Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

prANamA prANamA - ప్రాణమా ప్రాణమా

చిత్రం : డార్లింగ్(darling) (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : జి.వి.ప్రకాష్‌కుమార్
గానం : రాహుల్ నంబియార్, బృందం


పల్లవి :
తాననాననానా... (2)
ప్రాణమా ప్రాణమా...
అరే సంద్రంలాగా పొంగావే
ఈరోజున
సిరి వర్షంలాగా కురిశావే
ఎద చాటున
చూపులతో ఏం చెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా
చరణం : 1
తాననాననానా...
నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ
వింటున్నానే మెల్లగా ఈ చోట
చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ
ఆగేలాగ లేదిక నీ ఆట
దూరాన్ని దూరంగా
తోశావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో
సపమప గమగా... (4)
నిదని పదమపా
సపమప గమగా... (2)
నిదని పదమపా
గమపని సాసానిరీ
సాసానిరీ నీదా సనీదా
సని సాసాని మరి సాసా
నిసరి నీద పమ దమారి మరినిరి
చరణం : 2
తాననాననానా...
గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులు
హాయి హాయిగా
ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు
తియతియ్యగా హో...
ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా॥


Another Link:
prANamA prANamA - ప్రాణమా ప్రాణమా

nEnA nIvE nEnA - నేనా నీవే నేనా

చిత్రం : అనగనగా ఓ అమ్మాయి(anaganagA O ammAyi) (1999)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్. చిత్ర


పల్లవి :
నేనా నీవే నేనా...
నేనే నీలో లేనా...
నవ్వుతూ నాలో జల్లే పూలేవాన
యవ్వనాలెగసేవేళ రావే మైనా
నేనా నీవే నేనా...
నేనే నీలో లేనా...
చరణం : 1
వయ్యారాల మేన
సొగసుయ్యాలలూగుదానా
జాలువారు జుంటి తేనె జంట కోరి
పొరలి పొంగగా
సౌందర్యాల సోల
నను సోకే చూపులోనా
ప్రాణమల్లె జీవితాన ప్రాయమంతా
వెల్లి విరియగా
పచ్చగిల్లు నీ పాదాలే
పారాణి లేక నేనా
వెచ్చగిల్లు నీ ఒళ్లోనా
వేసంగి జల్లు కానా॥
చరణం : 2
సాయంకాలాలలో
నీ సాయం కోరుకోనా
ఎంకి పాట మీద ఆన
నిన్ను చేరి నీడనివ్వనా
పూలే ఇచ్చుకోనా
విరబూసే ఈడు దానా
అందమంతా హారతైనా
శ్రీమతల్లే వచ్చి నిలవనా
నీ కాలి మువ్వనే కాలేనా
పెనుగాలి దివ్వెనైనా
రాగమైనా ఈ బంధానా
నే పల్లవించిపోనా॥

చిత్రం : ఆర్య-2(Arya - 2) (2009)
రచన : కేదార్‌నాథ్ పరిమి, దేవిశ్రీ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : బాబా సెహగల్, రీటా, దేవిశ్రీ


పల్లవి :
హే... టి ప్పుటాపు దొర కదిలిండో
ఎవరికి వీడు దొరకడులెండో
ముదురండో గడుసండో
తొడిగిన ముసుగండో
ఉప్పుకప్పురంబునొక్క లుక్కు నుండో
వీడి లుక్కు చూసి మోసపోకండో
ఎదవండో బడవండో వలలో పడకండో
కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు
కమాన్ కమాన్ మస్తు టైమింగు
కమాన్ కమాన్ రైటులొలరంగు
ఏ యాయియమ్యో
కమాన్ కమాన్ కోతల కింగు
కమాన్ కమాన్ మార్చే తన రంగు
కమాన్ కమాన్ పక్కా ప్లానింగు
ఏ యాయియమ్యో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్॥
వీడో పెద్ద వెధవ
ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి
నాలికంతా కందిపోయింది
కానీ ఎవడూ నమ్మడు పైగా ఈ రోజుల్లో
ఇలాంటోళ్లకు డిమాండ్ కొంచెం ఎక్కువ
అయినా ఇంకోసారి టై చే స్తా
తప్పకుండా వీడి తాటతీస్తా
సారీ నేను గుడ్‌బాయ్‌లా
ఉండాలనుకొంటున్నాను
అందుకే అందరిముందు కాల్చను
చరణం :
హిప్పులూపుతున్న క్యాటు వాకులండో
క్రొకడైల్ వీలు కాలు జారకండో
బ్రూలండో బ్రైటండో లైఫే చూస్తుండో
మేడిపండులాంటి మ్యాన్ వీడండో
మ్యాన్ హోల్‌లాంటి మైండు వీడిదండో
చీటండో చీపండో గజిబిజి పజిలండో
కమాన్ కమాన్
హీస్ గాట్ ఎ బాగ్ ఆఫ్ ట్రిక్స్
కమాన్ కమాన్ బివేర్ యు ట్వెంటీ చిక్స్
కమాన్ కమాన్ హార్టు హైజాకరు నమ్మొద్దే
కమాన్ కమాన్ హీస్ ద జాదూగర్
కమాన్ కమాన్ హి గివ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్
హీస్ ద కూల్ క్రాకర్ తాకొద్దే... హే..॥

మిస్టర్ పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్
మిస్టర్ పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్ మిస్టర్ పర్ఫెక్
కమాన్ కమాన్ ఓరి గోవిందో
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో
దోచేస్తాడయ్యో
కమాన్ కమాన్ హరియవో శంభో
కమాన్ కమాన్ రేగింది పంబో
కమాన్ కమాన్
వీణ్ని ఆపాలి మేనకో రంభో॥