Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

pachchani tOTa - పచ్చని తోట

చిత్రం : కడలి (2013)
రచన : వనమాలి, సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : అభయ్ జోధ్‌పుర్కర్, హరిణి


పల్లవి :
పచ్చని తోట... పసరుల తావి
నిశీధి మౌనం... నీ ప్రేమగానం
పౌర్ణమి రేయి... పొగమంచు అడవి
ఒంటరిగ వెళ్లే నీతోటి పయనము
ఇవి మాత్రం చాలు... ఇవి మాత్రమే
నాకింక చాలు నువు మాత్రమే॥మాత్రం॥॥
చరణం : 1
కొలనుల నీటిలో తడిసే కొంగలు
విదిలించు రెక్కల జల్లే అందమె
ముక్కోపం విడిచి నీ కొంగు తీసి
నా మేను తుడిచే నిన్నల్లుకోనా
ఇది మాత్రం చాలు... ఇది మాత్రమే
నాకింక చాలు నువు మాత్రమే॥మాత్రం॥
చరణం : 2
మానులు వొణికే మంచుకు తడిసే
నెత్తురు నిలిచే చలికే జడిసే
ఉష్ణం కోరెలే వయసే చోటే
ఒకటే దుప్పటిలో ఇరువురం ఉంటే॥మాత్రం॥॥

rAgamO anurAgamO - రాగమో అనురాగమో

చిత్రం : నాలుగు స్తంభాలాట (nAlugu stambhAlATa)(1982)
రచన : వేటూరి, సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి :
రాగమో అనురాగమో గీతమో సంగీతమో
నా గుండెలో ఓ కోయిల పూదండలో సన్నాయిలా
వలచి పిలిచే మత్తుగా కొత్తగా లవ్ మీ లవ్ మీ॥
చరణం : 1
సూరీడు చల్లారు నీ చూపు
చలిగాలిలా వీచె నావైపు
పరుగెత్తే పరువంలోన పడగెత్తే ప్రణయంలాగ
సాగిపోవాలి జతగా
నీ కంటిలో ఉన్న చలిమంట
తొలిగంట కొట్టింది నా కంట
పయనించే గగనంలోన కలిపే ఋతుపవనంలాగ
జల్లు రావాలి వడిగా
ఈ వడిలో ఉరవడిలో ముడివడి పోవాలి
కాలమెంత దూరమో కలిసి చూడగా॥
చరణం : 2
సందెల్లో మందార బొట్టుంది
అందాల ముద్దిచ్చి అంటింది
సెలయేటి అలజడిలోన చెలరేగే అల్లరిలాగ
ఊగిపోవాలి కలిసి
సిగ్గుల్లో చిగురంత ఎరుపుంది
వత్తుల్లో వరసైన వలపుంది
నాజూకు నడకల్లోన నలిగేటి మొలకల్లాగ
ఆవిరవ్వాలి అలసి
ఆవిరిలో నా విరులే విరవిరలాడాలి
కౌగిలింత నేనుగా కలిసి చేరగా॥

kathagA kalpanagA - కథగా కల్పనగా

చిత్రం : వసంతకోకిల(vasanta kOkila) (1982)
రచన : మైలవరపు గోపి
సంగీతం : ఇళయరాజా
గానం : ఘంటసాల

పల్లవి :
కథగా కల్పనగా
కనిపించెను నాకొక దొరసాని (2)
నా మదిలోని పాటగా
ఆమని విరిసే తోటగా
లాలీలాలో... జో... లాలిలో... (2)॥
చరణం : 1
మోసం తెలియని లోకం మనది
తీయగ సాగే రాగం మనది
ఎందుకు కలిపాడో
బొమ్మలను నడిపే వాడెవడో
నీకూ నాకూ సరిజోడనీ
కలలోనైన విడరాదనీ॥
చరణం : 2
కారడవులలో కనిపించావు
నా మనసేమో కదిలించావు
గుడిలో పూజారై
నా హృదయం నీకై పరిచాను
ఈ అనుబంధమేజన్మదీ
ఉంటే చాలు నీ సన్నిధి॥