uTTimIda kUDu - ఉట్టిమీద కూడు
చిత్రం : ఒకేఒక్కడు(okE okkaDu) (1999)రచన : ఎ.ఎం.రత్నం, శివగణేశ్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : శంకరమహదేవన్, ఎస్.జానకి
పల్లవి :
హే... ఉట్టిమీద కూడు ఉప్పు చాపతోడు (2)
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టినెత్తిన గుండెలో మధ్యన
చచ్చిపోవ తోచనమ్మ నాకు ॥
ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా
కోలా ఓ కోలా కోలా గలా (4)
చరణం :
1 కొర్రమీను తుళ్లే కాలువలో
రెల్లుగడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు తైతైతైతైతై
చలి గంగ స్నానాలు చేద్దామా
సిగ్గు విడిచి వైవై... లైలైలైలైలై లైలలైలైలైలైలై...
కోకలు రాకలు కల్లేనోయ్
బతుకే నిమిషం నిజమేనోయ్
ఏ... అరటి ఆకున నిన్నే విందుగ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
ఆశే పాపం హాయ్ హాయ్ హాయ్
చెవిలో గోల గోయ్ గోయ్ గోయ్
పరువపు వయసు సేవలన్నీ॥॥॥
ఓ చంద్రముఖి... చంద్రముఖి
ఓ లైల లైల లైలై... చంద్రముఖి లైలైలైలైలై
చరణం : 2
గాలి తప్ప దూరని అడవిలో
తుర్రుపిట్ట కట్టిన గూటిలో
ఒకరోజు నాకు విడిది చెయ్ ॥
నువ్వు చీర దొంగలించి పోయేనా
పరువు నిలువు దాచెయ్
వలువలు అన్నవి కల్లేనోయ్
దాగిన ఒళ్లే నిజమేనోయ్ (2)
అంతటి అందం నాకే సొంతం ॥
ఎదలో రొదలే తైతైతై
తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
మేను మేను కలవడమే ॥
ఉట్టిమీద కూడు ఉప్పు చాపతోడు
వడ్డించ నేను చాలు నీకు ॥