Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం :బలిపీఠం(BalipITham) (1975)
రచన : డా॥సి.నారాయణరెడ్డి,సంగీతం : చక్రవర్తి,
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి (3)
తరతరాలుగా మారనివాళ్లను
మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మెప్పుల కోసం చెప్పేవాళ్లను
మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి

చరణం : 1
అందరు దేవుని సంతతి కాదా
ఎందుకు తరతమ భేదాలు (2)
అందరి దేవుడు ఒకడే ఐతే (2)
ఎందుకు కోటి రూపాలు
అందరి రక్తం ఒకటే కాదా
ఎందుకు కులమత భేదాలు
అందరి రక్తం ఒకటే అయితే (2)
ఎందుకు రంగుల తేడాలు
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

చరణం : 2
తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా
ఆ బురదలోనే అందాల కమలము
పుడుతుందని మరిచేరా
కమలం కోసం బురదలోనే
కాపురముండేదెవరు
మనసులోని బురద కడుగుకొని
మనుషుల్లా బతికేవారు
సమధర్మం చాటేవారు సమధర్మం చాటేవారు
వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం వారిదే
ఈనాటి తరం వారిదే రానున్న యుగం
కాదనే వారు ఇంకా కళ్లు తెరవనివారు
మేలుకోక తప్పదులే
మేలుకోక తప్పదులే మారిపోక తప్పదులే
తప్పదులే॥

చిత్రం : గంగోత్రి(Gangothri) (2003)
రచన : చంద్రబోస్, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : ఎస్.పి.చరణ్, మాళవిక


పల్లవి :

ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది
మహరాణిలా మహలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది
అలాగే నవ్వుతూ ఉండాలని (2)
నింగినేల వాగువంక చెట్టుచేమ గువ్వగూడు
ఆశీర్వదించాలి ॥ తోటలో॥

చరణం : 1

ఎన్నో రంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు
సుందరమైన పువ్వు పలు సుగుణాలున్న పువ్వు
ఏ గుడిలో అడుగుపెట్టునో...
దేవుడు చల్లగ చూడాలి
ఆ పువ్వుకు పూజలు చేయాలి
దేవుడి గుండెల గుడిలో
ఆ పువ్వే హాయిగ ఉండాలి ॥ తోటలో॥

చరణం : 2

నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి
ఆ పువ్వుకి తోడు ఉండగా...
దేవుడు వేరే లేడు కదా
తోటమాలే పువ్వుకి దేవుడుగా
మాలికి పువ్వుకు మధ్యన
అనుబంధం ఎన్నడూ వాడదుగా ॥ తోటలో॥