Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

AvakAya mana - ఆవకాయ మన


చిత్రం : మిథునం (mithunam)(2012),

సంగీతం : వీణాపాణి,
రచన : తనికెళ్ల భరణి,
గానం : బాలు, స్వప్న



పల్లవి :
ఆవకాయ మన అందరిదీ
గోంగూర పచ్చడి మనదేలే (2)
ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు
పాస్తాలు ఇంకెందుకులే (2)’’ఆవకాయ’’
చరణం : 1
ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ
పెసరట్టులోకి అల్లమురా (2)
దిబ్బరొట్టెకి తేనె పానకం
దొరకకపోతే బెల్లమురా
వేడి పాయసం ఎప్పటికప్పుడె
పులిహోరెప్పుడు మర్నాడే (2)
మిర్చీ బజ్జీ నోరు కాలవలె
ఆవడ పెరుగున తేలవలె ’’ఆవకాయ’’
చరణం : 2
గుత్తివంకాయ కూర కలుపుకొని
పాతిక ముద్దలు పీకుమురా (2)
గుమ్మడికాయ పులుసుందంటే
ఆకులు సైతం నాకునురా
పనసకాయనే కొన్న రోజునే పెద్దలు
తద్దినమన్నారు (2)
పసనపొట్టులో ఆవ పెట్టుకొని
తరతరాలుగా తిన్నారు
తిండి గలిగితే కండ గలదని
గురజాడ వారు అన్నారు
అప్పదాసు ఆ ముక్క పట్టుకొని
ముప్పూటలు తెగ తిన్నారు

Adi dampatulE - ఆదిదంపతులే

చిత్రం : మిథునం(mithunam) (2012),

సంగీతం : వీణాపాణి,
రచన : జొన్నవిత్తుల,
గానం : కె.జె.ఏసుదాస్


పల్లవి :
ఆదిదంపతులే అభిమానించే
అచ్చతెలుగు మిథునం ’’ఆది’’
అవని దంపతులు ఆరాధించే
ముచ్చటైన మిథునం ’’అవని’’
సుధాప్రేమికుల సదనం
సదాశివుని మా రేడువనం
సదాశివుని మారేడువనం ’’ఆది’’
చరణం : 1
దాంపత్య రసజ్ఞుడు
ఆలికొసగు అనుబంధ సుగుంధ ప్రసూనం
నవరసమాన సమరసమాన (2)
సహకార స్వరమే వనం
భారతీయతకు హారతి పట్టే
ఋషిమయ జీవనవిధానం
భార్య సహాయముతో
కొనసాగే భవసాగర తరణం
భవసాగర తరణం... ’’ఆది’’
చరణం : 2
అల్ప సంతసపు కల్పవక్షమున
ఆత్మకోకిలల గానం
పురుషార్థముల పూలబాటలో
పుణ్యదంపతుల పయనం
అరవై దాటిన ఆలుమగల... (2)
అనురాగామత మథనం
గహస్థ ధర్మం సగర్వమ్ముగా
తానెగరేసిన జయకేతనం... జయకేతనం...
*********

adEnIvanTivi - అదే నీవంటివి


చిత్రం : సప్తస్వరాలు(sapta swarAlu) (1969)

రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.వి.రాజు
గానం : ఘంటసాల, పి.సుశీల

పల్లవి :
అదే నీవంటివి అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
చరణం : 1
ఎవ్వరు లేని పువ్వులతోట
ఇద్దరు కోరే ముద్దులమూట॥
ఎదలో కదలాడె పెదవుల తెరవీడి
చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని
చరణం : 2
పున్నమిరేయి పూచిన చోట
కన్నులు చేసే గారడి వేట॥
చూపులు జతచేసి ఊపిరి శ్రుతిచేసి
తనువే జిల్లన కవ్వించిన ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని
చరణం : 3
నిన్నూ నన్నూ కలిపిన బాట
నీలో నాలో పలికిన పాట॥
జాబిలి సిగ్గిలగా కౌగిలి దగ్గరగా
మనసే ఝల్లన చిలికించి ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
Listen Song : Ade nIvanTivi
Special Note:
పూర్తిపేరు : తోటకూర వెంకట రాజు
జననం : 25-10-1921
జన్మస్థలం : రఘుదేవపురం, తూ.గో.జిల్లా.
తల్లిదండ్రులు : రత్తమ్మ, పెద్ద సోమరాజు
భార్య : 14-02-1951 - సావిత్రి
సంతానం : కుమారులు (వెంకట సత్య సూర్యనారాయణరాజు - గిటారిస్ట్, వెంకట సోమరాజు (రాజ్) - సంగీత దర్శకులు)
తొలి చిత్రం : టింగ్ రంగా (1952)
ఆఖరి చిత్రం : మనుషుల్లో దేవుడు (1974) (ఈ చిత్రంలో మనుచరిత్రలోని వరూధిని ప్రవరాఖ్య ఘట్టంలో పద్యాలు, చెట్టంత మొనగాడ..., హే రేఖ ఓ శశిరేఖ... అనే రెండు పాటలను కంపోజ్ చేశారు. మిగతా పాటలను సాలూరి హనుమంతరావు పూర్తి చేశారు)
మొత్తం చిత్రాలు : వందకు పైగా తెలుగులో, తమిళం-3, కన్నడం-1
నిర్మించిన సినిమాలు : బాలనాగమ్మ (1959), శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972) సినిమా ప్రారంభం కావటానికి పరోక్షంగా సహాయపడ్డారు.
నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.
ఇష్టమైన వాద్యాలు : హార్మోనియం, ఎలక్ట్రికల్ గిటార్, సితార
ఇష్టమైన రాగాలు : మోహనరాగం, హంసధ్వని, హిందోళ
మరణం : 20-02-1973