Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : మనదేశం(1949)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల, గానం : నాగయ్య


నిర్వేదమేలా కన్నీరదేలా (2)
భరతజాతికపూర్వ పర్వమూ ఈ వేళ
నిర్వేదమేలా కన్నీరదేలా...

ఉరికి తుపాకీల గురికీ
ఎదజూపి ఎదిరించి ఎదురుతెన్నులు గన్న ॥
జాతి స్వతంత్రతా దివ్య సుముహూర్తాన (2)
వెనుకంజ లేదు మనది ముందడుగు
నిర్వేదమేలా కన్నీరదేలా...

కడుపారగని కన్నులందుంచుకొని పెంచు
తల్లి మమకారాలు తలవలేరు (2)
కన్నీరుగా కరిగి అల్లాడు ఇల్లాలు (2)
పిల్లపాపల జూచి నిలువబోరు
తల్లి ఇల్లాలు పిల్లలు సర్వసౌఖ్యాలు
దేశమే దేశమ్ము కోసమే
నేడు దేశమ్ము కోసమే...

చిత్రం : జెంటిల్‌మెన్ (1993)
రచన : రాజశ్రీ, సంగీతం : ఎ.ఆర్.రెహవూన్
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి బృందం


పల్లవి :
కొంటెగాడ్ని కట్టుకో కొంగుకేసి చట్టుకో
కోటి వన్నెలున్న దాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ల పిల్లదాన
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలీ చీకట్లు ॥॥

చరణం : 1
అందర్నీ దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే ॥
చిన్నారి మైనా చిన్నదాన
నేగాలం వేశానంటే పడితీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనీదేదీ లేదే ॥

చరణం : 2
కొన చూపుతోనే వేశావు బాణం
రేపావు నాలో నిలువెల్లా దాహం ॥
కొరగాని వాడితో మనువు మహాభోగం
ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం
చిగురాకు పరువం సెగరేగె అందం
నీకు కానుకంట ప్రతిరోజూ పండగంట ॥

14 August - నేడు రాజశ్రీ వర్ధంతి
Photo: రాజశ్రీ


చిత్రం : బంగారు చెల్లెలు (1979)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల


పల్లవి :
అన్నయ్య హృదయం దేవాలయం
చెల్లెలే ఆ గుడి మణిదీపం॥
అనురాగమే కొలువున్న దైవం
అనుబంధమే గోపురం
మా అనుబంధమే గోపురం
అన్నయ్య హృదయం దేవాలయం

చరణం : 1
పంచుకున్నది ఒకటే రక్తం
పెంచుకున్నది ఒకటే పాశం
బ్రతుకున్నది ఆ పాశం కోసం
కోరుకునేది ఇద్దరి క్షేమం
అన్నయ్య హృదయం దేవాలయం

చరణం : 2
ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను
మోసుకు తిరిగి ముచ్చట తీర్చే తండ్రినెరగను
కళ్లు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని
మాట నేర్చి నే పిలిచినదే అన్నా అన్నదీ
అన్నయ్య హృదయం దేవాలయం

చరణం : 3
కృష్ణుడు పల్కిన గీతావాక్కు
వేదం అయినా ఎందుకు నాకు
నా పాలి వేదం అన్నయ్య పలుకు
అన్నయ్య నవ్వే నా దారి వెలుగు ॥

13 August - నేడు శ్రీదేవి బర్త్‌డే
Photo:Sridevi