Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

melikal tirugutuNTE - మెలికల్ తిరుగుతుంటే

చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు(Cameraman Gangatho rAmbAbu) (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : మణిశర్మ
గానం : నరేంద్ర, గీతా మాధురి


పల్లవి :
ఏయ్... మెలికల్
తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
మెకన్నాస్ గోల్డ్‌లాంటి పాపాయో
మేరే దిల్ ధీంతనకా డాన్సాయో
ఏయ్ నచ్చావబ్బాయ్ కౌబాయ్
లవ్‌బాయ్ మహా గడుగ్గాయ్
వచ్చానబ్బాయ్ బుజ్జాయ్ ఎంజాయ్
నేనే కడక్ ఛాయ్
ఏయ్ సిల్కుషిఫానా ఇష్క్ తుఫానా
దోచుకుపోతా సరేనా
రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా
చరణం : 1
ఇలా లిప్పు లాకేశావ్
అలా నిప్పు రాజేశావ్ తరారూ...
నన్నే తోసుకొచ్చేశావ్
నీతో తీసుకొచ్చేశావ్ తరారూ...
కిస్సు క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకినీ
పరేషానే చేశావులే పిలగాడినీ
ఫుల్లు ఫాలోయింగ్ నీదే కదా
చూసీ చూడంగ పడిపోయా
అయిపోయా ఫిదాఫిదా...॥రెడీ॥
చరణం : 2
నీలోవుంది హెరాయిన్
నువ్వే నాకు హీరోయిన్ తరారూ...
చూపుల్లోన బ్యారల్‌గన్
టిగ్గర్‌నొక్కి ధనాధన్ తరారూ...
నాలో నువ్వొచ్చీ మోగించావ్
షెహనాయినీ
ఎట్టా మోసేదీ అమ్మాడూ
ఈ హాయినీ
యాడ చూస్తున్నా నీదే హవా
ఐయామ్ లక్కీరా దక్కావ్‌రా
అక్కీర కురస్సొవా॥రెడీ॥

virisE challani - విరిసే చల్లనీ

చిత్రం : లవకుశ(LavakuSa) (1963)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : ఘంటసాల
గానం : ఎస్.జానకి, బృందం


పల్లవి :
విరిసే చల్లనీ వెన్నెలా (2)
మరల ఈనాడు మా కన్నులా॥
చరణం : 1
చెన్నుమీర జానకమ్మ
అంకమ్మున వామాంకమ్మున
మా కన్నుదోయి విందుచేసి
మా రాముడు కరుణాధాముడు॥
మదినెన్నో వింత సంబరాలు మీరగా ॥
చరణం : 2
మరువగరానీ పండుగ నేడు
మా పాలికీ సర్వ జీవాళికి
మా ఊరూనాడూ వెల్లి విరిసే
ఉల్లాసము మధురోల్లాసము॥
ధర పొంగీపోయీ
ఆటలాడే హాయిగా ॥

paTTukO paTTukO - పట్టుకో పట్టుకో


చిత్రం : ఛాలెంజ్ రాముడు(ChAleng rAmuDu) (1980)
రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల




పల్లవి :
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో
నీలాల నీ మబ్బుచీర ॥
సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదానా
అహా... ఎందుకూ?
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలా చుట్టుకో పైటలా కప్పుకో
నీ చూపు నా చుక్కచీర ॥
సిగ్గులేలా చిన్నవాడ నీలోనే నేనులేనా॥॥
చరణం : 1
పైటేస్తే జారిపోయే గాలేస్తే చీరపోయే
చలి నాలో ముదిరిపోయే
జత నీతో కుదిరిపోయే
కన్నేస్తే కందిపోయే
చేయేస్తే కుదిరిపోయే
ప్రేమ నీకు పెరిగిపోయే
పెళ్లి నాకు జరగదాయే
మంచిరోజు చూసి
నువ్వు లగ్గమెట్టుకో
మల్లెపూలు తెల్లచీర
సారె పెట్టుకో అట్టాగే...
అట్టాగే అంటుంటే
ఇట్టాగే ఉండుండి
ఆశలన్నీ అడుగంటులు తొందరపడవే
ఆ... చూద్దాం లే... ॥॥
చరణం : 2
మెరుపులాంటి నిన్ను చూశా
ఉరుముతున్న వన్నె చూశా
అహ చిలికి చిలికి గాలివానై
కమ్ముకొస్తే కలిసిపోతా
పిడుగులాంటి నిన్ను చూశా
గొడుగులాంటి నీడ చూశా
కదిలి కదిలి కన్నెవాగై
కౌగిలిస్తే పొంగిపోతా
మూడుముళ్లు పడ్డదాకా ముద్దులాపుకో
తలుపు గడియ పడ్డదాక వలపులాపుకో
అట్టాగే అంటుంటే ఇట్టాగే ఉండుండి
చీరెగిరి పోతాది గుర్తుపెట్టుకో...
అమ్మ బాబోయ్...॥॥