Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

EllElama - ఏల్లేలమా

చిత్రం: 7 సెన్స్(7th sense) (2011), రచన: భువనచంద్ర, సంగీతం: హారీస్ జయరాజ్
గానం: విజయ్ ప్రకాష్, కార్తీక్, షాలిని, రీటా



సాకీ :
ఏ మల్లాయిమ్మ మల్లాయిమ్మ మమ్మమమ్మా
ఏ మల్లాయిమ్మ మల్లాయిమ్మ మమ్మమమ్మా
వావాక్కా...
పల్లవి :
ఏల్లేలమా ఏలే ఏలమా
నా లోపల నువ్వే ప్రాణమా
సింగారమా నవ సింగారమా
మందారమై ఒళ్లో చేరుమా
నా గుండె కొలనులో
నువు పాదం పెడితే కులాసా
మొగమాటం చెదిరితే
మగవాడికి ఎంతో దిలాసా
సయ్యాటకు హద్దు లేదే మరి శిరీషా...
ఏల్లేలమా ఏలే ఏలమా
నా లోపల నువ్వే ప్రాణమా
శృంగరమా నవ శృంగరమా
భూకంపమై ఒళ్లో వాలుమా
నా గుండె కొలనులో
నీ పాదం పెడితే కులాసా
బులపాటం రగిలితే
ప్రియురాలికి ఎంతో దిలాసా
సరదాకే హద్దులేదు మరి చలోనా...
చరణం : 1
అరె న్యూటన్ చెప్పాడుగా
భూమి సూపర్ మ్యాగ్నెట్టని
ఇక నేను అంటానులే
నువ్వు నా లవ్ మ్యాగ్నెట్ అనీ
మూనై ఓ నేస్తమా ఇక చేస్తా ప్రదక్షిణం
నా ఎదలో సంగీతమై అలరించే అనుక్షణం
సెక్సీ వింటర్‌లో నా బాడీ హీటర్ నువ్వేగా
బర్నింగ్ సమ్మర్‌లో నా లవ్లీ కూలర్ నువ్వేగా
హోలీ హాంకాంగ్ సడిలో మిక్సైపోదాం పోరీ॥॥మల్లాయిమ్మ॥
చరణం : 2
సుడిగాలై కమ్మేయనా
చిరు ముద్దై చంపేయనా
ఎద పొంగే ఆనందమై
పరువాన్నే గుప్పేయనా
ఔనా ప్రియా ప్రియా నీ సొగసే హిమాలయ
పట్టేస్తే నీ కొంగుతో
చుట్టేయనా తస్సాదియ్యా
ఇరువురం మరో కొత్త ప్లానెట్‌లోకి పోదామా
డేలైట్‌నంతా మాయం చేసిhttp://www.blogger.com/img/blank.gif
మూన్‌లైట్‌లోనే ఉందామా
బిడియాలన్నీ రద్దే చేసి
ఎంజాయ్ చేద్దాం రావే ॥

Yellelama 7th sense Telugu Full song hd



Audio:
7th Sense Songs | Link |

vaddurA kannayyA - వద్దురా కన్నయ్యా

చిత్రం : అర్ధాంగి(arthAngi) (1955), రచన : ఆత్రేయ
సంగీతం : బి.నరసింహారావు-అశ్వత్థామ
గానం : జిక్కి

16 August - నేడు జిక్కి వర్ధంతి


పల్లవి :
వద్దురా కన్నయ్యా వద్దురా కన్నయ్యా
ఈ పొద్దు ఇలు వదిలి పోవద్దురా అయ్యా...॥
చరణం : 1
పశువులింటికి తిరిగి పరువులెత్తే వేళ (2)
పసిపాపలను బూచి పట్టుకెళ్లే వేళ (2)॥
చరణం : 2
పట్టు పీతాంబరము మట్టిపడి మాసేనూ (2)
పాలుగారే మోము గాలికే వాడేను (2)
వద్దురా... వద్దురా కన్నయ్యా...
చరణం : 3
గొల్లపిల్లలు చాల అల్లరివారురా (2)
గోలచేసి నీపై కొండెములు చెప్పేరు
ఆడుకోవలెనన్న పాడుకోవలెనన్న (2)
ఆడటను నేనున్న (2) అన్నిటను నీదాన
వద్దురా... వద్దురా... వద్దురా... వద్దురా
కన్నయ్యా... కన్నయ్యా

Special Note:
అసలుపేరు : పిల్లవలు గజపతి కృష్ణవేణి
జననం : 03-11-1935
జన్మస్థలం : చిత్తూరులోని చంద్రగిరి
తల్లిదండ్రులు : రాజకాంతమ్మ,గజపతినాయుడు, తోబుట్టువులు : నలుగురు తమ్ముళ్లు, నలుగురు చెల్లెళ్లు
చదువు : బి.ఏ., వివాహం : 26-06-1958
భర్త : గాయకుడు ఎ.ఎం.రాజా
సంతానం : ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు (అందరూ సంగీతంలో కృషి చేస్తున్నవారే)
తొలిపాట-చిత్రం : ఈ తీరని నిన్నెరిగి పలుకగా నా తరమా జగదేకకారణా - పంతులమ్మ (1943)
ఆఖరిపాట-చిత్రం : అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి - మురారి (2001)
పాటలు : దాదాపు పదివేలు (తెలుగు, తమిళ , మలయాళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో)
నటించిన సినిమాలు : పంతులమ్మ (1943), మంగళసూత్రం (1946)
అవార్డులు : తమిళనాడు నుండి ‘కళైమామణి’, తమిళనాడు రాష్ట్ర అవార్డు, తెలుగు ఉగాది పురస్కారం, మరికొన్ని సంగీత అవార్డులు అందుకున్నారు. ఇతరవిషయాలు : కృష్ణవేణి తన 7వ ఏట నుండే పాటలు పాడడం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుండే స్టేజి ప్రోగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. గూడవల్లి రామబ్రహ్మం సహాయంతో గాయకురాలిగా, నటిగా చిత్రసీమకు పరిచయం అయ్యారు. సంగీతం నేర్చుకోకుండా దేవుడు ప్రసాదించిన గొంతుతో ఎన్నో ఆణిముత్యాలను పలికించి సంగీత ప్రియులను అలరించారు. దేశవిదేశాలలో ఎన్నో స్టేజి ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నారు. అసలు పేరు కృష్ణవేణి అయినా ఆమె జిక్కిగా ప్రసిద్ధికెక్కారు.
మరణం : 16-08-2004

egarAli jAtIya patAkam - ఎగరాలి జాతీయ పతాకం

చిత్రం : మోసగాడు(monagADu) (1980), రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు


పల్లవి :
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి (2)
గగనం ఉన్నాళ్లదాకా కాలం కడతేరుదాకా
ఎగరాలి జాతీయ పతాకం ఎగరాలి
చరణం : 1
జాతి నిదుర లేచిన సమయం
జనానికిది పండుగ ఉదయం
అదిగో మన తపస్సు ఫలితం
అదే అదే మన స్వాతంత్య్రం
తరతరాల చీకటి ఇల్ల్లే
కటకటాల కౌగిట గుళ్ల్లే
బానిసలకు వారసులం
బ్రతికి ఉన్న పీనుగులం
ఎక్కడుంది స్వాతంత్య్రం
మాకేదీ ఆ స్వాతంత్య్రం
ఓ... మహామహుల త్యాగఫలం
మరిచిపోకు స్వాతంత్య్రం
యుగయుగాల పోరాటంలో
ఉదయించిన అమృతభాండం
స్వాతంత్య్రమే నీ జన్మహక్కని తెలుసుకో
అది అందుకునే అర్హత నీలో పెంచుకో
//ఎగరాలి//
చరణం : 2
ఇదిగిదిగో నా దేశంలో వెలిగిన
శతకోటి ఉషస్సులు
అదిగదిగో ఆకాశంలో
మువ్వన్నెల ఇంద్రధనుస్సులు
జైలన్నది భూతల నరకం
ఇది సజీవ శవాల దహనం జరిగే
మహా శ్మశానం
ఎక్కడుంది స్వరాజ్యం
రాబందుల రావణ రాజ్యం
ఓ... ఇది జగన్నాటక సూత్రధారి
శ్రీకృష్ణుడు జన్మించిన చోటు
రామదాసు మొరలే విని శరణే
శ్రీరాముడు విడిపించిన చోటు
ఇదే జాతిపిత బాపూజీ స్వరాజ్యాన్ని
సాధించిన చోటు
ఈ దేశం సందేశం నెహ్రూజీ వినిపించిన చోటు
//స్వాతంత్య్రమే// //ఎగరాలి//