Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

lOkanAyakuDA - లోక నాయకుడా

చిత్రం : దశావతారం(daSAvatAram) (2008)
రచన : వెన్నెలకంటి
సంగీతం : హిమేష్ రేష్మియా, గానం : వినీత్

07 November - నేడు కమల్‌హాసన్ బర్త్‌డే(Kamal Hasan Birth Day)



పల్లవి :
Come dance with me before you go (4)
లోకమందున నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరతమాతకే పేరు॥
లోక నాయకుడా... లోక నాయకుడా...
నీ వెంటే ఉంది లోకం ఇక నీ కోసం ఆగే కాలం॥॥
చరణం : 1
నటనకు నవత తరగని యువత
నీ రసహృదయం రాయని కవిత॥
అభినయ సిరిగా అభినవ గిరిగా
వచ్చాడు రసరాజు
నిను చూసి మెచ్చాడు నటరాజు
శోధనలెన్నో ఎదురే ఐనా
సాధన మాత్రం నువు విడలేదు
చిన్ననాటి ఆ చిలిపితనానికి
ఆక్సిజన్ పెంచినావు
త్వరలోనే ఆస్కారు పొందుతావు॥॥
చరణం : 2
నారాయణునిది దశావతారం
నటనలో నీది నూరవతారం
ముసుగులు తీసి మనసులు తెలిసి
మనీషివైనావు
జ్ఞానంలో ఫ్రాయిడ్‌ని మించినావు
విత్తులలోనే వృక్షాలు ఎదుగు
నీ ఒక్కనిలో లోకాలు ఒదుగు
విశ్వవిజేతగా ఎదిగిన నటుడా
నీ సరి నీవేలే... ఎప్పటికీ నీ సరి నీవేలే॥॥

Listen All Songs:



External Link:
| Link | Audio |

pillani chUstE bommiDAy - పిల్లని చూస్తే బొమ్మిడాయ్

చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు(Cameraman Gangatho RAmbAbu) (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : మణిశర్మ, గానం : కారుణ్య, చైత్ర


పల్లవి :
పిల్లని చూస్తే బొమ్మిడాయ్
అందం చూస్తే టట్టఢాయ్
ఆపర బాబూ నీ లడాయ్
నాకాడెందుకు నీ బడాయ్ ॥
ఏమున్నావులే పుల్లట్టులాగా
సరాసరీ బుల్లెట్టులాగా గుండెల్లో దూరావే
తెగానురా టిక్కెట్టులాగా
పడ్డానురా వికెట్టులాగా కళ్లప్పగిస్తావే
చెమ్మక్ చెమ్మక్ చెల్లో నా పిప్పరుమెంటూ బిళ్లో
పిండేస్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జళ్లో
చెమ్మక్ చెమ్మక్ చెల్లో పడిపోతా ఇట్టే ఒళ్లో
చెమటలు పట్టేదాకా మనకుండదు ఇంటర్వెల్లో॥
చరణం : 1
యా... పట్టూ పట్టూ పావడా
అది ఒలెంపిక్కూ కాగడా
ఇనుకోరా ఎనకేరా సరదాగా జరదా పిల్లడా
యా... చుట్టుకొలతా దేవుడా
నన్ను జల్లించేసే జల్లెడా
మొనగాడా ఇటురారా
పరువాన్ని వేసేయ్ తంపడా
హేయ్... లవ్ లంకిణీ బాగుందే కసి కొంకిణీ
నీ జవానీ జై భవానీ జమ్ జమాయిస్తాగా॥॥
చరణం : 2
యా... అప్పడతప్పడ తాండరా
ఆడేద్దాం ఆదర బాదరా
అయ్ బాబోయ్... అయ్ బాబోయ్
సంటోడ ఎంతా తుత్తరా
యా... తూర్పు దక్షిణ ఉత్తర
నా ముద్దులతోనే ముద్దరా
ఇరగేసీ తిరగేసీ చేసెయ్యీ గత్తర గత్తరా
ఏయ్... హస్తినీ నీకోసం నేనొస్తినీ
నినుచూస్తినీ కాజేస్తినీ నీ యావదాస్తినీ॥

intEnayA telusukOvayA - ఇంతేనయా తెలుసుకోవయా

చిత్రం : కథానాయకుడు(KathAnAyakuDu) (1969)
రచన : దాశరథి
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల, బృందం

05 November - నేడు దాశరథి వర్ధంతి
పల్లవి :
ఇంతేనయా తెలుసుకోవయా...
ఈ లోకం ఇంతేనయా॥
నీతీ లేదు నిజాయితీ లేదు
ధనమే జగమయ్యా
చరణం : 1
డాబులుకొట్టి మోసం చేసి
జేబులు నింపేరు (2)
పాపం పుణ్యం పరమార్థాలు
పంచకు రానీరు
ఎవరికివారే యమునాతీరే
ఇదే ప్రపంచమయా॥
చరణం : 2 
పైసాతోటి సీసా చేరి
జల్సా చేసింది (2)
మనసే లేని సొగసేవుండి
మైమరపించింది
పైన పటారం లోన లొటారం
ఇదే ప్రపంచమయా॥
చరణం : 3
మంచిని చేసే మనిషిని నేడు
వంచన చేసేరు (2)
గొంతులు కోసేవాడికి
నేడు గొడుగులు పట్టేరు
దొంగలు దొరలై ఊళ్లే దోచిరి
ఇదే ప్రపంచమయా॥