Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

inthajArE inthajArE - ఇంత్‌జారే ఇంత్‌జారే

చిత్రం : లవ్ ఫెయిల్యూర్(love failure) (2012)
రచన : శ్రీమణి(SrImaNi)
సంగీతం : ఎస్.ఎస్.థమన్(S.S.thaman)
గానం : కార్తీక్, సుచిత్ర(kArthIk,suchitra)


సాకీ :
పాతికేళ్లు వ్యర్థమేనా పేరుకైనా విలువలేదా
ఈ పిల్ల చెలిమిలో ఈ ఒక్క క్షణముకే
సలాము కొట్టేలా వయసు ఒట్టిపోయెనా
వెనకడుగే ముందుచూపా
నీవైపే పిల్లా వెల్లువెత్తే నా అడుగులే
నీలా మారిపోయే నా నడకలే
ఏ నీడా లేని దేహమేంటో
నీకు నాకు మధ్య అద్దం అడ్డు ఉన్నా
విడిపోవేమిటో
పల్లవి :
ఇంత్‌జారే ఇంత్‌జారే ఇంతలోకే ఎంత జోరే
బిందువల్లే ఉన్న నన్నే
జల్లులాగ మార్చినావే
ఇంత్‌జారే ఇంత్‌జారే
వింత మైకం చె ంత చేరే
నిన్ను కలిసే వేళకోసం
వెల్లి విరిసే ఈ హుషారే
చరణం : 1
చిన్నిచిన్ని కవితలున్న పుస్తకంలా
నీ జ్ఞాపకాలు నిండి ఉన్న మనసు నేడిలా
హైకూల తోటి కోయిలమ్మ
కుహుకూలు నింపుతోందిలా
నానీలు రాసి వయసు వాణి
బాణీ కట్టి పాడుతోందిలా
ఈ పది రోజులే నీ పది ఆంఖ్ లే
నిన్నిలా పదే పదే జ్ఞాపకం చేస్తుంటే
ఇంత్‌జారే ఇంత్‌జారే కాలికింది నేలజారే
తూలిపోయే భూమిలాగా
నవ్వులేక నేనెలాగ
ఇంత్‌జారే ఇంత్‌జారే
ఇంతలోకే ఎంత మారే
గుండె పిండే తేనె పట్టే
చేదు నిండా తీపి పుట్టే
చరణం : 2
నిన్న మొన్న కాలమంతా ఏమయిందో
రేపు అన్న భావమంతా మాయమైందో
నీ ఊహలోనే కాలమంతా
మైనమల్లె కరుగుతోందో
నీ రూపు తప్ప కంటిపాప
నన్ను కూడా చూడనందో
ఆశలే లేవులే ఆకలే ఉండదే
అలసటే రాదులే నిన్నిలా చూస్తుంటే
ఇంత్‌జారే ఇంత్‌జారే
తలపులన్నీ తారుమారే
సొంత స్ట్రీటులో నాకు నేనే
పరదేశిలా అయిపోయారే

ఇంత్‌జారే ఇంత్‌జారే
వరుస మొత్తం మారిపోయే
కళ్లు తెరిచే నిద్రపోయా
నిన్ను మరవడం మరిచిపోయా

Special Note:
సిద్ధార్థ్ పూర్తిపేరు సిద్ధార్థ్ సూర్యనారాయణ్. ‘బాయ్స్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సిద్ధార్థ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా, గాయకుడిగా కూడ రాణిస్తున్నారు.

Pathikellu vyardhamena perukaina viluvaleda
Ee pilla chelimilo ee okka kshnamuke
Salaamu kottaga vayasu ottipoyana
Venakaduge munduchupa
Ne vaipe… Pila veluvethe na adugule
Neela maripoye na nadakale ee neda leni dehameto
Neku naku madya addam una vedipodemito

Inthajaare injaare intha looke entha joore
Binduvalle unna nane jallulaaga marchinave
Inthajaare inthajaare vintha maikam chentha cheere
Ninnu kalise velakosam velliverise ee ushare

Chinni chinni kavithalunna pustakam la
Ne gyanapakalu nindi una manasu nenila
High coolu thoti kokilamma kuhukulu nimputundilaa
Na nelu rasi vayasu vadni bani katti paduthondilaa
Ee padii rojule neepadii aakale
Ninnale pade pade gyanapakam chestuntee
Inthajare inthajare kali kinda nela jaare
Tullipoye bhoomi laaga nuvvu leka nenelaaga
Inthajare inthajare inthaloke enthamare
Gundepinde tenepatte cheduninda theepiputte

Hey ninnamonna kalamantha emayindo
Repu ana bavamantha mayamaindo
Ne ooha lone kalamantha mainamalle karuguthondo
Ne roopu thapa kantipapa nannu kuda chudanando
Aasale levule aakale undade
Alasate raathule ninnila chustunte
Inthajare inthajare thalapulanni tharumare
Sontha streetlo naku nene paradesi la aipoyaane
Inthajare intha jare o oh oh o o
Inthajare inthajare varasa motham maripoye
Kallu terichi nidrapoya
Ninnu maravadam marchipoya

O prEma hrudaya vINa - ఓ ప్రేమ హృదయ వీణ

చిత్రం : దేవీపుత్రుడు(dEvIputruDu) (2001)
రచన : జొన్నవిత్తుల(jonnavittula)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : ఎస్.పి.బాలు, ప్రసన్న(S.P.bAlu,prasanna)
17 April - సౌందర్య వర్ధంతి


పల్లవి :
ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా
ప్రాణమా...
ఓ ప్రేమ నుదుటిమీద కావమ్మా
కుంకుమ...
పుసుపు పూల వెన్నెల
పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా॥ప్రేమ॥
చరణం : 1
అసలెందుకే ఆ అమృత మే
అనురాగముతో నువు నవ్వితే
రతిసుందరిలా దరిచేరితే
చెలరేగిపోయే యవ్వనమే
సెగ కోరికతో మాటాడితే
కొసచూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కానీ ఏకమవ్వనీ
రా మరి నా చెలి... ॥ప్రేమ॥
చరణం : 2
శహనాయి మోగే కోవెలలో
శశికాంతులతో నను చే రుకో
గృహదేవతవై ఒడిచేర్చుకో
రతనాలు పండే నీ జతలో
సుఖశాంతులతో శ్రుతి చేసుకో
ప్రియలాహిరిలో ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోని
కోటి జన్మలన్నీ తోడు ఉండనీ
రా మరి నా చెలి...॥ప్రేమ॥

Oh premaa hrudaya veena neevamma praanamaa...
oh premaa nudhutimeeda kaavammaa kunkumaa..
pasupu poola vennela
pasidi hamsa kannelaa
cheruma chaitrama snehama...

O premaa hrudaya veena neevamma pranama...

Asalenduke aa amrutame..
anuraagamutho nuvvu navvite..
rati sundarilaa daricherithe
cheli regipoye yavvaname
maga korikato maatlaadithe
kosa choopulato taakite
menu menu aani teli soliponee
yedi emi kaani ekamavvani
raa mari...naa cheli

O premaa hrudaya veena neevamma pranama...

Shehanaayi moge kovelalo
sasi kaantulato nanu cheruko
gruha devatavai odi cherchuko
ratanaalu pande nee jathalo
sukha shanthulato sruthi chesuko
priya laahirilo yeluko
lokamandu leni haayi andukoni
koti janmalanni todu undani
raa mari...naa cheli

O premaa hrudaya veena neevamma pranamaa...
o premaa nudhutimeeda kavamma kunkuma..
pasupu poola vennelaa
pasidi hamsa kannelaa
cherumaa...chaitramaa...snehamaa...



Special Note:
‘దేవీపుత్రుడు’... సౌందర్య, వెంకటేష్‌తో నటించిన ఆఖరి సినిమా. మొదటి చిత్రం సూపర్ పోలీస్ (1994). తర్వాత... ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996), పవిత్రబంధం (1996), పెళ్లి చేసుకుందాం (1997), రాజా (1999), జయం మనదేరా (2000) ఇత్యాది చిత్రాలలో ఈ జంట కలిసి నటించారు.

bAlamuraLIkrishna mAku - బాలమురళీకృష్ణ మాకు

చిత్రం : బొంబాయి ప్రియుడు(bombAyi priyuDu) (1996)
రచన : చంద్రబోస్(chandrabose)
సంగీతం : కీరవాణి(kIravANi)
గానం : ఎస్.పి.బాలు, చిత్ర)S.P.bAlu,chitra)


పల్లవి :
ఆ... ఆ... ఆ...
మగ మదనిసా సగమదనిసా ఆ... ఆ...
ఓహో... హిందోళం బాగుంది
పాడండి పాడండి...
బాలమురళీకృష్ణ మాకు బాల్యమిత్రుడే
ఆశాభోంస్లే అక్షరాలా అత్తకూతురే
గులామలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండేవాడు ఇంటి ముందరే
స్వచ్ఛమైన సంగీతం
ఖచ్చితంగా మా సొంతం
రాగజీవులం నాదబ్రహ్మలం స్వరం పదం

ఇహం పరం కాగా... ఆ... '
చరణం : 1
తేనెపాట పాడితే మేను పులకరించదా
వీణపాట పాడితే జాణ పరవశించదా
ఈలపాట పాడితే గాలి తాళమేయదా
జావళీలు పాడితే జాము తెల్లవారదా
భూపాలం పాడితే భూగోళం కూలదా
హిందోళం పాడితే ఆందోళన కలగదా
ఒహొహొ హొహొహో ఓ... ఓ...
కళ్యాణిలా పాడితే కళ్యాణం జరగదా
శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా
గులకరాళ్లకేమి తెలుసు చిలక పలుకులు
ఈ గార్దభాలకేమి తెలుసు

గాంధర్వ గానాలు... ఆ... '
చరణం : 2
ఆ... ఆ... ఆ... ఆ... ఆ...
సామగదామగ సామగదామగ
షడ్జమంలో పాడితే లోకమంతా ఊగదా
మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా
గొంతువిప్పి పాడితే మంత్రముగ్ధులవ్వరా
శ్రోతలంతా బుద్ధిగా వంతపాడకుందురా
ఎలుగెత్తి పాడగా ఆకాశం అందదా
శ్రుతి పెంచి పాడగా పాతాళం పొంగదా
ఒహొహొ హొహొహో ఓ... ఓ...
అలవోకగా పాడగా హరివిల్లే విరియదా
ఇల గొంతుతో పాడగా చిరుజల్లే కురవదా
తేటతెలుగు పాటలమ్మ తోటపువ్వులం
మేము సందేహమంటూ లేని

సంగీత సోదరులం ఆ... '

సనిస దానీసా గసనిద మగసా
తారినన్న తారినన్న తారినన్నన
నీ పప్పులుడకవోయ్
నీకు ముప్పు తప్పదోయ్ (2)
నినిస గాస నిసగా సనిదమసా
తారినన్న తారినన్న తారినన్నన

'పప్పులుడకవోయ్‌'

ససస ససగ సస సాగ ససగ ససాగ
సనిద మగస గమదా
మదనీ దని సాగస నీసని దానిద మగసా
నీసని దనిసా దస నిదనీ
మగ గస సని నిద దమ మగ గస గమ
దమగా నిదమా సనిదమగా
సగాగ సమామ గామగ సగమద మగ
సమామ గదాద మగమదనీ
ససగసా దాని ససమగా సనిస
గగగ ససస నినిని దదద గగసని
మమమ గగగ ససస నినిని మగసని
సమా సగా నిస దనిస
గామగసా సగా నిసా దనిమదనీ సాగసనీ
సామగ సామగ సామగ సామగ
సాగస నీసని దనిసా
సాగస నీసని దానిద మాదమ గమదని సగగా...
మాగమా గసగా గా సని దనిసా
సమగస నిగసని దసనిద మగసని
సాగమదామగ సాగమదామగ (2)
దా మద నీదమ దా మద నీదమ
మాదని సానిద మాదని సానిద
సాగసనీసని సాగసనీసని (2)
సమా... గా సా నీ దా నీ సా...