Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : అల్లరి ప్రియుడు (1993)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర


పల్లవి :
కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెనో
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెనో
తడియారని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే... చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమనీ (2)

చరణం : 1 చిలిపిగ నీ చేతులు
అణువణువు తడుముతుంటే
మోహపు తెరలిక తొలిగేనా అహా అహా
చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా అహా అహా
పదాలతోనే వరించ నా సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శ్రుతించనా
ఆ వెన్నెల నీ కన్నుల రేపెట్టిన ఆ కోరిక
పొగలై సెగలై ఎదలో ర గిలిన క్షణమే ॥

చరణం : 2
తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ
తెల్లారనీకే వయ్యారమా
అల్లాడిపోయే ఈ రేయినీ
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే ఓ హాయినీ
ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే ॥

17 August - నేడు భువనచంద్ర బర్త్‌డే


చిత్రం : మనదేశం(1949)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల, గానం : నాగయ్య


నిర్వేదమేలా కన్నీరదేలా (2)
భరతజాతికపూర్వ పర్వమూ ఈ వేళ
నిర్వేదమేలా కన్నీరదేలా...

ఉరికి తుపాకీల గురికీ
ఎదజూపి ఎదిరించి ఎదురుతెన్నులు గన్న ॥
జాతి స్వతంత్రతా దివ్య సుముహూర్తాన (2)
వెనుకంజ లేదు మనది ముందడుగు
నిర్వేదమేలా కన్నీరదేలా...

కడుపారగని కన్నులందుంచుకొని పెంచు
తల్లి మమకారాలు తలవలేరు (2)
కన్నీరుగా కరిగి అల్లాడు ఇల్లాలు (2)
పిల్లపాపల జూచి నిలువబోరు
తల్లి ఇల్లాలు పిల్లలు సర్వసౌఖ్యాలు
దేశమే దేశమ్ము కోసమే
నేడు దేశమ్ము కోసమే...