kilakila navvulu - కిలకిల నవ్వులు
Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Krishna kumari / కృష్ణ కుమారి ,
Music Director :
Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,
Singer : Ghantasala / ఘంటసాల , P.Suseela / పి. సుశీల ,
Song Category : Love & Romantic Songs
శేఖర్ : కిలకిల నవ్వులు చిలికిన -
పలుకును నాలో బంగారు వీణ
వసంత : కరగిన కలలే నిలిచిన -
విరిసెను నాలో మందార మాల
శేఖర్ : రమ్మని మురళీ రవమ్ములు పిలిచె
అణువనువున బృందావని తొచె
వసంత : తళ తళ లాడే తరగల పైన
అందీ అందని అందాలు మెరిసే ||కిలకిల||
వసంత : నీవున్న వేరే సింగారము లేలా ?
నీ పాద ధూళి సిందూరము కాదా ?
శేఖర్ : మమతలు దూసి, మాలలు చేసి
గళమున నిలిపిన కల్యాణి నీవే ||కిలకిల||
శేఖర్ : నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలెను తీయని జ్వాల
వసంత : జల జల పారే వలపులలోనే
సాగెను జీవన రాగాల నావా
ఇద్దరు : కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ
sekhar : kilakila navvulu chilikina -
palukunu naalo bangaaru veena
vasantha : karagina kalale nilichina -
virisenu naalo mandaara maala
sekhar : rammani muralee ravammulu piliche
anuvanuvuna brundaavani toche
vasantha : tala tala laade taragala paina
andee andani andaalu merise ||kilakila||
vasantha : neevunna vere singaaramu lelaa ?
nee paada dhooli sindooramu kaadaa ?
sekhar : mamathalu doosi, maalalu chesi
galamuna nilipina kalyaani neeve ||kilakila||
sekhar : nee kurule nannu sokina vela
haayiga ragilenu teeyani jwaala
vasantha : jala jala paare valapulalone
saagenu jeevana raagala naavaa
iddaru : kilakila navvulu chilikina
palukunu naalo bangaaru veena
nI padamula prabyavi~nchina - నీ పదముల ప్రభవించిన
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చితానంద సమర్ధ సద్గురు
సాయినాథ మహరాజ్ కీ జై
పల్లవి
నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
ఏ క్షేత్రమైన, తీర్థమైన నీవేగా
ఏ జీవమైన, భావమైన నీవేగా
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
చరణం 1
మనుజులలో దైవము నీవు
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
చరణం 2
ఆరడుగుల దేహము కావు
భక్తుల అనుభూతికి ఆకృతి నీవూ
తరతమముల భేదము చెరిపావు
మతమన్నది లేదన్నావూ
అన్ని జీవులలో కొలువైనావూ
అత్మా పరమాత్మలు ఒకటేనన్నావూ
అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవూ
సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
rajadhiraja Yogiraja Parabrahma
Sri Saccitanamda Samardha Sadguru
Sayinatha Maharaj Ki Jai
Ni Padamula Prabavimcina Gamga, Yamuna
Ma Palita Prasarimcina Prema, Karuna
E Kshetramaina, Tirthamaina Nivega
E Jivamaina, Bavamaina Nivega
Nivu Leni Cotu Ledu Sayi
I Jagame Ni Dvarakamayi
Caranam 1
Manujulalo Daivamu Nivu
Kosala Ramudivai Kanipimcavu
Guri Tappani Baktini Pemcavu
Marutiga Agupimcavu
Bakta Sulabudavai Karunimcavu
Bola Samkarudiga Darsanamiccavu
Mukkoti Daivalu Okkataina Nivu
Ekamanekammuga Vistarimcinavu
Nivu Leni Cotu Ledu Sayi
I Jagame Ni Dvarakamayi
Caranam 2
Aradugula Dehamu Kavu
Baktula Anubutiki Akruti Nivu
Taratamamula Bedamu Ceripavu
Matamannadi Ledannavu
Anni Jivulalo Koluvainavu
Atma Paramatmalu Okatenannavu
Anurenu Brahmamda Visvamurti Nivu
Srushti Vilasamunake Sutradhari Nivu
Nivu Leni Cotu Ledu Sayi
I Jagame Ni Dvarakamayi