Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

gAli chirugAli ninu - గాలీ చిరుగాలీ నిను

చిత్రం : వసంతం(vasantam) (2003)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : కె.ఎస్.చిత్ర


పల్లవి :
గాలీ చిరుగాలీ నిను చూసినదెవరమ్మా
వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండనీ ఊపిరే నువ్వనీ
ఎన్నడూ ఆగని పయనమే నీదని॥
చరణం : 1
కనురెప్ప మూసి ఉన్న నిదరొప్పుకోను అన్న
నిను నిలువరించినా ఓ స్వప్నమా
అమావాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచిన ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ
పోల్చదు నేలమ్మా
ఉలి గాయం చేయకపోతే
ఈ శిల శిల్పం కాదమ్మా
మేలుకో మిత్రమా
గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చీకటే దారిగా వేకువే చేరదా...॥
చరణం : 2
చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా
నీ రాక ఆపినా వాసంతమా
ఏ కొండ రాళ్లైనా ఏ కోన ముళ్లైనా
బెదిరేనా నీ వాన ఆషాడమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలుసుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను
ఎదిగే విత్తనమా
సాగిపో నేస్తమా
నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా...॥

hE mantrAlaya deepA - హే మంత్రాలయ దీపా

సాకీ :

హే... మంత్రాలయ దీపా...
శ్రీరాఘవేంద్ర గురునాథా...
ప్రభో పాహిమాం...
శ్రీరాఘవేంద్ర గురునాథా (9)

పల్లవి :

నమ్మిన నా మది మంత్రాలయమేగా... ఓ...
న మ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురు బోధలు అమృతమయమేగా... ఓ...
చల్లని చూపులు సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
హనుమంత శక్తిసాంద్రా
హరినామ గాన గీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో...

చరణం : 1

నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా
నీ భజనే మా బ్రతుకైపోనీవా
పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
మనసు చల్లని హిమవంతా
భవము తీర్చరా భగవంతా
మహిని దాల్చిన మహిమంతా
మరల చూపుమా హనుమంతా
నీ వీణతీగలో యోగాలే పలుకంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో... ॥

చరణం : 2

వినాశ కాలంలోన ధనాశపుడితేలోనా
నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా
నీ తలపే మా తలుపే మూస్తుంటే
వెలుగు చూపరా గురునాథ
వెతలు తీర్చరా యతిరాజా
ఇహము బాపెనే హితబోధ
పరము చూపెనే ప్రియగాథ
నీ నామ గానమే ప్రాణాలై పలుకంగా
తుంగదళాల సేవ తులసీదళాల పూజ
అందుకో... ॥

చిత్రం : రాఘవేంద్ర (2003), రచన : వేటూరి
సంగీతం : మణిశర్మ, గానం : శ్రేయాఘోషల్, కల్పన

swAgatam OhO chilipi - స్వాగతం ఓహో చిలిపి

చిత్రం : ఆత్మీయులు(Atmeeyulu) (1969)
రచన : ఆరుద్ర
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
03 August - నేడు వాణిశ్రీ బర్త్‌డే


పల్లవి :
స్వాగతం!
ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనులు సైగచేస్తే
ఆగలేని దొరగారు॥
చరణం : 1
కొంగు తగిలిందా పొంగిపోతారు కొంగు తగిలిందా పొంగిపోతారు
కోరి రమ్మంటే బిగిసిపోతారు
ఎందుకో! ఎందుకో ఈ బింకము
అలిగినకొలది అందము
అబ్బాయిగారి కోపము (2)
పిలిచిన ప్రేయసికి కానుక!
నీ కానుక
బెట్టుచాలును దొరగారు...॥
చరణం : 2
అందమంతా విందుచేస్తే
అదిరిపడతారే (2)
పొందుకోరి చెంతచేర
బెదిరిపోతారే
సరసమొ విరసమొ ఈ మౌనము
అందిన చిన్నది చులకన
అందనిదెంతో తియ్యన (2)
అవతల పెట్టండి
తమాషా పోజులు...
మహారాజులు
అధిక చక్కని దొరగారు...॥


External Link:
Aathmeeyulu (1969)Audio Songs | 1 |