Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

srIlakshmi peLliki - శ్రీలక్ష్మి పెళ్లికి

చిత్రం : జస్టిస్ చౌదరి(Justice Chowdary) (1982)
రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తి
గానం : బాలు, సుశీల, శైలజ

8 September - చక్రవర్తి జయంతి



పల్లవి :
శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం (2)
మాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం
చిగురులేసే సిగ్గు చీనాంబరాలు
తడిసి కురిసే కళ్లు నీ తలంబ్రాలు ॥
చరణం : 1
కనుబొమల నడుమ విరిగింది శివధనుసు
కన్నుల్లో మెరిసింది కన్నె సీత మనసు॥
ఆ రామచంద్రుడు నెలవంకలిస్తాడని (2)
పొడిచింది ఓ చుక్క బుగ్గలో ఇప్పుడు
అందాలకెందుకు
గంధాల పూతలు (2)
కళ్లకే వెలుతురు
మా పెళ్లికూతురు
ఈ పెళ్లికూతురు... ॥
చరణం : 2
అడగలేదు అమ్మనైనా
ఏనాడు ఆకలని
అలుసు చేయవద్దు
మీరు తానేమి అడగదని
ఆడగబోదు సిరిసంపదలు
ఏనాడూ పెనిమిటిని
అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని
చెప్పలేని మూగబాధ
చెప్పకనే తెలుసుకో
మాటలకే అందని మనసు...
చూపులతో తెలుసుకో...
రెప్పవలే కాచుకో...॥

Justice Chowdary Songs - Srilakshmi Pelliki Chirunavve - NTR Sridevi


pillalamu baDi pillamu - పిల్లలము బడి పిల్లలము

చిత్రం : బడిపంతులు (baDipantulu) (1972)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల, బృందం


పల్లవి : పిల్లలము బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము
పిడికిలి బిగించి కదిలాము
//పిల్లలము//

చరణం : 1
పలక బలపం పట్టిన చేతులు
పలుగు పార ఎత్తినవి (2)
ఓనమాలను దిద్దిన వే ళ్ళు
ఒకైటె మట్టిని కలిపినవి
ఒకైటె మట్టిని కలిపినవి
//పిల్లలము//

చరణం : 2
ప్రతి అణువు మా భక్తికి గుర్తు...
ప్రతిరాయి మా శక్తికి గుర్తు
//ప్రతి అణువు//
చేతులు కలిపి చెమటతో తడిపి (2)
కోవెల కడదాం గురుదేవునికి (2)
//పిల్లలము//

చరణం : 3
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
వెలుగును ఇచ్చే ఈ కిటికీలు
పంతులుగారి చల్లని కళ్ళు (2)
//పిల్లలము//

pakaDO O pakaDO - పకడో ఓ పకడో

చిత్రం : జులాయి(Julayi) (2012)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : మాల్గాడి శుభ, దేవిశ్రీ ప్రసాద్


పల్లవి :
పకడో... ఓ... పకడో... ఓ...
పకడో పకడో పకడో పకడో (2)
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో
చల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో (2)
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో
ముసుగున దాగి ఉన్నదెవడో
పరుగున దూకి వాణ్ణి పకడో
ఫికరిక చోడో... బ్యారికేడ్స్ తోడో
మాస్కులన్ని లాగెయ్‌రో
నలుగురిలోన నువ్వు ఒకడో
లేక నువ్వు కోటి మందికొక్కడో
గోడ చాటు షాడో... మిస్టరీకో ఫాడో
లెక్కలన్ని తేల్చెయ్‌రో
విక్రమార్క సోదరా... వీర పట్టు పట్టరా
ఆటు పోటూ దాటరా
హే... రిస్కో గిస్కో ఉస్కో పకడో ॥
చరణం : 1
నిన్న నువ్వు
మిస్సయింది పకడో
రేపు నీకు
ప్లస్సయ్యేది పకడో
ఒంటరైన జీరో...
వాల్యూ లేనిదెరో
దాని పక్క అంకెయ్‌రో
గెలుపను
మేటరుంది ఎక్కడో
దాన్ని గెలిచే రూటు పకడో
టాలెంటుంది నీలో... ఖుల్లంఖుల్లా ఖేలో
బ్యాటూ బంతీ నువ్వేరో
చెదరని ఫోకస్సే... సీక్రెట్ ఆఫ్ సక్సెస్సై
అర్జునుడి విల్లువై
యారో యారో యాపిల్ పకడో
చరణం : 2
జిందగీ జీనేకా పల్స్ పకడో
విక్టరీ కా హైట్సు పీక్సు పకడో
పట్టుకుంటే గోల్డయి... ప్లాటినం ఫీల్డయి
లైఫు నీకు దక్కాల్రో
నీలో కూడా స్పార్కు ఉన్నదెక్కడో
ఆరాతీసి దాని ట్రాకు పకడో
మాటలన్ని మానెయ్... యాక్షనే నీ భాషై
ఫుల్ తడాఖా చూపాల్రో
పెట్టుకున్న గోల్‌ని... కొట్టకుంటే క్రైమ్‌ని
వాడుకుంటే టైముని
దిల్ సే తేరే దిల్ కో పకడో॥

Julayi Full Songs With Lyrics - Pakado Pakado Song