Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : రుణానుబంధం (1960)
రచన : సముద్రాల జూనియర్
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి


పల్లవి :
ఓ అందమైన బావా వహ్‌వా
ఆవు పాలకోవా వారేవా
విందుగా పసందుగా ప్రేమనందుకోవా
॥అందమైన॥
విందుగా పసందుగా
ప్రేమనందుకోవా... కోను

చరణం : 1
ఓ హాటు హాటు గారె వెరీ వెరీ సారీ
స్వీటు స్వీటుబూరె వై వై హ ర్రీ
ఓ హాటు హాటు గారె వెరీ వెరీ సారీ
వలపు తలపు కలపి వండినానోయ్ అమ్మోయ్
రాగాల ర వ్వట్టు భోగాల బొబ్బట్టు (2)
నా ప్రేమ పెసరెట్టు భుజింపవా ఓ మైగాడ్
॥అందమైన॥

చరణం : 2
ఓ నిన్ను కోరివచ్చా కన్నెమనసు ఇచ్చా (2)
తళుకు బెళుకు కులుకులన్ని తెచ్చా మెచ్చా
మెచ్చావా బావయ్య నచ్చావు లేవయ్యా (2)
చచ్చినా పోనయ్యా అంతేనయా
అయ్యబాబోయ్ ॥అందమైన॥
అందమైన బావా ఊహుహూ...
నోనో గోగో బైబైబై

21 August - నేడు పి.ఆదినారాయణరావు జయంతి
Photo:పి.ఆదినారాయణరావు

చిత్రం : జయం మనదేరా! (2000)
రచన : సిరివెన్నెల
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : కుమార్‌సాను, స్వర్ణలత


పల్లవి :
మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్
నను లవ్‌లో దించేశావ్
మనసైనవాడివి నవ్వే
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్
నను మైమరిపించేశావ్
ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది
ఏమేమి అడిగిందీ
ప్రేమ ఇమ్మంది ప్రేమందుకొమ్మంది ॥

చరణం : 1
అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా
జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా తుంటరి ఈడును ఈవేళ
ఓదార్చనా ప్రియురాలా
నా ఆశలన్నీ నీకోసమంటూ నీ దారి చూడనీ
నా శ్వాసలోని రాగాలు అన్నీ నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ ॥మై॥

చరణం : 2
కలిసిరా అందమా చుక్కల వీధిన విహరిద్దాం
స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా చక్కగ దొరికెను అవకాశం
సరదాగా తిరిగొద్దాం
నీ వాలు కనులు నాపైన వాలి
నను మేలుకొలపనీ
నీ వేలికొనన నా మేను తాకి వీణల్లే మీటనీ
వయసు వాకిళ్లలో తొలివలపు వెలిగించనీ ॥మై॥॥

చిత్రం : హలోబ్రదర్ (1994), రచన : భువనచంద్ర
సంగీతం : రాజ్-కోటి, గానం : బాలు, బృందం


పల్లవి :
కన్నెపెట్టరో కన్ను కొట్టరో... ఓ ఓ ఓ...
పాలపిట్టరో పైట పట్టరో... ఓ ఓ ఓ...
అరె అరె అరె... ॥
గుట్టు గుట్టుగా జట్టుకట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
బెట్టె కట్టి ఉట్టె కొట్టి తీరతాను ఓ ఓ ఓ ఓ...

చరణం : 1
చూపు చూపుకొక చిటికల మేళం
చూసి పెట్టనా చిట్టెమ్మో
ఊపు ఊపుకొక తకదిమి తాళం
వేసిపెట్టనా చెప్పమ్మో
అదిరిపడిన కుడి ఎడమల నడుమున
ఉడుకు వయసు ముడి పెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన
పడుచు పనులు మొదలెట్టుకోనా
అదిరే సరుకు ముదిరే వరకు
అటో ఇటో ఎటో ఎటో పడి పడి
కలేయనా అదో ఇదో కలబడి॥

చరణం : 2
గంప తిరగబడి గలగలమంటే
గువ్వ గుండెలో రింజింజిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే
సోకులాడి పని రంపంపం
మిడిసిపడిన తడి తలుపుల మెరుపులు
మెరిసి మెరిసి పని పట్టమంటే
వదులు చెడిన చెలి జిగిజిగి బిగువులు
అరిచి అరిచి మొరపెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో ఎకా ఎకి చం చం
కలేసుకో ప్రియా ప్రియా కం కం ॥

Photo:రాజ్, కోటి