Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : అమెరికా అల్లుడు(amerikA alluDu) (1985)
రచన : వేటూరి (vETUri)
సంగీతం : చక్రవర్తి (chakravarti)
గానం : పి.సుశీల (P. suseela)
03 February - నేడు చక్రవర్తి వర్ధంతి



పల్లవి :
నా వాలుజడ కృష్ణవేణి
నా పూలజడ వెన్నెల గోదారి
నా ఒళ్లు గంగమ్మ పరవళ్లుగా (2)
నర్తన చేసిన రతిని భారతిని
కూచిపూడి భారతికి హారతిని... భారతిని...॥వాలుజడ॥
చరణం : 1
ఏ జన్మలో మల్లెపూ
పూజ చేశానో కుంద రదనైనాను
ఏనాటి కార్తీక దీపాల వెలుగో
ఇందువదననైనాను
అమరావతి బౌద్ధ ఆరామ శిల్పాల
వైరాగ్య భావాల దీకావిరంగు
ఈ చీర చెంగు
మమత సమత మతమై వెలసిన
మధుర భారతి వీణను నెరజాణను నేను॥వాలుజడ॥
చరణం : 2
ఈ నాల్గువేదాల పాఠాలు
విన్నానో హంసగమననైనాను
ఏ నాసికత్వాల వాదాలు విన్నానో
గగన జఘననైనాను
క్షేత్రయ్య పదకీర్తనావేశ నాట్యాల
రాజ్యాలలో చిందు నా కాలి చిందు
మీ కళ్లవిందు
శ్రుతికి లయకి సుతనై పుట్టిన
మధుర భారతి వీణను నెరజాణను నేను॥వాలుజడ॥
పల్లవి :
గోమాత మాయమ్మ గోదారి గంగమ్మ
ఓ... పూసిన మామిడికొమ్మ
ఓ... కూసే కోయిలగుమ్మ
వస్తా సెలవిస్తే మళ్లీ వస్తా దయ చూస్తే...
చరణం : 1
మల్లెపూల గుండెల్లో
మంచు కన్నీళ్లు చూసి
జాబిలమ్మ కొండల్లో రాలే వెన్నెల్లు చూసి
ఎదర లేనే లేదని చెదరిపోని ముగ్గుని
విడిచి నడిచి వెళ్లలేక వెళ్లలేక
వెళుతున్నా మీ ముద్దుల ఆడపడుచునై
మా చల్లని పల్లెమ్మా
మా పచ్చని తోటమ్మా... ॥
చరణం : 2
బంతిపూల గిన్నెల్లో పడుచు పేరంటమాడి
తందనాల సందెల్లో
బ్రతుకు తాంబూలమేసి
కన్నవారి కౌగిలి చిన్ననాటి లోగిలి
విడిచి నడిచి వెళ్లలేక వెళ్లలేక
వెళుతున్నా కడలిదాటి కాపురానికి
మా కోవెల్లో గౌరమ్మా
మా చేలల్లో పైరమ్మా...
Download:
nA vAlujaDa krishnaveNi - నా వాలుజడ కృష్ణవేణి
Special Note:
జననం : 08-09-1937
జన్మస్థలం : గుంటూరు జిల్లా,తాడికొండ మండలం, పొన్నెకల్లు గ్రామం
చదువు : బి.ఎ.ఎకనామిక్స్
తల్లిదండ్రులు : కొమ్మినేని అన్నపూర్ణమ్మ,బసవయ్య
తోబుట్టువులు : హైమావతీదేవి, అప్పారావు,శేషగిరిరావు
వివాహం-భార్య : 14-12-1961, రోహిణీదేవి
సంతానం : నలుగురు కొడుకులు (కీ.శే.రాజేశ్వరప్రసాద్, శ్రీనివాస చక్రవర్తి, రామకృష్ణప్రసాద్, కళ్యాణ్ చక్రవర్తి )

తొలి చిత్రాలు...
సంగీత దర్శకునిగా : మూగప్రేమ (1971)
నటునిగా : రాజా (1976)

ఆఖరి చిత్రాలు...
సంగీత దర్శకునిగా : అమ్మోరు (1995)
నటునిగా : లాహిరి లాహిరి లాహిరిలో (2002)
సంగీత దర్శకునిగా మొత్తం చిత్రాలు : 959 (మళయాళం-1, తమిళం-4, కన్నడం-60, మిగతావి తెలుగులో)
డబ్బింగ్ చెప్పిన చిత్రాలు : సుమారు 300కు పైగా
అవార్డులు : ‘నేటిభారతం (1983)’, ‘శ్రావణ మేఘాలు (1986)’ చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డులు.
మరణం : 03-02-2002

చిత్రం : బాడీగార్డ్(bodyguard) (2012)
రచన : శ్రీ మణి (sreemaNi)
సంగీతం : ఎస్.ఎస్.థమన్ (S.S.Thaman)
గానం : కార్తీక్ (kArtheek)


పల్లవి :
ఎవ్వరో... ఎవ్వరో...
నను తీయని గొంతుతో
పిలిచిందెవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో...
తన మాటల తేనెను పంచిందెవ్వరో
మనసుకిది కానుకరో
ఇచ్చినది ఎవ్వరో
తనది ఏ పోలికరో
పోల్చినది ఎవ్వరో
చిలిపి సిరిమువ్వరో
కలిపి తను ఎవ్వరో
ఏమో ఏమో... ఓ...
నా గుండెతో గుసగుసలాడిందెవ్వరో
హే... ఆ ముసిముసి నవ్వుల
రూపం ఎవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో...
ఈ దాగుడుమూతలు ఆడేదెవ్వరో
చరణం : 1
ఇంతలా ఏమార్చినా
ఊరు పేరు జారవే
నిన్నిలా నే మరిచినా
నువు మాత్రం నను వీడవే
అందగాణ్ణి అంటావే
మరి అందకుండా ఉంటావే
ఆ ప్రాణవాయువల్లే
నువు కూడ కానరావే
ఇంతిలా నన్ను ఊరిస్తావు
నువ్వెంత అందానివే
ఆ అందం కళ్లకు కట్టేదెవ్వరో
తన చిరునామా చూపెట్టేదెవ్వరో
చరణం : 2
నీ స్వరం వినాలనే
కోరిక కలిగిస్తావులే
తక్షణం నీవెవ్వరో
తెలియదు అనిపిస్తావులే
నన్ను నువ్వు చూస్తావే
మరి నిన్ను
నువ్వు దాస్తావే
అరె నిన్ను చూడాలని
మైమరచి పోవాలని
నా ఒళ్లే క ళ్లై వలేస్తున్నా
ఆచూకీ చిక్కవులే
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో
ఆ చక్కెర పలుకుల టక్కరి ఎవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో...
అరె ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో...

చిత్రం : చిరునవ్వుతో(chirunavvutO)... (2000)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : బాలు(S.P.bAlu)


పల్లవి : సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా
నవ్వే నీ కళ్లలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి...
ఓ... హో... ॥సంతోషం॥
చరణం : 1
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా॥ నిన్నటి ॥
చుట్టమల్లే కష్టమొస్తే
కళ్లనీళ్లు పెట్టుకుంటూ
కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి
సాగనంపకుండా లేనిపోని సేవచేయకు
మిణుగురులా మిలమిల మెరిసే
దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ
పరుగులు తియ్యదా ॥ నవ్వే॥
చరణం : 2
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా॥ఆశలు ॥
నిన్న రాత్రి పీడకల
నేడు తలచుకుంటూ
నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా
అందులోనే ఉంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగన్నవి కలలే అని
తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో
తరిమెయ్యవే చిలకమ్మా
॥నవ్వే॥ ॥ సంతోషం ॥