Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : జయుం (jayam)(2002)
రచన : కులశేఖర్(kulaSekhar)
సంగీతం : ఆర్.పి.పట్నాయుక్ (R.P.paTnAyak)
గానం : ఆర్.పి.పట్నాయుక్ , ఉష (R.P.paTnAyak, usha)


పల్లవి :
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగ దు
ఈ ప్రేమ
మెత్తని మనసును ఏ రోజూ ఈడదు
ఈ ప్రేమ
కులమూ మతమూ లేవంటుంది
మనసుకి ప్రేమ
నింగీ నేలా ఉన్నన్నాళ్లు
ఉంటుందీ ప్రేమ
చరణం : 1
కాలమొస్తే సిరిమల్లెతీగకి
చిగురే పుడుతుంది
ఈడువస్తే ఈ పడుచు గుండెలో
ప్రేమే పుడుతుంది
గొడుగు అడ్డు పెట్టినంతనే
వానజల్లు ఆగిపోవునా
గులక రాయి వేసినంతనే
వరదజోరు ఆగిపోవునా
ఏడులోకాలు ఏకం ఐనా
ప్రేమను ఆపేనా
చరణం : 2
ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన
చక్కని వరమంటా
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ
అలుపేరాదంటా
కండలెంత పెంచుకొచ్చినా
కొండనెత్తి దించలేరుగా
కక్షతోటి కాలు దువ్వినా
ప్రేమనెవ్వరాపలేరుగా
ప్రేమకెపుడైనా జయమేగాని
ఓటమి లేదంటా
శాశ్వతమీప్రేమ...

చిత్రం : నువ్వునాకునచ్చావ్(nuvvu nAku nachchAv) (2001)
రచన : సిరివెన్నెల (sirivennela)
సంగీతం : కోటి (kOTi)
గానం : టిప్పు, హరిణి (Tippu, hariNi)

పల్లవి :
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే
ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామా
నన్నుదాటి వెళ్లలేవు
నిన్ను నువ్వు దాచలేవు ఏమి
చెయ్యనయ్యొరామా
అనుకున్నా తప్పు కదా
మోమాటం ముప్పు కదా
మనసైతే ఉంది కదా
మన మాటేం వినదు కదా
పంతం మానుకో...
భయం దేనికో... ॥
చరణం : 1
వద్దన్నకొద్దీ తుంటరిగా
తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
నన్నస పెట్టి ఈ సరదా
నేర్పినదే నువు గనక
నా కొంగు పట్టి నడవనిదే
కుదరదుగా
అడుగడుగున ఎదురైతే
ఏ దారీ తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా
మన కథను తొందరగా
ప్రతీచోట నీ నవ్వే పిలుస్తోందిగా॥॥
చరణం : 2
అమాయకంగా చూడకలా
వేడుక లా చిలిపి కల
అయోమయంగా వెయ్యకలా
హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా
వాలుజడ
దానొంక చూసి ఎందుకట గుండెదడ
మరిమరి శ్రుతి మించి ఇలా
నను మైమరపించకలా
తడబడి తలవంచి ఇలా
తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే॥॥

ghallu ghallumani - ఘల్లు ఘల్లుమని

చిత్రం : ఇంద్ర (indra)(2002)
రచన : సిరివెన్నెల (sirivennela)
సంగీతం : మణిశర్మ (maNiSarma)
గానం : బాలు, మల్లికార్జున్, బృందం (bAlu,mallikArjun,troop)

పల్లవి : ఘల్లు ఘల్లుమని
సిరిమువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లుమని
పులకింతల్లో పుడమే పాడగా ॥ ఘల్లు ॥
హరివిల్లు విప్పి కరిమబ్బు వాన
బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్లు తాకి
కడగళ్లే తీరని
జడివాన జాడతో ఈ వేళ
జన జీవితాలు చిగురించేలా
రాలసీమలో ఈ వేల
రతనాల ధారలే కురిసేలా ॥ జడివాన ॥ ॥ ఘల్లు ॥
చరణం :1 రాకాసులు ఇక లేరని
ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపనీ
అన్నెంపున్నెం ఎరగని
మా సీమకు రారామ్మని
ఆహ్వానం అందించనీ
మెరిసే చూపునీ
తొలగింది ముప్పు
అని నీలిమబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు ముప్పు మన ముంగిలంత
ముత్యాలే చల్లనీ
ఆశా సుగంధమై నేలంతా
సంక్రాంతి గీతమే పాడే లా
శాంతి మంత్రమై గాలంతా
దిశలన్ని అల్లనీ ఈ వేళ॥ జడివాన ॥
చరణం : 2
భువిపై ఇంద్రుడు పిలిచెరా
వరుణా వరదై పలుకరా
ఆకసాన్ని ఇల దించరా
కురిసే వానగా
మారని యాతన తీర్చగా
మా తలరాతలు మార్చగా
ఈ జలయజ్ఞము సాక్షిగా
తలనే వంచరా
మహరాజు తాను సమిదల్లే మారి
నిలువెల్లా వెలిగెరా
భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి
తాపసిగా నిలిచెరా
జన క్షేమమే తన సంకల్పముగా
తన ఊపిరే హోమ జ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనురా
అమృతమును ఆహ్వానించెనురా
॥ జడివాన ॥ ॥ ఘల్లు ॥