Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

enta madhuraseema - ఎంత మధురసీమ

చిత్రం : దేవాంతకుడు(dEvantakuDu) (1960)
రచన : ఆరుద్ర, సంగీతం : అశ్వత్థామ
గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి

పల్లవి :
ఎంత మధురసీమ ప్రియతమా
సంతతము మనమిచటే...
సంతతము మనమిచటే సంచరించుదామా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 1
వినువీధుల తారకలే
విరజాజుల మాలికలై (2)
కనులముందు నిలువగా...
కనులముందు నిలువగా
నీ కురులలోన ముడిచెదనే
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 2
గగన గంగ అలలలోన
కదలియాడు తామరలే (2)
కరములందు వచ్చి చేర...
కరములందు వచ్చి చేర
నీ చరణ పూజచేయుదునా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 3
ఎటుచూచిన అందమే
చిందును మకరందమే (2)
ఈ వన్నెల వెన్నెలలో...
ఈ వన్నెల వెన్నెలలో ఓలలాడి సోలుదుమా
ఎంత మధురసీమ ప్రియతమా
చరణం : 4
కమ్మని ఈ వనమందున
కలసిమెలసి పాడుదమా (2)
కల్పవృక్ష ఛాయలోన...
కల్పవృక్ష ఛాయలోన కాపురమే చేయుదమా
ఎంత మధురసీమ ప్రియతమా

chiTApaTA chinukulatO - చిటాపటా చినుకులతో

చిత్రం : అక్కాచెల్ల్లెలు (akkAchellelu)(1970)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల

పల్లవి :
చిటాపటా చినుకులతో
కురిసింది వాన మెరిసింది జాణ॥
తళాతళా మెరుపులతో
మెరిసింది పైన ఉరిమింది లోన॥
చరణం : 1
వచ్చే వచ్చే వానజల్లు (2)
జల్లు కాదది పొంగివచ్చు పడుచుదనం
వరదలే అది (2)
వరద కాదది...
ఆగలేని చిలిపితనం వాగులే అది నీ వేగమే ఇది
కురిసింది వాన మెరిసింది జాణ॥
చరణం : 2
నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి
చుక్కలన్నీ చీకట్లా ముసుగు కప్పుకున్నవి॥
ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది (2)॥
చరణం : 3
మెరిసే మెరిసే రెండు కళ్లు (2)
కళ్లు కావవి మనసులోకి తెరచిన వాకిళ్లులే అవి కళ్లు కావవిమనసులోకి తెరచిన వాకిళ్లులే అవి
వాకిళ్లు కావవివలపు తేనెలూరే రసగుళ్లులే అవి సెలయేళ్లులే ఇవి
మెరిసింది పైన ఉరిమింది లోన॥॥

parugulu tiyyAli - పరుగులు తియ్యాలి

చిత్రం : మల్లీశ్వరి (mallIswari)(1951)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, భానుమతి
24 February - నేడు దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి


పల్లవి :
ఓ ఓ ఓ..
హేయ్...  పరుగులు తియ్యాలి
గిత్తలు ఉరకలు వేయాలి (2)
హేయ్... బిరబిర చరచర పరుగున పరుగున
ఊరు చేరాలి మన ఊరు చేరాలి... ఓ...
హోరుగాలి కారుమబ్బులు (2)
ముసిరేలోగా మూగేలోగా
ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ మెళ్లో గంటలు
ఆ... గలగల గలగల
కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ
మెళ్లో గంటలు
వాగులు దాటి
వంకలు దాటి
ఊరు చేరాలి
మన ఊరు చేరాలి
చరణం :
ఆ... అవిగో అవిగో...
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో... అవిగో అవిగో॥

ఆ... పచ్చని తోటల విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు... అవిగో...
కొమ్మల మోగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు
అవిగో అవిగో... అవిగో అవిగో...