Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : వేటగాడు (1979), రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి, గానం : బాలు, సుశీల


పల్లవి :
జాబిలితో చెప్పనా...
జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా...
జాబిలితో చెప్పనా జామురాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి చెప్పనా రాజా

చరణం : 1
తుమ్మెదలంటని తేనెలకై
తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో
దిక్కులు కలవని విరహాలు
చూపులలో చలి చురచురలు
ఆ చలి తీరని విరవిరలు
అన్నీ ఆవిరి పెడుతుంటే
నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా చెప్పనా చెప్పనా॥

చరణం : 2
గొంతులు దాటిన గుండెలలో
కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో
అలలై పొంగిన అందాలు
కౌగిట కాముని పున్నమలు
వెన్నెల వీణల సరిగమలు
పేరంటానికి రమ్మంటే
పెళ్లికి పెద్దవు నీవేలెమ్మని
చెప్పనా చెప్పనా చెప్పనా ॥

చిత్రం : అబ్బాయిగారి పెళ్లి (1997)
రచన : వేటూరి, సంగీతం : కోటి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర



పల్లవి :
ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో
మల్లియల్లో తల్లో వాన విల్లో
ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో
మల్లియల్లో మంచే తేనెజల్లో
ఒళ్లోకొస్తే వయ్యారాలు
ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు ॥

చరణం : 1
నడిచొచ్చే న చ్చే వయసులివీ
చెలి సొగసులివీ దొరికాయి దోరగా
కలిసొచ్చే పిచ్చి మనసులివీ
కసి వరసలివీ కలిశాయి కమ్మగా
మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్లే గిచ్చు
తలగడ మంత్రం తాళి కట్టాక చదవచ్చు
ప్రేమించుకుంటే వేళాపాళా
లేనే లేవులే... లేనే లేవులే॥

చరణం : 2
చిటికేస్తే కాసే కనులు ఇవి
ప్రియ కలలు ఇవి నడిరేయే నావగా
త డిచేసే తేనె పెదవులివి
రసపదవులివి తుడిచేస్తా ముద్దుగా
పలకని మాట పదారు వన్నెల పాట
పరువపు బాట కులుకుల కులాస తోట
పెళ్లాడుకుంటే లైలా మజ్ను
గాథే లేదులే... గాథే లే దులే ॥

28 August - సుమన్ బర్త్‌డే