Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

పల్లవి :
చిత్రం : సీతామాలక్ష్మి(sItAmAlakshmi) (1978)
రచన : వేటూరి(vEtUri)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.MahadEvan)
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల(S.P.bAlu,P.suSIla)


సీతాలు సింగారం
మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే
శ్రీలచ్చిమవతారం॥
మనసున్న మందారం
మనిషంతా బంగారం
బంగారు కొండయ్యంటే
భగవంతుడవతారం॥॥
చరణం : 1
పూసంత నవ్విందంటే
పున్నమి కావాలా
అయితే నవ్వనులే...
కాసంత చూసిందంటే
కడలే పొంగాలా
ఇక చూడలేను...
పూసంత నవ్విందంటే
పున్నమి కావాలా
కాసంత చూసిందంటే
కడలే పొంగాలా
ఎండి తెరమీద పుత్తడిబొమ్మ
ఎలగాలా ఎదగాలా
ఆ ఎదుగూ ఒదుగూ యెలుగూ
కన్నుల యెన్నెల కాయాలా
నువ్వంటుంటే
నే వింటుంటే
నూరేళ్లు నిండాలా ॥
చరణం : 2
దాగుడుమూతలు
ఆడావంటే దగ్గరకే రాను
అయితే నేనే వస్తాలే...
చక్కలిగింతలు పెట్టావంటే
చుక్కయిపోతాను
ఎగిరొస్తాలే...
దాగుడుమూతలు ఆడావంటే
దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే
చుక్కయిపోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై
వెలిగి వెలిగించాలా
నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై
ఉండిపోవాలా
నువ్వంటుంటే
నే వింటుంటే వెయ్యేళ్లు బతకాలా॥

Special Note:
Award winning nostalgic telugu song from the movie Seethamahalakshmi (1978) starring Chandramohan and Talluri Rameshwari.
Direction: K Viswanath
Music: KV Mahadevan
Lyric: Jaladi Raja Rao
Singers: SP Balasubramaniam and P Susheela

This song fetched the best lyric award for the writer Jaladi.
He is from Gudivada Krishna district.

చిత్రం : లిటిల్ హార్ట్స్(little hearts) (2001)
రచన : కులశేఖర్(kulaSEkhar)
సంగీతం : చక్రి(chakri)
గానం : సావేరి, గాయత్రి, ప్రదీప్,రవివర్మ, ప్రమోద్
(sAvEri,gAyatri,pradeep,ravivarma,pramod)

Click Play to listen the Song:


పల్లవి :
భారతజాతికి పచ్చని ధాత్రికి
జెండా పండుగ వచ్చిందోయ్
వచ్చిందోయ్ వచ్చిందోయ్
రాక్షస నీతికి స్వస్తిని పలికే
స్వేచ్ఛను నిండుగ తెచ్చిందోయ్
తెచ్చిందోయ్ తెచ్చిందోయ్
మనుషులంతా కలిసే
మనసులన్నీ మురిసే
శాంతి వెల్లివిరిసే పూలజల్లు కురిసే
హౌ గ్రేట్ ఇండియా
వుయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా
వుయ్ లవ్ ఇండియా
వుయ్ మస్ట్ లవ్ ఇండియా॥గ్రేట్‌॥॥
చరణం : 1
వందేమాతరం... (2)
వందేమాతరమందామా
జెండా జాతర చేద్దామా
నామ్‌స్వాసకర ఇంద కాట్ర ఒండ్‌ద్రా
నమకుళ్ ఇరుదర రత్తముండ్‌ద్రా
తకధిమి తత్తోం తకధిమి తత్తోం
తకధిమి తత్తోం తిల్లానా
శుక పిక గళముల శ్రుతి సరి చేసే
ప్రార్థన గీతం పాడేద్దాం॥
భూతల స్వర్గం మనదేనంటూ
లోకాలన్నీ చాటేద్దాం
మువ్వన్నెల జెండా
రెపరెప లాడిద్దాం॥గ్రేట్‌॥॥
చరణం : 2
సారే జహాసే అచ్ఛా
హిందూసితా హమారా
ఓట్రుమై ఇరుక్కుణొం
నమ్మ ఎల్లారుం
నాటై కాపాత్కుణొం నమ్మ ఎల్లారుం॥
పరమత సహనం వరమనుకుంటూ
సహజీవనమే సాగిద్దాం తకధిమి
జనగణమనలే మన
ఎదసడులై దేశం కోసం జీవిద్దాం
మనదేశం కోసం ప్రాణాలర్పిద్దాం॥గ్రేట్‌॥॥
External Links:
bhAratajAtiki pachchani - భారతజాతికి పచ్చని
bhAratajAtiki pachchani - భారతజాతికి పచ్చని

చిత్రం : భామాకలాపం(bhAmAkalApam) (1988)
రచన : డా॥సి.నారాయణరెడ్డి(Dr C. nArAyaNareddy)
సంగీతం : సాలూరి వాసూరావు (sAlUri vAsUrAo)
గానం : ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ(S.P.bAlu, S.P.Sailaja)
25 January _ నేడు సాలూరి వాసూరావు బర్త్‌డే



పల్లవి :
కవితా... ఆ...
ఓ... కవితా...
కవితా ఓ కవితా...
నా కవితా...
ప్రియ కవితా...
కళ్లలో కదిలే కవిత
కలల్లో కలిసే కవిత
నీవులేని జీవనం
నీరు లేని సాగరం॥॥
చరణం : 1
గాలిలో నీ కాలిసవ్వడి వింటే చాలు గాలిలో నీ కాలిసవ్వడి వింటే చాలు
ఊహల విరిజల్లు మది ఊకే పరవళ్లు
తోటలో నీ పైట నీడన ఉంటే చాలు
స్వాగత నీరాలు రసరంజిత తీరాలు
ఎలా నిన్ను మరవను
ఎలా క్షణం గడపను
నీ పాద చుంబనం
నా పూజా సాధనం (2)॥
చరణం : 2
ఎంతగా దూరాన ఉన్నా
ఎద టున్నావు
నడిచే పున్నమివై
నగవొలికే కిన్నెరివై
ఎన్నడూ మనకున్న
బంధం విడిపోలేదు
ఎవ్వరు ఏమన్నా
ఏ పువ్వులు ముళ్లైనా॥
మనది దివ్య సంగమం
మనకు దాని మందిరం॥॥
సాసస గాగగ
మామమ పాపప (2)
కవినీ కవితను వేరువేరుగా
చూసేదెవరూ
నింగి నుండి నీలిమను
విడదీసేదెవరూ
నా అక్షర కోశం విడిచే
ప్రతి నిశ్వాసం నీదే
నా ఆశయ లయలో
కదిలే ప్రతి విశ్వాసం మనదే
ఆ... ఆ... కవితా... ఓ... కవితా...