Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ఉండమ్మా బొట్టుపెడతా(VunDammA boTTu peDatA) (1968)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల


పల్లవి :
ఎందుకీ సందెగాలి
సందెగాలి తేలి మురళి (2)
తొందర తొందరలాయె
విందులు విందులు చేసే॥

చరణం : 1
ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
పరుగు పరుగునా త్వర త్వరగా
ప్రభువు పాదముల వాలగ
విందులు విందులు చేసే ఎందుకీ॥

చరణం : 2
ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని
ఆ పిల్లన గ్రోవిని విని॥
ఏదీ ఆ... యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావన మిక
ఏదీ విరహ గోపిక ॥
Listen :
edduki sandegAli

Special Note:
01November - నేడు దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి
కృష్ణశాస్త్రిగారి పూర్తి పేరు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర ఉన్న రామచంద్రపాలెం గ్రామంలో 1897లో నవంబర్ 1న జన్మించారు. భావ గీతాలు, లలితగీతాలు, తత్త్వాలు... ఎన్నో రచించారు. ఆయన పాటకు ఉండే ప్రాముఖ్యతను, జనబాహుళ్యంపై దానికుండే శక్తిని ప్రభావాన్ని గుర్తించి, తన జీవితంలో అధిక భాగాన్ని గేయరచనకే వినియోగించారు. బి.యన్.రెడ్డి పోత్సాహంతో మల్లీశ్వరి (1951) సినిమాకు పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు ఆ సినిమాలకు ఒక కాల్పనిక సుగంధాన్ని తెచ్చిపెట్టాయి. బంగారుపాప, భాగ్యరేఖ, ఉండమ్మా బొట్టుపెడతా, బంగారు పంజరం, శ్రీరామపట్టాభిషేకం, మేఘసందేశం... వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పాటలు రాశారు. తక్కువ పాటలు రాసినప్పటికీ అవన్నీ అక్షరాలకే వన్నె తెచ్చాయి. ఆయన రాసిన పాటలన్నీ ఒకెత్తు అయితే ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’ ఒక్కటీ ఒకెత్తు. ఈ ఒక్క పాటతోనే భరతమాత రుణం తీర్చుకున్నారు కృష్ణశాస్త్రి. ఆయన కలం గొప్పదనాన్ని గుర్తించి... 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, 1976లో భారత ప్రభుత్వం పద్మభూషణ్, 1978లో సాహిత్య అకాడమీ అవార్డులతో సత్కరించింది. అనారోగ్య కారణంగా 1963లో ఆయన గొంతు మూగబోయినప్పటికీ ఆయన కలం మాత్రం ఆగలేదు. 1980 ఫిబ్రవరి 24న ఆయన అనంతలోకాలకు వెళ్లిపోయారు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |