Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : సైనికుడు(Sainikudu) (2006)
రచన : వేటూరి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : కార్తీక్, కారుణ్య, హరిణి,మాలతి


సాకీ :
ఓ చిలక నా రాచిలక
రావే రావే రాచిలక
నా చిలక రాచిలక
రావే రావే నా చిలక
ఓ సయ్యోరే సయ్యోరే సయ్యా హోరే
అరె సయ్యోరే సయ్యోరే
సయ్యా హోరే
పల్లవి :
ఓరుగల్లుకే పిల్లా పిల్లా
ఎన్నుపూస ఘల్లు ఘల్లుమన్నాదే
ఓరచూపులే రువ్వే పిల్లా
ఏకవీర నువ్వులా ఉన్నావే॥
జవ్వనాల ఓ మధుబాల (2)
ఇవి జగడాల ముద్దు పగడాలా
అగ్గిమీద ఆడ గుగ్గిలాల
చిందులేస్తున్న చిత్తరాంగిరా॥
చరణం : 1
లాలాలా పండు వెన్నెలా
తొలివలపు పిలుపులే వెన్నలా
ఇకనైనా కలనైనా ఎదకు చేరగలనా
అందాల దొండపండుకు
మిసమిసల కొసరు కాకికెందుకు
అది ఈడా సరిజోడా
తెలుసుకొనవే తులసి
చెలి మనసును గెలిచిన వరుడికి
నరుడికి పోటీ ఎవరు (2)
చలి చెడుగుడు విరుగుడు
తప్పేవి కావు తిప్పలు... ఛల్॥
చరణం : 2
కాకాకా కస్సుబుస్సులా
తెగ కలలు కనకు గోరువెచ్చగా
తలనిండా మునిగాకా
తమకు వలదు వణుకు
దా దా దా దమ్ములున్నవా
మగసిరిగా ఎదురు పడగలవా
లంకేశా లవ్ చేశా
రాముడంటి జతగాణ్ణి
ఎద ముసిరిన మసకల
మకమకలాడిన మాయే తెలుసా
ఒడిదుడుకులు ఉడుకులు
ఈ ప్రేమకెన్ని తిప్పలు... ఛల్॥


చిత్రం : మెరుపుకలలు(merupu kalalu) (1997)
రచన : వేటూరి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : సుజాత


పల్లవి :
ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి
పూలొచ్చి పలికే
సంపంగి భావాలోయి ॥వాన॥
కోయిలకే కూకూకూ
ఎదహోరే కాంభోజి
సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లహరి లాలి
పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయి
జగమంతా సాగే గీతాలే
పడుచు ఖవ్వాలీ
సాగింది నాలో ససరిగమ పదనిసరీ॥వాన॥
చరణం : 1
రాతిరొచ్చిందోయ్
రాగాలే తెచ్చిందోయ్
టిక్‌టిక్ అంటాది గోడల్లో
దూరపయనంలో రైలు పరుగుల్లో
చుక్ చుక్ చుక్ గీతాలే చాలు
సంగీతిక ఈ సంగీతిక (2)
మధుర సంగీత సుధ
పాపల్లే తానే పెంచి
పాడే తల్లి లాలే హాయి
మమత రాగాలు కదా ॥వాన॥
చరణం : 2
నీలాల మడుగుల్లో అల్లార్చే రెక్కల్లో
ఫట్ ఫట్ సంగీతాలే విను
గోవుల్ల చిందులలో కొలువున్న
మాలచ్చి ఎట్టా పాడిందో విను
సంగీతిక ఈ సంగీతిక (2)
జీవన సంగీత సుధ
వ ర్షించే వానజల్లు
వర్ణాలన్నీ గానాలేలే
ధరణి చిటికేసే విను ॥వాన॥

Special Note:

తెలుగు, కన్నడ, మళయాళ, తమిళ, హిందీ చిత్రాలలో దాదాపు నాలుగు వేలకు పైగా పాటలు
పాడారు సుజాత. వర్థమాన గాయని అయిన శ్వేతా మోహన్, స్వయంగా సుజాత కుమార్తె.

చిత్రం : ఉండమ్మా బొట్టుపెడతా(VunDammA boTTu peDatA) (1968)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల


పల్లవి :
ఎందుకీ సందెగాలి
సందెగాలి తేలి మురళి (2)
తొందర తొందరలాయె
విందులు విందులు చేసే॥

చరణం : 1
ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
పరుగు పరుగునా త్వర త్వరగా
ప్రభువు పాదముల వాలగ
విందులు విందులు చేసే ఎందుకీ॥

చరణం : 2
ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని
ఆ పిల్లన గ్రోవిని విని॥
ఏదీ ఆ... యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావన మిక
ఏదీ విరహ గోపిక ॥
Listen :
edduki sandegAli

Special Note:
01November - నేడు దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి
కృష్ణశాస్త్రిగారి పూర్తి పేరు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర ఉన్న రామచంద్రపాలెం గ్రామంలో 1897లో నవంబర్ 1న జన్మించారు. భావ గీతాలు, లలితగీతాలు, తత్త్వాలు... ఎన్నో రచించారు. ఆయన పాటకు ఉండే ప్రాముఖ్యతను, జనబాహుళ్యంపై దానికుండే శక్తిని ప్రభావాన్ని గుర్తించి, తన జీవితంలో అధిక భాగాన్ని గేయరచనకే వినియోగించారు. బి.యన్.రెడ్డి పోత్సాహంతో మల్లీశ్వరి (1951) సినిమాకు పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు ఆ సినిమాలకు ఒక కాల్పనిక సుగంధాన్ని తెచ్చిపెట్టాయి. బంగారుపాప, భాగ్యరేఖ, ఉండమ్మా బొట్టుపెడతా, బంగారు పంజరం, శ్రీరామపట్టాభిషేకం, మేఘసందేశం... వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పాటలు రాశారు. తక్కువ పాటలు రాసినప్పటికీ అవన్నీ అక్షరాలకే వన్నె తెచ్చాయి. ఆయన రాసిన పాటలన్నీ ఒకెత్తు అయితే ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’ ఒక్కటీ ఒకెత్తు. ఈ ఒక్క పాటతోనే భరతమాత రుణం తీర్చుకున్నారు కృష్ణశాస్త్రి. ఆయన కలం గొప్పదనాన్ని గుర్తించి... 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, 1976లో భారత ప్రభుత్వం పద్మభూషణ్, 1978లో సాహిత్య అకాడమీ అవార్డులతో సత్కరించింది. అనారోగ్య కారణంగా 1963లో ఆయన గొంతు మూగబోయినప్పటికీ ఆయన కలం మాత్రం ఆగలేదు. 1980 ఫిబ్రవరి 24న ఆయన అనంతలోకాలకు వెళ్లిపోయారు.