Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

vELachUDa vennelAye - వేళచూడ వెన్నెలాయె

చిత్రం: నాటకాల రాయుడు(nATakAla rAyuDu) (1969)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : జి.కె.వెంకటేష్
గానం : పి.సుశీల
21 September - నేడు జి.కె.వెంకటేష్ జయంతి(G.K.venkatEsh)
పల్లవి :
వేళచూడ వెన్నెలాయె
లోనచూడ వెచ్చనాయె
ఎందుకోమరి తెలియదాయె
రేయి మాత్రం గడచిపోయె॥
చరణం : 1
కొమ్మకొమ్మకు చిగుళ్లాయె
గుండె నిండా గుబుళ్లాయె॥
పువ్వు పువ్వున తుమ్మెదాయె
పొంగు వయసుతో పోరులాయె॥
చరణం : 2
కునుకుపడితే ఉలికిపడుతాయె కునుకుపడితే ఉలికిపడుతాయె
మెలుకువైతే కునుకురాదాయె
వల్లమాలిన వగలతోటే
ఘల్లుఘల్లున తెల్లవారె॥
చరణం : 3
సరసమెరుగని చందమామ
చాటుమాటుగ సాగిపోయే॥
వెంటనున్న చుక్క కన్నె
జంటవుండీ ఒంటరాయె॥॥


పూర్తి పేరు : గురజాడ కృష్ణదాస్ వెంకటేష్

జననం : 21-09-1927

జన్మస్థలం : హైదరాబాద్

తల్లిదండ్రులు : రాజవేణి, కృష్ణదాస్

తొలిచిత్రం : బేబి (మలయాళం) - 1947, అత్తగారు కొత్త కోడలు (తెలుగు) - 1968

ఆఖరిచిత్రం : జగన్మాత (తెలుగు) - 1987

చిత్రాలు : దాదాపు 350 కి పైగా (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, హిందీ, అస్సామీ, ఒరియా)

మరణం : 17-11-1993

chAmanti EmiTE - చామంతి ఏమిటే

చిత్రం : ఆత్మీయులు(Atmeeyulu) (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల

20 September - నేడు ఏయన్నార్ బర్త్‌డే
AkkinEni Nageswararao (ANR)Birth Day


పల్లవి :
ఓ ఓ ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగినేల గిలిగింత
లేని పులకింత
ఓ ఓ ఓ... చిన్నారి చెల్లి పెళ్లి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది
వలపు పెరిగింది
చరణం : 1
ఇన్నాళ్లూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే॥
ఇన్నాళ్లూ నీ హొయలు చూశాను
నా ఎదలోనే పదిలంగా దాచాను వే చాను॥చామంతి॥
చరణం : 2
దూరాల గగనాల నీ మేడ
ఓ దొరసాని ననుకోరి దిగినావా॥
నీ మనసే పానుపుగా తలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను॥చిన్నారి॥

Jai Jai GaNeSA - జై జై గణేశా

చిత్రం : జై చిరంజీవ (Jai ChiranjIva) (2005), రచన : చంద్రబోస్
సంగీతం : మణిశర్మ, గానం : ఎస్.పి.బాలు, బృందం


పల్లవి : ఓం... జై గణపతి జై జై జై గణపతి (4)
జై జై గణేశా జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జగణేశా గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా గణేశా
లోకం నలుమూలలా లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
గణేశా గమ్ గణపతి... గణేశా గమ్ గణపతి
గణేశా గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
॥జై గణేశా॥
చరణం : 1

నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి
వాహనమై ఉండలేదా
ఎలకేమో తమరికి నెమలేమో తంబికి
రథమల్లే మారలేదా
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా
కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసామార్గం
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పరా మాకు సోదరభావం
మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా
॥గమ్ గణపతి॥॥జై గణేశా॥
చరణం : 2

చందాలను అడిగిన దాదాలను దండిగా
తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగిన
నాయకులను నేరుగా
దంతంతో దంచవయ్యా
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
మా సరుకుల ధరలన్నీ
దించాలయ్యా
మాలో చెడునే ముంచాలయ్యా
లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయ్యా
ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ
॥గమ్ గణపతి॥॥జై గణేశా॥
గణపతి బప్పా మోరియా...
ఆధా లడ్డు ఖా లియా (4)