Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : జయం మనదేరా! (2000)
రచన : సిరివెన్నెల
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : కుమార్‌సాను, స్వర్ణలత


పల్లవి :
మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్
నను లవ్‌లో దించేశావ్
మనసైనవాడివి నవ్వే
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్
నను మైమరిపించేశావ్
ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది
ఏమేమి అడిగిందీ
ప్రేమ ఇమ్మంది ప్రేమందుకొమ్మంది ॥

చరణం : 1
అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా
జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా తుంటరి ఈడును ఈవేళ
ఓదార్చనా ప్రియురాలా
నా ఆశలన్నీ నీకోసమంటూ నీ దారి చూడనీ
నా శ్వాసలోని రాగాలు అన్నీ నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ ॥మై॥

చరణం : 2
కలిసిరా అందమా చుక్కల వీధిన విహరిద్దాం
స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా చక్కగ దొరికెను అవకాశం
సరదాగా తిరిగొద్దాం
నీ వాలు కనులు నాపైన వాలి
నను మేలుకొలపనీ
నీ వేలికొనన నా మేను తాకి వీణల్లే మీటనీ
వయసు వాకిళ్లలో తొలివలపు వెలిగించనీ ॥మై॥॥

చిత్రం : హలోబ్రదర్ (1994), రచన : భువనచంద్ర
సంగీతం : రాజ్-కోటి, గానం : బాలు, బృందం


పల్లవి :
కన్నెపెట్టరో కన్ను కొట్టరో... ఓ ఓ ఓ...
పాలపిట్టరో పైట పట్టరో... ఓ ఓ ఓ...
అరె అరె అరె... ॥
గుట్టు గుట్టుగా జట్టుకట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
బెట్టె కట్టి ఉట్టె కొట్టి తీరతాను ఓ ఓ ఓ ఓ...

చరణం : 1
చూపు చూపుకొక చిటికల మేళం
చూసి పెట్టనా చిట్టెమ్మో
ఊపు ఊపుకొక తకదిమి తాళం
వేసిపెట్టనా చెప్పమ్మో
అదిరిపడిన కుడి ఎడమల నడుమున
ఉడుకు వయసు ముడి పెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదిరే సరుకు ముదిరే వరకు
అటో ఇటో ఎటో ఎటో పడి పడి
కలేయనా అదో ఇదో కలబడి॥

చరణం : 2
గంప తిరగబడి గలగలమంటే
గువ్వ గుండెలో రింజింజిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే
సోకులాడి పని రంపంపం
మిడిసిపడిన తడి తలుపుల మెరుపులు
మెరిసి మెరిసి పని పట్టమంటే
వదులు చెడిన చెలి జిగిజిగి బిగువులు
అరిచి అరిచి మొరపెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో ఎకా ఎకి చం చం
కలేసుకో ప్రియా ప్రియా కం కం ॥

Photo:రాజ్, కోటి

చిత్రం : అమ్మాయిల శపథం (1975)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విజయభాస్కర్
గానం : ఎస్.పి.బాలు, వాణీ జయరామ్


పల్లవి :
నీలిమేఘమా జాలి చూపుమా
ఒక్క నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్లుమా
కన్నె అందమా కలత మానుమా
ఒక్క నిముషమాగుమా
నీ దైవమూ నీ కోసమూ
ఎదుట నిలిచె చూడుమా

చరణం : 1
అనుకోని రాగాలు వినిపించెనే
కనరాని స్వర్గాలు దిగివచ్చెనే ॥
కలలు పండి నిజముగా కనుల ఎదుట నిలిచెగా
రా జాబిలీ నా నెచ్చెలీ
జాగేల ఈ వేళ నను చేరగా ॥

చరణం : 2
కళ్యాణ మేళాలు మోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా ॥
గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై సావాసినై
నా ప్రేమ పుష్పాల పూజించనా
॥అందమా॥

neeli mEghamaa jaali choopumaa oka nimishamaagumaa
naa raajutO ee raatiri nannu kalipi veLLumaa
kanne andamaa kalata maanumaa oka nimishamaagumaa
nee daivamu nee kOsamu yeduTa niliche chooDumaa

aanukOni raagaalu vinipinchE
kanaraani swargaalu digivacchEnE
aanukOni raagaalu vinipinchEnE
kanaraani swargaalu digivacchEnE
kalalu panDi nijamugaa kanula yeduTa nilichegaa
raa jaabili naa necchali jaagEla ee vELa nanu cheragaa

neeli

kaLyaaNa mElaalu mroginchanaa
kanTaana sootraanni muDiveyanaa
kaLyaaNa mElaalu mroginchanaa
kanTaana sootraanni muDiveyanaa
gunDe guDigaa cheyanaa ninnu koluvu teerchanaa
nee daasinai naa vaasivai naa prema pushpaalapoojinchanaa

kanne


Photo:ఆచార్య ఆత్రేయ

Listen Song:

nIlimeghamA jAli