Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

vayyAri blackberry - వయ్యారి బ్లాక్‌బెర్రీ

చిత్రం : నువ్వా... నేనా..?(nuvvA nEnA) (2012)
రచన, సంగీతం : భీమ్స్(bhIms)
గానం : కైలాస్ ఖేర్(kailas kher)


పల్లవి :
సర్రా సర్రా... సర్రా సర్రా... హే...
వయ్యారి బ్లాక్‌బెర్రీ ఫోనులే
వారెవా హాలిబెర్రీ పోజులే॥
థోడా థోడా థోడా చేసింది నన్నే
టుక్‌డా టుక్‌డా టుక్‌డా
ఆడ ఈడ యాడ
ఇన్నాళ్లు తెల్వలేదు దీని జాడ
సర్రా ఓ మేరా దిల్ లూట గయీ (4)
చరణం : 1
ఓ... జాబిల్లి పైన నీటి జాడ తెల్సెలే
ఈ పిల్ల మనసులోన మాట తెల్వదే
ఓ... జోలాలి పాటలోన
మాయ ఉందిలే
ఈ పిల్ల గాలిలోన మర్మముందిలే
లోటుపాటు చెప్పలే
పీక లోతు ముంచలే
అంతు పంతు లేదులే
దీని తంతు వేరులే
కక్కలేక మింగలేక
పీక్కోలేక ఏమి బాధ లే
సర్రా ఓ మేరా దిల్ లూట గయీ (4)॥
సర్రా సర్రా... సర్రా సర్రా...
చరణం : 2
ఓ... కన్నులో కన్నెప్రాణి కర్మాగారాలే
కవ్విస్తే కాలాపానీ కారాగారాలే
ఓ... నవ్వుల్తో నేరం చేసే
నైజం ఉందిలే
పువ్వుల్తో ప్రాణం పోసే
నేర్పు ఉందిలే
కొంత ఆమ్లముందిలే
కొంత క్షారముందిలే
కొంత ప్లస్సు ఉందిలే
కొంత మైనస్సుందిలే
సైన్సులోన మ్యాథ్సులోన
చెప్పలేని సత్యమిదిలే...
సర్రా ఓ మేరా దిల్ లూట గయీ (8)

చిత్రం : నా ఇష్టం(nA ishTam) (2012)
రచన : బాలాజీ(bAlAjI)
సంగీతం : చక్రి(chakri)
గానం : షాన్(shAn)


నీ కన్నుల్లో ఆ ఇష్టం
నీ నవ్వుల్లో ఆ ఇష్టం॥కన్నుల్లో॥

చూస్తుంటే నాకెంతో ఇష్టం
నీ మాటంటే నాకిష్టం
నీ తోడంటే నాకిష్టం
నీ నీడై ఉంటేనే ఇష్టం
చినుకే పడితే నువ్విలా
తాకేస్తున్నట్టే ఇష్టం
ఎదుటే పడుతూ నన్నిలా
కదిలిస్తూ ఉంటే ఇష్టం॥కన్నుల్లో॥

నీ ఇష్టం ఇష్టం ఇష్టం
ఇష్టాలన్నీ నాకిష్టం
నా ఇష్టం ఇష్టం ఇష్టం
కష్టాలైన నాకిష్టం
నీ వరమే ఎంతో ఇష్టం
నీ శాపం ఇంకా ఇష్టం
నీపై ఇష్టం పుట్టేవేళ
నీకై చావాలంటే ఇష్టం॥కన్నుల్లో॥


Nee kannullo a ishtam
nee navvullo a ishtam

Nee kannullo a ishtam
nee navvullo a ishtam
chusthunte naakentho ishtam
Nee maatante nakishtam
nee thodante naakishtam
nee needai untene ishtam

chiraake padithe nuvvila
thaakisthunatte ishtam
edute paduthu nannila
kadilisthu unte ishtam

Nee kannullo a ishtam
nee anvvullo a ishtam
nee ishtam ishtam ishtam ishtalanni naakishtam
naa ishtam ishtam ishtam kashtalina naakishtam
nee marape entho ishtam
nee shaapam entho ishtam
neepai ishtam putte vela neekai chavalante ishtam ishtam

Nee kannullo Nee navvullo
nee kannullo a ishtam
nee navvullo a ishtam


Special Note:
బాలాజీ పూర్తిపేరు మంగు వెంకటరమణమూర్తి. స్వస్థలం విజయనగరం. వాడేకావాలి (2008) సినిమాలో ‘ఏమైందో ఏమో నాలో కొత్తగా మరి’ అనే పాట ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆర్య-2, Mr. పర్‌ఫెక్ట్, కత్తి,నా ఇష్టం... సినిమాలకు పాటలు రాశారు. ఆయన రాసిన దాదాపు అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. ఆర్య-2 లో ‘ఉప్పెనంత ఈ ప్రేమకీ’ పాటకు రేడియోమిర్చి అవార్డు,Mr. పర్‌ఫెక్ట్ లో ‘డోల్ డోల్ డోల్’ పాటకు అక్కినేని అవార్డు అందుకున్నారు.

chaitramu kusumA~njali - చైత్రము కుసుమాంజలి

చిత్రం : ఆనందభైరవి(Anandabhairavi) (1984)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : రమేష్‌నాయుడు(ramesh naidu)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం(S.P.bAlasubrahmanyam)



పల్లవి :
చైత్రము కుసుమాంజలి... ఆ...
చైత్రము కుసుమాంజలి...
పంచమ స్వరమున ప్రౌఢకోకిలలు
నిసగ సగమ గమ
పసనిప మపగా
పంచమస్వరమున ప్రౌఢకోకిలలు
పలికే మరందాల అమృతవర్షిణి
పలికే మరందాల అమృతవర్షిణి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చరణం : 1
వేసవిలో అగ్నిపత్రాలు రాలి
విరహిణి నిట్టూర్పులా కొంతసాగి
గగగా దసనిదమగ సరిగా
దాద సాస గాగ మాద మదసా॥
జలద నినాదాల
పలుకు మృదంగాల (2)
వాసుక జలకన్యలా తేలి ఆడె
నర్తనకు కీర్తనకీ నాట్యకళాభారతికి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చరణం : 2
శయ్యలలో కొత్త ఒయ్యారమొలికే
శరదృతు కావేరీలా తీగసాగి
గగగా దసనిదమగ సరిగా
దాద సాస గాగ మాద మదసా॥
హిమజలపాతాల
సుమశర బాణాల (2)
మరునికి మర్యాదలే చేసి చేసి
చలిరుతువే సరిగమలౌ
నాదసుధామధువనికి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...


Special Note:
హాస్యబ్రహ్మగా పేరుపొందిన జంధ్యాలకు దర్శకునిగా ఇది తొమ్మిదవ చిత్రం.
ఈ చిత్రం ద్వారా జంధ్యాల ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకుడిగా జాతీయఅవార్డును అందుకున్నారు. కొండముది శ్రీరామచంద్రమూర్తి రచించిన ‘చిరుమువ్వల మరుసవ్వడి’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.