చిత్రం : శివ (1989)
రచన : వేటూరి, సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
పల్లవి : ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీపేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి
చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే ॥
చరణం : 1
గాలి మళ్లుతున్నది పిల్ల జోలికెళ్లమన్నది
లేత లేతగున్నది పిట్టకూతకొచ్చి ఉన్నది
కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు
నువ్వైతే ప్లస్సు ఏనాడో యస్సు
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్నుతట్టి రెచ్చగొట్టగా
సరాగమాడే వేళ ॥
చరణం : 2
లైఫు బోరుగున్నది కొత్త కైపు కోరుతున్నది
గోల గోలగున్నది ఈడు గోడదూకమన్నది
నువ్వే నా లక్కు నీమీదే హక్కు
పారేస్తే లుక్కు ఎక్కింది కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్లు ఉయ్యాలగా హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా
వసంతమాడే వేళ ॥
nErutunO lEdO prabhu - నేరుతునో లేదో ప్రభు
చిత్రం : పూజాఫలం (1964)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
నేడు సాలూరి రాజేశ్వరరావు జయంతి
పల్లవి :
నేరుతునో లేదో ప్రభు నీ పాటలు పాడ
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా
నిదురరాదు కనులకు శాంతిలేదు మనసుకు
మదిలో వేదన ఏదో కదలె రాధకు
ఇది చల్లని వేళైన...
చరణం : 1
నీ దయలాగున వెన్నెల జగమంతా ముంచె
నీ మధుర ప్రేమ యమున కడలంతా నించె
మరి మరి ముల్లోకములను మురిపించే స్వామీ
మనసు చల్లబడ దాసికి కనిపించవేమి...
ఇది చల్లని వేళైనా...
చరణం : 2
నీ వేణువు కోసం బ్రతుకంతా వీనులాయె
నీ దరిశనమునకై ఒడలంతా కనులాయె
బడలే బ్రతుకున ఆశలు వెలిగించే దేవా
సడలే వీణియ తీగలు సవరించి పోవా...
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
నేడు సాలూరి రాజేశ్వరరావు జయంతి
పల్లవి :
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా
నిదురరాదు కనులకు శాంతిలేదు మనసుకు
మదిలో వేదన ఏదో కదలె రాధకు
ఇది చల్లని వేళైన...
చరణం : 1
నీ దయలాగున వెన్నెల జగమంతా ముంచె
నీ మధుర ప్రేమ యమున కడలంతా నించె
మరి మరి ముల్లోకములను మురిపించే స్వామీ
మనసు చల్లబడ దాసికి కనిపించవేమి...
ఇది చల్లని వేళైనా...
చరణం : 2
నీ వేణువు కోసం బ్రతుకంతా వీనులాయె
నీ దరిశనమునకై ఒడలంతా కనులాయె
బడలే బ్రతుకున ఆశలు వెలిగించే దేవా
సడలే వీణియ తీగలు సవరించి పోవా...
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా