Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

nEnE nAni nE - నేనే నాని నే

చిత్రం : ఈగ(eega) (2012)
రచన, సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : దీపు, జి.సాహితి


పల్లవి :
నేనే నాని నే... నే నీ నాని నే...
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె... ఓ... (2)
కళ్లకు ఒత్తులు వెలిగించి
కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతు ఉంటున్నా నే
అరె అరె అరె అరె... ఓ... (2)
కనబడినా ఓకె...
కనుమరుగవుతున్నా ఓకె... (2)
అరె అరె అరె అరె... ఓ... (2)
చరణం : 1
మాటల్లో ముత్యాలే దాచేసినా
చిరునవ్వు కాస్తై ఉలికించవా
కోపం అయినా
కోరుకున్నా అన్నీ నాకు నువ్వనీ
కనబడినా ఓకె...
కనుమరుగవుతున్నా ఓకె... (2)
అరె అరె అరె అరె... ఓ... (2)
చరణం : 2
నా భాషలో రెండే వర్ణాలనీ
నాకింక నీ పేరే జపమౌననీ
బిందు అంటే గుండె ఆగి
దిక్కులన్నీ చూడనా
కనబడినా ఓకె...
కనుమరుగవుతున్నా ఓకె... (2)
అరె అరె అరె అరె... ఓ... (2)

manassA ekkaDunnAv - మనస్సా ఎక్కడున్నావ్

చిత్రం : చూడాలనివుంది(chooDAlanivundi) (1998),
రచన : వేటూరి
సంగీతం : మణిశర్మ,
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
11 July - Today maNiSarma birthday




పల్లవి :
మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవాళ చెప్పడం
నువ్వనుకోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మకథ॥
చరణం : 1
హంస గీతమే వినరాదా హింస మానరా మదన
తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా
ఇప్పుడే విన్నాను చలి వేణువేదో
నిదరే ఇక రాదు లేవమ్మా
చెవులే కొరికింది చెలిమింటి మాట
ఎదలే ఇక దాచలేవమ్మా
పూలగాలికి పులకరం గాలి ఊసికే కలవరం
కంటిచూపులో కనికరం కన్నెవయసుకే తొలివరం
మొదలాయే ప్రేమ క్లాసు రాగసుధా॥
చరణం : 2
రాయలేనిదీ ప్రియలేఖ రాయబారమే వినమా
వేదమంటివి శుభలేఖ వెన్నెలంటని కలువా
పురులే విరిసింది నీలో వయ్యారం
కనులే తెరిచిందిలే పింఛం
వెలిగే నీలోన గుడిలేని దీపం
ఒడిలో తేరింది ఆ లోపం
ఎంకి పాటలో తెలుగులా తెలుగు పాటలో తేనెలా
కలవని హాలా మమతలా
తరగని ప్రియా కవితలా
బహుశా ఇదేమో భామ ప్లస్సు కదా॥
Download Song:
manassA ekkaDunnAv

Listen All Audio Songs:
chooDAlanivundi | 1 |

jeevatam saptasAgara - జీవితం సప్తసాగర

చిత్రం : చిన్నికృష్ణుడు(chinni krishNuDu) (1988)
రచన : వేటూరి
సంగీతం : ఆర్.డి.బర్మన్
గానం : ఆశాభోంస్లే, ఎస్.పి.బాలు
Photo:ఆర్.డి.బర్మన్, ఆశాభోంస్లే


పల్లవి :
జీవితం సప్తసాగర గీతం
వెలుగునీడల వేదం సాగనీ పయనం
కల ఇల కౌగిలించే చోట (2)॥
చరణం : 1
ఏది భువనం ఏది గగనం
తారాతోరణం
ఈ చికాగో సియర్స్ టవరే
స్వర్గ సోపానము
ఏది సత్యం ఏది స్వప్నం
డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో
తెలియదీ లోకము
బ్రహ్మమానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం...
మతి కృతి పల్లవించే చోట (2) ॥
చరణం : 2
ఆ లిబర్టీ శిల్పశిలలలో
స్వేచ్ఛాజ్యోతులూ
ఐక్యరాజ్యసమితిలోన కలిసే జాతులు
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఏ మియామి బీచ్ కన్నా
ప్రేమ సామ్రాజ్యము
సృష్టికే ఇది అందం
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం...
ఖుషి కృషి సంగమించే చోట (2)॥


External Links:
jeevatam saptasAgara-జీవితం సప్తసాగర (Audio) | 1 |