Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : ముత్యాలముగ్గు(MutyAla Muggu) (1975)
రచన : గుంటూరు శేషేంద్ర శర్మ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల
20 October - నేడు గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి


పల్లవి :

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది॥

చరణం : 1
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది॥
శూన్యమైన వేణువులో ఒక స్వరం
కలిపి నిలిపింది (2)
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది॥

చరణం : 2
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి॥

కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి

చిత్రం : మురళీకృష్ణ(Muralikrishna) (1964)
రచన : ఆచార్య ఆత్రేయ, సంగీతం : మాస్టర్ వేణు
గానం : పి.సుశీల

పల్లవి :
వస్తాడమ్మా నీ దైవము
వస్తుందమ్మా వసంతము (2)
కలలే నిజమై వలపే వరమై
కళకళలాడును జీవితము ॥

చరణం : 1
పేరే కాదు ప్రేమకు కూడా
శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు (2)
తన ముద్ద్దుల మురళిగ నిను మార్చి (2)
మోహనరాగం ఆలపించును ॥

చరణం : 2
పసిపాప వలె నిను ఒడిచేర్చి
కనుపాప వలె కాపాడును (2)
నీ మనసే మందిరముగ జేసి (2)
దైవం తానై వరములిచ్చును ॥

చరణం : 3
ఎక్కడివాడో ఇక్కడివాడై దక్కినాడు
నీ తపసు ఫలించి (2)
నాడొక చెట్టును మోడు చేసినా వాడే
మోడుకు చిగురు కూర్చును॥

చిత్రం : పచ్చని కాపురం(Pachchani kApuram) (1985)
రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తి
గానం : కె.జె.ఏసుదాస్, ఎస్.జానకి


పల్లవి :
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము (2)
నింగి నేల సాక్ష్యాలు (2)
ప్రేమకు మనమే తీరాలు॥

చరణం : 1
జ్ఞాపకమేదో నీడల్లో తారాడే
స్వప్నాలేవో నీ కళ్లు దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వము నాదైనది...
నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే
ఏకమైన రాసలీలలోనా॥

చరణం : 2
అంతంలేని ఈ రాగబంధంలో
అంచున నిలిచి నీవైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూలడోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు
ఆ ముద్దులే మూడైనవి...
బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా
ఇంటిదీపమాయె జంట ప్రేమ॥