మనకింకెందుకు నైట్ ప్రాక్టీస్
గెట్ ఆన్ బేబీ గెట్ ఆన్
మీ బాడీ ప్లేగ్రౌండ్‌గా నోబడీ అంపైరింగ్
ముచ్చెమటే స్కోర్‌బోర్డ్‌గా యాయాయా
ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో
అవుటయ్యేందుకు సై... స సై స సై స సై
స స స సై మీరేమన్నా అనుకున్నా సై

05 August - నేడు జెనీలియా బర్త్‌డే

చిత్రం : రాగమాలిక (1982)
రచన : రాజశ్రీ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు


పల్లవి :
పూజకొరకై విరిసే పూలను తుంచనేల భువిలో
నీ పూజకొరకై విరిసే పూలను
తుంచనేల భువిలో
ఇది ఏ ఘటనో దివిలో సభలో విధి నిర్ణయమో
॥పూజకొరకై ॥

చరణం :
చలిగాలి తొణికేటి పువ్వులజాతి
వడగాలి వసివాడే ఏమానీతి ॥
కోవెల ఉంటే దీపం ఏదీ
దీపం ఉండీ నీ వెలుగే దీ
పొగిలెను సుమ నా ఎదను గరళం
పొరలెను సుమా బాష్పజల గళం
బంగరు కల అది కరిగిన కథ
నా బ్రతుకే మారెను రాయిలా
కనులను ముసిరిన కటిక చీకటుల
మనసున నిండిన వేళలో
విడివడి వెడలెను మురిపెము
ఎద విడి మువ్వల మోహన రవళితో
కలను వడబోసి కన్నముఖ దీపం వెలిగె
మూగదై నా మదిలోనె ॥

Photo : రాజశ్రీ