Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

vennaNTE uNTunnA - వెన్నంటే ఉంటున్నా

చిత్రం : అందాల రాక్షసి(andAla rAkshasi) (2012)
రచన : కృష్ణకాంత్
సంగీతం : రధన్
గానం : రంజిత్



పల్లవి :
వెన్నంటే ఉంటున్నా
కడదాకా వస్తున్నా
నా ప్రాణం నీదన్నా ప్రేమ
నీ నవ్వుల తానాన
నేనెపుడో పడిపోయా
తప్పంతా నీదేగా ప్రేమ
అరకొరగా సరిపోనా
కసరకలా సరే పోనా
కోపంగా చూస్తున్నా
నీ నవ్వై నే రానా
చరణం : 1
బస్సెక్కిన నెరజాణ...
ఆకే దిల్ మే బస్ జానా
మిస్సయిన మిస్సైల్‌లాగ
నాపై ఫైరేలా
అటు ఇటు ఎటు పరిగెడుతున్నా
వెనుతిరిగితే నేనే ఉన్నా
అలుపెరుగని సూర్యుణ్నేనే
నాతో పంతాలా
పారిపోతే నువ్వు డే టైమ్‌లో
ఉన్నట్టేలే నా ఒళ్లో...
జారిపోతే రాతిరి రహదారుల్లో
మూనై రానా మఫ్టీలో
కదిలించే నిదురవనా
బాధించే హాయినవనా
కలబడితే గెలుపవనా
విసురుగ నన్నే విసిరేసినా
నను తరిమే తరమవునా
నిను తడిమే తరమవనా
చరణం : 2
చుక్కల్లో దాక్కున్నా
నీ పక్కన నేనున్నా
ఉరికే నది ఎటుచూస్తున్నా నే లేనా
ఊ అంటే నిజమౌతా
కాదంటే కలనౌతా
వద్దన్నా ఎదురౌతా లేమా
స్వర్గంలో నేనుంటా
నీకోసం చూస్తుంటా
మొదలైన మరుజన్మ
మారదులే నీ ఖర్మ

kaLyANa vaibhOgamE - కళ్యాణ వైభోగమే

చిత్రం : సీతారామకళ్యాణం(sItArAma kaLyANam) (1986)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల



సాకీ :
విడిపోము మనము
ఈ ఎడబాటు క్షణము
ఆపైన కళ్యాణము...
పల్లవి :
కళ్యాణ వైభోగమే...
కళ్యాణ వైభోగమే...
శ్రీ సీతారాముల కళ్యాణమే
మనమాంగల్యధారణ
శుభలగ్నమే ॥
చరణం : 1
అనుకున్న కొన్నాళ్ల వనవాసము
మునుముందు కావాలి
మధుమాసము ॥
మన ప్రేమ తుదిలేని ఆకాశము మన ప్రేమ తుదిలేని ఆకాశము
ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము॥
చరణం : 2
మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే
తలంబ్రాలుగా ॥
హృదయాల నాదాలే వేదాలుగా హృదయాల నాదాలే వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా॥
చరణం : 3
వలచాము నిలిచాము ఒకదీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా॥
గెలిచాము కలిశాము దివిమెచ్చగా గెలిచాము కలిశాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా॥

uTTimIda kUDu - ఉట్టిమీద కూడు

చిత్రం : ఒకేఒక్కడు(okE okkaDu) (1999)
రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : శంకరమహదేవన్, ఎస్.జానకి


పల్లవి :
హే... చంద్రముఖి...లైల లైలలే లై లలైలే
హే... ఉట్టిమీద కూడు ఉప్పు చాపతోడు (2)
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన
చచ్చిపోవ తోచనమ్మ నాకు ॥
ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
కోలా ఓ కోలా కోలా గలా (4)
చరణం :
1 కొర్రమీను తుళ్లే కాలువలో
రెల్లుగడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు తైతైతైతైతై
చలి గంగ స్నానాలు చేద్దామా
సిగ్గు విడిచి వైవై... లైలైలైలైలై లైలలైలైలైలైలై...
కోకలు రాకలు కల్లేనోయ్
బతుకే నిమిషం నిజమేనోయ్
ఏ... అరటి ఆకున నిన్నే విందుగ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
ఆశే పాపం హాయ్ హాయ్ హాయ్
చెవిలో గోల గోయ్ గోయ్ గోయ్
పరువపు వయసు సేవలన్నీ॥॥॥
ఓ చంద్రముఖి... చంద్రముఖి
ఓ లైల లైల లైలై... చంద్రముఖి లైలైలైలైలై
చరణం : 2
గాలి తప్ప దూరని అడవిలో
తుర్రుపిట్ట కట్టిన గూటిలో
ఒకరోజు నాకు విడిది చెయ్ ॥
నువ్వు చీర దొంగలించి పోయేనా
పరువు నిలువు దాచెయ్
వలువలు అన్నవి కల్లేనోయ్
దాగిన ఒళ్లే నిజమేనోయ్ (2)
అంతటి అందం నాకే సొంతం ॥
ఎదలో రొదలే తైతైతై
తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
మేను మేను కలవడమే ॥
ఉట్టిమీద కూడు ఉప్పు చాపతోడు
వడ్డించ నేను చాలు నీకు ॥