Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

jeevatam saptasAgara - జీవితం సప్తసాగర

చిత్రం : చిన్నికృష్ణుడు(chinni krishNuDu) (1988)
రచన : వేటూరి
సంగీతం : ఆర్.డి.బర్మన్
గానం : ఆశాభోంస్లే, ఎస్.పి.బాలు
Photo:ఆర్.డి.బర్మన్, ఆశాభోంస్లే


పల్లవి :
జీవితం సప్తసాగర గీతం
వెలుగునీడల వేదం సాగనీ పయనం
కల ఇల కౌగిలించే చోట (2)॥
చరణం : 1
ఏది భువనం ఏది గగనం
తారాతోరణం
ఈ చికాగో సియర్స్ టవరే
స్వర్గ సోపానము
ఏది సత్యం ఏది స్వప్నం
డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో
తెలియదీ లోకము
బ్రహ్మమానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం...
మతి కృతి పల్లవించే చోట (2) ॥
చరణం : 2
ఆ లిబర్టీ శిల్పశిలలలో
స్వేచ్ఛాజ్యోతులూ
ఐక్యరాజ్యసమితిలోన కలిసే జాతులు
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఏ మియామి బీచ్ కన్నా
ప్రేమ సామ్రాజ్యము
సృష్టికే ఇది అందం
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం...
ఖుషి కృషి సంగమించే చోట (2)॥


External Links:
jeevatam saptasAgara-జీవితం సప్తసాగర (Audio) | 1 |

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |