Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : సరిగమలు (1994), రచన : వేటూరి
సంగీతం : రవి (బాంబే రవి), గానం : కె.ఎస్.చిత్ర
Photo : బాంబే రవి


పల్లవి :

సరిగమలాపవయా సరసకు చేరవయా
పెదవులు ప్రేమలయా రానీవయా
తపనలు దాచకయా తస్సలదియ్యా ॥

చరణం : 1

బడాయి పప్పుసుద్దకి చిరాకులా పరాకులా
లడాయి లవ్వుపిట్టతో ధిమాకులా విడాకులా
పదారు ఏళ్ల చిన్నది వరించినా వలెయ్యవా
పెదాలు తేనెలున్నవి తినేసినా తినెయ్యవా
మల్లెల్లో మావయ్యో
మంతనాలాడుకో ఈ క్షణం
వెన్నెల్లో కన్నయ్యో వేణువే ఊదుకో వేగిరం ॥

చరణం : 2

చలాకి పిల్లగాలికి నరాలలో నసేదిరా
వయ్యారి వాలుచూపుకి వయస్సులో కసేదిరా
జతైన జంట పాటలో శ్రుతి మతి చెడేనయా
గ్రహించు ఘాటుప్రేమనే
అయోమయా మహాశయా
బావయ్యో రావయ్యో
బంతులే ఆడుకో ఈ దినం
వద్దన్నా ముద్దన్నా జివ్వునా లాగెరా యవ్వనం ॥

చిత్రం : కన్యాకుమారి (1977)
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం, గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
(ఇది బాలు సంగీత దర్శకత్వం వహించిన మొదటి సినిమా)
Photo : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :

ఓహో చెలీ... ఓ... నా చెలీ...
ఇది తొలిపాట ఒక చెలిపాట
వినిపించనా ఈ పూట ఆ పాట ॥

చరణం : 1

ఎదుట నీవు ఎదలో నీవు
ఎదిగి ఒదిగి నాతో ఉంటే
మాటలన్నీ పాటలై
మధువులొలుకు మమతే పాట
నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో
నీ చల్లని చరణాలే
నిలుపుకున్న వలపీ పాట
పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా
పాడనా పాడనా ॥చెలీ॥

చరణం : 2

చీకటిలో వాకిట నిలిచి
దోసిట సిరిమల్లెలు కొలిచి
నిదురకాచి నీకై వేచి
నిలువెల్లా కవితలు చేసి
కదలి కదలి నీవొస్తుంటే
కడలి పొంగులనిపిస్తుంటే
వెన్నెలనై నీలో అలనై నీ వెల్లువకే వేణువునై
పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా
పాడనా పాడనా ॥చెలీ॥